Corona Virus: కర్ణాటకలో వెలుగులోకి వచ్చిన డెల్టా ఏవై.4.2 వేరియంట్.. 7 కేసులు నమోదు

Corona Virus: యూకే, రష్యా, అమెరికా, ఇజ్రాయిల్ వంటి దేశాల్లో విస్తరిస్తున్న డెల్టా ఏవై.4.2 వేరియంట్ మనదేశంలో కూడా అడుగు పెట్టింది. తాజాగా కర్ణాటక లో ఏడు కేసులు..

Corona Virus: కర్ణాటకలో వెలుగులోకి వచ్చిన డెల్టా ఏవై.4.2 వేరియంట్.. 7 కేసులు నమోదు
Corona
Follow us
Surya Kala

|

Updated on: Oct 28, 2021 | 10:01 AM

Corona Virus: యూకే, రష్యా, అమెరికా, ఇజ్రాయిల్ వంటి దేశాల్లో విస్తరిస్తున్న డెల్టా ఏవై.4.2 వేరియంట్ మనదేశంలో కూడా అడుగు పెట్టింది. తాజాగా కర్ణాటక లో ఏడు కేసులు నమోదయ్యాయని ఆ రాష్ట్ర వైద్య సిబ్బంది ప్రకటించింది.  బెంగళూరు లో మూడు కేసులు.. రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో నాలుగు కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ డి రణదీప్ తెలిపారు. అయితే రాష్ట్రంలో కోవిడ్-19 కేసులు అదుపులో ఉన్నాయని, విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే వారికి కఠిన నిబంధనలు  అమలు చేస్తున్నామని తెలిపారు.  విదేశాల నుంచి వచ్చేవారికి  RT-PCR పరీక్ష 72 గంటల ముందు చేయించుకున్న నెగిటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి చేసిందని రణదీప్ తెలిపారు. తమ పరీక్ష రిపోర్ట్ ను ఎయిర్ సువిధ అనే పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని చెప్పారు. అప్పుడు విదేశాల నుంచి వచ్చిన వ్యక్తుల ను నిర్బంధించడం వంటి ఎటువంటి ఆంక్షలు లేవు” అని రణదీప్ స్పష్టం చేశారు.

ఇక ఇప్పటికే కొన్ని విదేశాలలో వ్యాపించిన కరోనా వైరస్ లో ఒక వేరియంట్ డెల్టా వేరియెంట్..ను తనిఖీ చేయడానికి కేంద్రం,  రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టనున్నామని చెప్పారు. అయితే ఇప్పటి వరకూ ఈ కొత్త వేరియంట్ తో ఇప్పటి వరకూ ఎవరూ మృతి చెందలేదని.. ఇద్దరు వ్యక్తులు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని రణదీప్ చెప్పారు.

ఈ వేరియెంట్‌ తొలి సారిగా జూలైలో యూకేలో బయటపడింది. రోజు రోజుకీ భారీ సంఖ్యలో కేసులు నమోదవుతూ యుకేని వణికిస్తుంది. ఇదే వేరియెంట్ కేసులు అగ్రరాజ్యం అమెరికా, రష్యా, ఇజ్రాయెల్‌లో కూడా నమోదవుతున్నాయి. డెల్టా వేరియెంట్‌ వెలుగులోకి వచ్చిన అనంతరం ఇప్పటి వరకూ 55 సార్లు జన్యుపరమైన మార్పులు చేసుకున్న సంగతి తెలిసిందే.

Also Read: ప్రపంచప్రఖ్యాత జ్యోతిష్కుడు చెయిరోగా ప్రభాస్.. సరికొత్త కోణంలో అంటూ టాక్..