Gold Seized: గోల్డ్ స్మగ్లర్ల కొత్త దారి.. కాఫీ ప్లాస్కోలో బంగారం.. అది చూసి అధికారుల షాక్..
కస్టమ్స్ ముందు గోల్డ్ స్మగ్లర్ల ఆటలు సాగలేదు. మీరు ఏ రూట్లో వచ్చినా... మేం పట్టుకుంటామ్.. అంటూ మరోసారి నిరూపించారు మన అధికారులు. ఒకరు కాదు... ఇద్దరు కాదు ఏకంగా 18మంది..

ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కొత్త తరహా గోల్డ్ స్మగ్లింగ్ కథ బయటపడింది. అవును, ఇంతకు ముందెన్నడూ చూడనివిధంగా గోల్డ్ స్మగ్లింగ్‌కి ప్రయత్నించారు. అయితే, కస్టమ్స్ ముందు గోల్డ్ స్మగ్లర్ల ఆటలు సాగలేదు. మీరు ఏ రూట్లో వచ్చినా… మేం పట్టుకుంటామ్.. అంటూ మరోసారి నిరూపించారు మన అధికారులు. ఒకరు కాదు… ఇద్దరు కాదు ఏకంగా 18మంది పట్టుబడ్డారు ముంబై ఎయిర్‌పోర్ట్‌లో. నైరోబి నుంచి పెద్దఎత్తున గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్న మహిళలను కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. మహిళల నుంచి 3.85 కిలోల గోల్డ్‌ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గోల్డ్ వాల్యూ కోటిన్నరకు పైగా ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు.
వీళ్లంతా నైరోబి నుంచి షార్జా మీదుగా ఇండియా వచ్చారు. ఒకే ఫ్లైట్‌లో ముంబై చేరుకున్నారు. అండర్ గార్మెంట్స్, బూట్లు, కాఫీ బాటిల్స్, ఫుడ్ ఐటెమ్స్‌లో వెరీ స్మాల్ సైజ్‌లో గోల్డ్‌ను క్యారీ చేస్తూ కస్టమ్స్‌ను బురిడీ కొట్టించాలని చూశారు. కానీ, వీళ్ల ఆట కట్టించారు ముంబై ఎయిర్‌పోర్ట్ అధికారులు.
Mumbai Airport Customs intercepted a number of passengers who had ingeniously concealed gold and seized 3.8 kg Gold valued at Rs. 1.52 Crore from them. the Gold was found hidden in Coffee flask full of Coffee, in footwear and also in hair clutches. pic.twitter.com/gaS62HMLrH
— Mukesh singh sengar मुकेश सिंह सेंगर (@mukeshmukeshs) December 20, 2021
ఇవి కూడా చదవండి: Byreddy Siddharth Reddy: బైరెడ్డా.. మజాకా.. సీఎంకు బర్త్ డే విషెస్ ఎలా చెప్పాడో చూడండి
Viral Video: ఎలక్ట్రిక్ ఈల్‌ను వేటాడాలనుకున్న మొసలి.. షాకింగ్.. ఊహించని విషాదాంతం..




