అప్పుడు స్పానిష్ ఫ్లూ.. ఇప్పుడు కరోనాను జయించిన కురు వృద్ధుడు

ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం కొనసాగుతోంది. చిన్న-పెద్ద, ధనిక-పేద, కులం- మతంతో సంబంధం లేకుండా ఈ వైరస్ సోకుతుంది.

అప్పుడు స్పానిష్ ఫ్లూ.. ఇప్పుడు కరోనాను జయించిన కురు వృద్ధుడు
Follow us

| Edited By:

Updated on: Jul 06, 2020 | 7:07 AM

ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం కొనసాగుతోంది. చిన్న-పెద్ద, ధనిక-పేద, కులం- మతంతో సంబంధం లేకుండా ఈ వైరస్ సోకుతుంది. ఈ క్రమంలో కరోనా సోకిన వారి సంఖ్య కోటిని దాటేయగా.. 5 లక్షలకు పైగా మరణాలు సంభవించాయి. 65లక్షల మందికి పైగా కరోనాను జయించారు. ఇదిలా ఉంటే 102 ఏళ్ల ముందు స్పానిష్‌ ఫ్లూను జయించిన ఓ వ్యక్తి.. ఇప్పుడు కరోనాను జయించాడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది.

1918లో నాలుగేళ్ల వయసులో ఓ వ్యక్తి స్పానిష్‌ ఫ్లూ బారిన పడి కోలుకోగా.. తాజాగా 106 ఏళ్ల వయస్సులో కరోనాను జయించాడు. ఈ వైరస్‌ నుంచి పూర్తిగా కోలుకున్న ఆ కురు వృద్ధుడు నెల రోజుల క్రితం ఓ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు. ఆయన కుటుంబంలో పలువురికి కరోనా సోకగా.. వారందరి కంటే ముందుగా ఈ కురు వృద్ధుడు కోలుకోవడం విశేషం. ఆ తరువాత కుటుంబ సభ్యులు కరోనా నుంచి కోలుకున్నారు. ఇలా రెండు మహమ్మారులను జయించిన వ్యక్తి ఢిల్లీలో ఇతడేనని అధికారులు చెబుతున్నారు.