India Covid-19: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. నిన్న ఎంతమంది చనిపోయారంటే..?
India Coronavirus Updates: దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గుముఖం పడుతోంది. థర్డ్ వేవ్ అనంతరం రెండేళ్ల కనిష్టనికి కేసుల సంఖ్య చేరింది. రోజురోజుకి కేసుల సంఖ్య భారీగా తగ్గుతూ వస్తోంది.
India Coronavirus Updates: దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గుముఖం పడుతోంది. థర్డ్ వేవ్ అనంతరం రెండేళ్ల కనిష్టనికి కేసుల సంఖ్య చేరింది. రోజురోజుకి కేసుల సంఖ్య భారీగా తగ్గుతూ వస్తోంది. గడిచిన 24 గంటల్లో 6 వేలకు దిగువన కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా శనివారం 5,476 కరోనా కేసులు (Coronavirus) నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 158 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ (Health Ministry) ఆదివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో డైలీ పాజిటివిటీ రేటు 0.60 శాతం ఉన్నట్లు కేంద్రం తెలిపింది. దేశంలో ప్రస్తుతం 59,442 (0.14%) కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మహమ్మారి కేసుల సంఖ్య 4,29,62,953 కి పెరిగాయి. దీంతోపాటు ఈ మహమ్మారితో ఇప్పటివరకు 5,15,036 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు.
గత 24 గంటల్లో దేశం మొత్తం 9,754 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 4,23,88,475 కి చేరింది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 98.66 శాతానికిపైగా ఉంది.
ఇదిలాఉంటే.. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 1,78,83,79,249 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు. నిన్న దేశంలో 26,19,778 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు.
#COVID19 ??Update 06/03/22:
Total no
Cases- 4,29,62,953 Active- 59,442 Recoveries- 4,23,88,475 ?- 5,15,036 Test- 77,28,24,246 ?nation- 1,78,83,79,249?26,19,778
Today
Cases- 5476?445 Active- (-4436)?1583 Recovery- 9754?1897 ?- 158?131 Test- 9,09,985?30920
— Manish Raj ?? (@AdvManishRaj) March 6, 2022
కాగా.. మార్చి 5 వరకు 77.28 కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) వెల్లడించింది. వీరిలో శనివారం 9,09,985 నమూనాలను పరీక్షించారు.
#Unite2FightCorona#LargestVaccineDrive#OmicronVariant
????? ?????https://t.co/4scc4woVAh pic.twitter.com/uUAW9jT9ci
— Ministry of Health (@MoHFW_INDIA) March 6, 2022
Also Read: