AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కుండపోత వర్షం.. గోడకూలి 8 మంది మృతి.. పండగపూట తీవ్ర విషాదం!

పండగపూట దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం జరిగింది. రక్షాబంధన్‌ రోజు పలు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. శనివారం నగరంలో కురిసిన భారీ వర్షానికి ఇంటి గోడ కూలి ఇద్దరు పిల్లలు సహా ఎనిమిది మంది మరణించారు. ఆగ్నేయ ఢిల్లీలోని జైత్‌పూర్ ప్రాంతంలో ఉన్న హరినగర్‌లో ఈ సంఘటన జరిగింది. స్థానికంగా ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నిపింది.

కుండపోత వర్షం.. గోడకూలి 8 మంది మృతి.. పండగపూట తీవ్ర విషాదం!
Delhi News
Anand T
|

Updated on: Aug 09, 2025 | 4:14 PM

Share

పండగపూట దేశ రాజధాని ఢిల్లీలోని హరినగర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. గత రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి గొడకూలి ఇద్దరు పిల్లలతో సహా మొత్తం 8 మంది స్థానికులు ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం రాత్రి నుంచి ఢిల్లీలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఈ ప్రమాదం సంభవించింది. భారీ వర్షానికి ఘరినగర్‌లోని పాత ఆలయానికి ఆనుకుని ఉన్న గోడ అకస్మాత్తుగా కూలిపోవడంతో స్థానికంగా నివసిస్తున్న సుమారు 8 మంది జగ్గీలు గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించారు. అయితే హాస్పిటల్‌లో చికిత్స పొందరు వారు మరణించినట్టు పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై స్థానిక పోలీసు అధికారి మాట్లాడుతూ.. ఇక్కడ ఒక పాత ఆలయం ఉంది, దాని పక్కనే స్క్రాప్ డీలర్లు నివసించే పాత జగ్గీలు ఉన్నాయి. రాత్రిపూట కురిసిన భారీ వర్షం కారణంగా గోడ కూలిపోయి ఈ ప్రమాదం జరిగిందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు.. స్థానికంగా ఉన్న జగ్గీలను అక్కడి నుంచి ఖాళీ చేయిస్తున్నామని సీనియర్ పోలీసు అధికారి ఐశ్వర్య శర్మ తెలిపారు.

మరోవైపు గత 24 గంటల నుంచి దేశ రాజధాని ఢిల్లీలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నానే ఉన్నాయి. శనివారం రోజున ఉదయం కురిసిన భారీ వర్షం కారణంగా అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీంతో వాహనదారులతో పాటు పలు ప్రాంతాల్లోని జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే వాతావరణ శాఖ ప్రకారం, శనివారం ఉదయం 8.30 గంటల వరకు 24 గంటల్లో, ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్‌లోని 78.7 మి.మీ వర్షపాతం నమోదు కాగా, ప్రగతి మైదాన్‌లో 100 మి.మీ వర్షపాతం నమోదైనట్టు పేర్కొంది.

అయితే, భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా ఢిల్లీలోని యమునా నది నీటి మట్టం 204.50 మీటర్ల హెచ్చరిక స్థాయికి చేరుకుంది, దీనితో లోతట్టు ప్రాంతాలలో వరదలు వచ్చే అవకాశం ఉందని.. వరద ప్రభావిత ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.