Polavaram: పోలవరం బ్యాక్‌ వాటర్‌పై ఢిల్లీలో కీలక సమావేశం.. 5 రాష్ట్రాల సమావేశంలో తెలంగాణ వాదన ఇదే..

పోలవరం ముంపు ప్రభావంపై ఇవాళ కేంద్ర జల సంఘం ఆధ్వర్యంలో ఢిల్లీలో సాంకేతిక కమిటీ సమావేశం నిర్వహించనుంది. సాంకేతిక కమిటీలోని సభ్యులైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఒడిశా, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు చెందిన ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌లు హాజరుకానున్నారు. ఇవాళ్టి మీటింగ్‌లో సీడబ్లూసీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది? తెలంగాణ వినిపించబోయే వాదనలేంటి? ఇదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది.

Polavaram:  పోలవరం బ్యాక్‌ వాటర్‌పై ఢిల్లీలో కీలక సమావేశం.. 5 రాష్ట్రాల సమావేశంలో తెలంగాణ వాదన ఇదే..
Polavaram Backwater
Follow us
Sanjay Kasula

|

Updated on: Jan 25, 2023 | 8:22 AM

పోలవరంపై ఇవాళ కేంద్ర జల సంఘం(సీడబ్లూసీ) కీలక సమావేశం జరగబోతోంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఐదు రాష్ట్రాలతో కేంద్ర జలశక్తిశాఖ చర్చలు జరపబోతోంది. ఏపీతోపాటు తెలంగాణ, ఒడిషా, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌తో సమావేశం నిర్వహించబోతోంది. ఇంతకీ, పోలవరంపై సీడబ్లూసీ ఏం చర్చించబోతోంది?. సుప్రీంకోర్టు ఏం ఆదేశాలిచ్చింది?. తెలంగాణ, ఒడిషా, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ అభ్యంతరాలేంటి? పోలవరం బ్యాక్‌ వాటర్‌, ఇవాళ్టి మీటింగ్‌కి ఇదే మెయిన్ రీజన్‌. సుప్రీం ఆదేశాలతో గతేడాది సెప్టెంబర్‌లో ఓసారి సమావేశం నిర్వహించింది సీడబ్లూసీ. ఆ తర్వాత ముంపు ప్రభావంపై అధ్యయనం చేసేందుకు టెక్నికల్‌ కమిటీని ఏర్పాటుచేసింది కేంద్ర జలశక్తిశాఖ. అయితే, పోలవరం బ్యాక్‌ వాటర్‌ ఎఫెక్ట్‌పై మరోసారి తెలంగాణ, ఒడిషా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలు సీడబ్లూసీకి కంప్లైంట్స్‌ చేయడంతో ఇవాళ్టి మీటింగ్‌ జరగబోతోంది.

ఫిబ్రవరి 15న పోలవరం బ్యాక్‌ వాటర్‌ కేసు సుప్రీంలో విచారణకు రానుంది. దాంతో, ఇవాళ జరగబోయే సమావేశం కీలకంగా మారబోతోంది. పోలవరం ముంపు ప్రభావిత ప్రాంతాలకు రక్షణ కల్పించడంతోపాటు బాధితులకు పరిహారం, పునరావాసం కల్పించాలనేది తెలంగాణ, ఒడిషా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల డిమాండ్స్‌.

తెలంగాణ అభ్యంతరాలేంటి?

  1. భద్రాచలం, కిన్నెరసాని వైపు 3 కి.మీ మేర ముంపు
  2. నెల్లిపాక నుంచి భద్రాచలం వరకు బ్యాక్ వాటర్‌ ఎఫెక్ట్‌
  3. బూర్గంపాడు, సారపాక, రెడ్డిపాలెం, గుమ్మలూరుకి ముప్పు
  4. బూర్గంపాడులో 300 ఎకరాలకు ముంపు ప్రభావం
  5. ఆరు గ్రామాలు, 891 ఎకరాలకు ముంపు ముప్పు

ముంపు ప్రభావంపై తెలంగాణ వాదనలు

మరోమారు రాష్ట్రంలో ముంపు ప్రభావంపై గట్టి వాదనలను వినిపించేందుకు తెలంగాణ సిద్ధమైంది. ప్రాజెక్టు నిర్మాణం వల్ల 891 ఎకరాల భూమితో పాటు ఆరు గ్రామాలు మునుగుతాయని పేర్కొంది. పోలవరం వల్ల ముంపుపై తెలంగాణ లేవనెత్తిన అంశాలను ఆంధ్రప్రదేశ్‌తో పాటు కేంద్ర జలసంఘం తిరస్కరిస్తున్న నేపథ్యంలో 10 అంశాలతో కూడిన లేఖను మ్యాప్‌లు, ఇతర ఆధారాలతో సహా పంపినట్లు సంబంధితవర్గాల ద్వారా తెలిసింది.

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ నేతృత్వంలో తెలంగాణ, ఏపీ, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా రాష్ట్రాల అభిప్రాయాలను సీడబ్ల్యూసీ నమోదు చేస్తోంది. సమావేశానికి తెలంగాణ నుంచి ఈఎన్‌సీ మురళీధర్‌ హాజరుకానున్నారు. ఈక్రమంలో మంగళవారం హైదరాబాద్‌ జలసౌధలో ప్రాజెక్టు ముంపుపై ఇంజినీర్లు కసరత్తు చేశారు.

ఫిబ్రవరిలో సీఎంలతో సమావేశం..

ఇదిలావుంటే.. పోలవరం ప్రాజెక్టు వెనకజలాల ముంపుపై కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి మొదటి వారంలో తెలంగాణ, ఏపీ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల సీఎంలతో సమావేశం ఏర్పాటు చేయనుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం