ఖతర్నాక్‌ కరోనా వైరస్‌ ఖాళీ ఇళ్లల్లోనూ ఉంటుందట!

మాయదారి కరోనా గురించి రోజుకో కబురు చెబుతూ కలవరం కలిగిస్తున్నారు సైంటిస్టులు.. సోషల్‌ డిస్టెన్సింగ్‌తో కరోనాను దూరం పెట్టవచ్చని చెప్పినవారే గాల్లోంచి కూడా కరోనా వ్యాప్తి చెందవచ్చనే చేదువార్త చెప్పారు.

ఖతర్నాక్‌ కరోనా వైరస్‌ ఖాళీ ఇళ్లల్లోనూ ఉంటుందట!
Follow us
Balu

|

Updated on: Aug 29, 2020 | 12:15 PM

మాయదారి కరోనా గురించి రోజుకో కబురు చెబుతూ కలవరం కలిగిస్తున్నారు సైంటిస్టులు.. సోషల్‌ డిస్టెన్సింగ్‌తో కరోనాను దూరం పెట్టవచ్చని చెప్పినవారే గాల్లోంచి కూడా కరోనా వ్యాప్తి చెందవచ్చనే చేదువార్త చెప్పారు. మళ్లీ ఇప్పుడేమో ఎవరూ లేని చోట కూడా కరోనా ఆనవాళ్లు ఉన్నాయంటూ బాంబు పేల్చారు.. వాడకుండా ఉన్న అపార్ట్‌మెంట్లలోని టాయిలెట్లలో వైరస్‌ జాడను కనిపెట్టినట్టు తాజా అధ్యయనం చెబుతోంది.. కొన్నాళ్లుగా ఖాళీగా ఉన్న ఇంట్లో కరోనా వైరస్‌ ఉంటుందని ఎవరైనా అనుకుంటామా చెప్పండి? కానీ ఆ ఇంట్లోని కిచెన్‌లో.. బాత్‌రూమ్‌లో కరోనా వైరస్‌ను గుర్తించారట చైనీస్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ పరిశోధకులు. ఖాళీగా ఉన్న ఫ్లాట్‌ కింద పోర్షన్‌లో ఉన్నవారికి కరోనా సోకింది.. వారికి ఎలా అంటుకున్నదోనని పరిశోధన చేస్తే అసలు విషయం తెలిసింది.. ఖాళీగా ఉన్న ఇంట్లో వైరస్‌ ఆనవాళ్లను గుర్తించారు.. టాయిలెట్‌ ఫ్లష్‌ స్పీడ్‌కు కరోనా వైరస్‌ పైపులా గుండా కింద పోర్షన్‌ టాయిలెట్‌కు చేరిందట! అదీ కాకుండా వైరస్‌తో బాధపడుతున్నవారి మలంలో వైరస్‌ ఎక్కువగా ఉంటుందట! ఆ వైరస్‌ గాలి ద్వారా ఇతర అపార్ట్‌మెంట్లకు చేరే అవకాశాలు లేకపోలేదని పరిశోధకలు అంటున్నారు. హాస్పిటల్స్‌లో ఇలాంటి ముప్పు ఎక్కువేనంటున్నారు. నీటి సదుపాయం సరిగా లేని చోట్ల కూడా కరోనా వైరస్‌ వ్యాపించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు పరిశోధకులు.. తస్మాత్‌ జాగ్రత్త!