Indian Railway: ఆ ప్రాంతాల్లో పెరిగిన రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ధరలు.. ఏకంగా రూ.50కి పెంపు.. ఎందుకంటే..?

Platform ticket price raised: కరోనావైరస్ దేశంలో మరోసారి తీవ్ర రూపం దాలుస్తోంది. పలు ప్రాంతాల్లో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రభుత్వాలు చర్యలు ప్రారంభించాయి. ఇప్పటికే మహారాష్ట్ర, కేరళ ప్రాంతాల్లో

Indian Railway: ఆ ప్రాంతాల్లో పెరిగిన రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ధరలు.. ఏకంగా రూ.50కి పెంపు.. ఎందుకంటే..?
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 03, 2021 | 9:57 AM

Platform ticket price raised: కరోనావైరస్ దేశంలో మరోసారి తీవ్ర రూపం దాలుస్తోంది. పలు ప్రాంతాల్లో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రభుత్వాలు చర్యలు ప్రారంభించాయి. ఇప్పటికే మహారాష్ట్ర, కేరళ ప్రాంతాల్లో కేసులు పెరుగుతుండటంతో.. ప్రభుత్వాలు ఆంక్షలు విధించాయి. మహారాష్ట్రలో పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్ కూడా విధించారు. ఈ నేపథ్యంలో మెట్రోపాలిటిన్ ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు ప్రారంభించింది. ప్లాట్‌ఫామ్ టికెట్ ధరను రూ.10 నుంచి ఏకంగా రూ.50కి పెంచుతూ రైల్వే నిర్ణయం తీసుకుంది. ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంతో రద్దీని తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సెంట్రల్ రైల్వే వెల్లడించింది. మెట్రోపాలిటిన్ సిటీల్లో ప్లాట్‌ఫామ్ టిక్కెట్ ధరను రూ.10 నుంచి ఏకంగా 50 రూపాయలకు పెంచినట్లు అధికారులు వెల్లడించారు.

ప్రధాన రైల్వే స్టేషన్లలో ఈ ధరలను తక్షణమే అందుబాటులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. మార్చి 1 నుంచి ప్లాట్‌ఫాం ధరలను పెంచినట్లు సెంట్రల్ రైల్వే పీఆర్వో శివాజీ సుతార్ తెలిపారు. అయితే జూన్ 15 వరకు ఈ ధరలు అమల్లో ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. కరోనా విజృంభిస్తున్న కారణంగా ఆయా రైల్వే స్టేషన్లలో రద్దీని తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

సాధారణంగా పండగల సమయంలో రైల్వే స్టేషన్లలో రద్దీని నియంత్రించేందుకు ప్లాట్‌ఫాం టికెట్ ధరలను రెట్టింపు చేస్తారని కానీ..ఇలాంటి సందర్భంగా ఒకేసారి ఐదు రెట్లు పెంచడం చర్చనీయాంశంగా మారింది. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, దాదర్ అండ్ లోకమాన్య తిలక్ టెర్మినస్‌తో పాటు థానే, కల్యాణ్, పన్వేల్, భీవాండీ రైల్వే స్టేషన్లలో ఈ పెంచిన ధరలు అమల్లోకి వస్తాయని సెంట్రల్ రైల్వే వెల్లడించింది. .

Also Read: