Reliance Foundation: పెద్ద మనసును చాటుకున్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌.. వెయ్యి పడకలతో కోవిడ్‌ ఆస్పత్రి.. ఎక్కడంటే

Reliance Foundation: దేశంలో కరోనా మహమ్మారి కాలరాస్తోంది. రోజురోజుకు లక్షల్లో పాజిటివ్‌ కేసలు, వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. దేశంలో అన్ని రాష్ట్రాల్లో కరోనా రోగులతో..

Reliance Foundation: పెద్ద మనసును చాటుకున్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌.. వెయ్యి పడకలతో కోవిడ్‌ ఆస్పత్రి.. ఎక్కడంటే
Reliance Foundation
Follow us

|

Updated on: Apr 30, 2021 | 9:08 PM

Reliance Foundation: దేశంలో కరోనా మహమ్మారి కాలరాస్తోంది. రోజురోజుకు లక్షల్లో పాజిటివ్‌ కేసలు, వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. దేశంలో అన్ని రాష్ట్రాల్లో కరోనా రోగులతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు నిండిపోతున్నాయి. బెడ్లు సైతం దొరకని పరిస్థితి నెలకొంది. ఆక్సిజన్‌ కొరత కూడా ఏర్పడుతోంది. ఈ తరుణంలో దేశీయ అతిపెద్ద పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) పెద్దమనసు చాటుకుంది. రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో గుజరాత్‌లో జామ్‌నగర్‌లో కరోనా రోగుల కోసం పెద్ద కోవిడ్‌ ఆస్పత్రిని ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. వెయ్యి పడకల కోవిడ్‌ ఆస్పత్రిని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. మొదటి దశలో 400 పడకలు ఒక వారంలో, మరో 600 పడకలు మరో వారంలో సిద్ధంగా ఉంటాయని రిలయన్స్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకురాలు, చైర్‌ పర్సన్‌ నీతా అంబానీ ప్రకటించారు.

ఆర్‌ఐఎల్‌ చెందిన రిలయన్స్‌ పౌండేషన్‌ గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఆక్సిజన్‌ సౌకర్యంతో ఈ కోవిడ్‌ ఆస్పత్రిని ఏర్పాటు చేస్తుంది. అంతేకాదు ఈ కోవిడ్‌ కేర్‌ ఫెసిలిటీలో అన్ని సేవలను ఉచితంగా అందిస్తామని ప్రకటించింది. అయితే నాణ్యమైన పేవలు ఉచితంగా అందిస్తామని నీతా అంబానీ పేర్కొన్నారు. గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ అభ్యర్థనకు ప్రతిస్పందనగా ఆర్‌ఐఎల్‌ ఈ నిర్ణయం తీసుకుందని ఆమె తెలిపారు. వచ్చే ఆదివారం నాటికి జామ్‌నగర్‌లో రిలయన్స్‌ ఇండస్ట్రీ 400 పడకల ఆస్పత్రిని ప్రారంభం అవుతుందని వెల్లడించారు.ఆ తర్వాత వారంలో వెయ్యి పడకల సామర్థ్యాన్ని పెంచుతామన్నారు.

ఇవీ కూడా చదవండి:

Remdesivir Medicine: రెమిడెసివిర్‌ కొరతకు చెక్‌ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

May1, 2021 New Rules: అలర్ట్‌.. రేపటి నుంచి ఈ ఐదు అంశాల్లో మార్పులు.. పూర్తి వివరాలు తెలుసుకోండి

Special Trains: దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన.. పలు రైళ్లు పొడిగింపు.. మరికొన్ని సర్వీసులు రద్దు..!

సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు
పార్లమెంట్‌ ఎన్నికల్లో హీరో ఎవరు? జీరో ఎవరు?
పార్లమెంట్‌ ఎన్నికల్లో హీరో ఎవరు? జీరో ఎవరు?
ఎండుద్రాక్షను నానబెట్టిన నీటితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??
ఎండుద్రాక్షను నానబెట్టిన నీటితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??
భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా
భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా
టీమ్ నుంచి దొబ్బేయ్! 14 కోట్ల ప్లేయర్‌పై CSK ఫ్యాన్స్ ట్రోలింగ్
టీమ్ నుంచి దొబ్బేయ్! 14 కోట్ల ప్లేయర్‌పై CSK ఫ్యాన్స్ ట్రోలింగ్
ప్రమాదానికి గురైన కేసీఆర్ కాన్వాయ్.. తప్పిన పెను ప్రమాదం..
ప్రమాదానికి గురైన కేసీఆర్ కాన్వాయ్.. తప్పిన పెను ప్రమాదం..
ఉల్లి రసంలో వీటిని కలిసి అప్లై చేయండి.. ఒత్తైన జుట్టు మీ సొంతం
ఉల్లి రసంలో వీటిని కలిసి అప్లై చేయండి.. ఒత్తైన జుట్టు మీ సొంతం