దేశంలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు… పెరుగుతున్న రికవరీ కేసుల సంఖ్య.. మరణాలు మాత్రం ఎన్నంటే…

దేశంలో క్రమంగా కరోనా వైరస్ తగ్గుముఖం పడుతుంది. గత కొద్ది రోజులుగా 40వేలకు తక్కువనే కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. గురువారం దేశ వ్యాప్తంగా

  • Pardhasaradhi Peri
  • Publish Date - 11:55 am, Fri, 4 December 20
దేశంలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు... పెరుగుతున్న రికవరీ కేసుల సంఖ్య.. మరణాలు మాత్రం ఎన్నంటే...

corona updates in India: దేశంలో క్రమంగా కరోనా వైరస్ తగ్గుముఖం పడుతుంది. గత కొద్ది రోజులుగా 40వేలకు తక్కువనే కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. గురువారం దేశ వ్యాప్తంగా 11,70,102 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. అందులో కొత్తగా 36,595 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 95,71,559కి చేరింది.

ఇండియాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య కంటే రికవరీ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తుంది. ఇతర దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో రికవరీ కేసుల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఇప్పటివరకు 90,16,289 మంది ఈ మహమ్మరి నుంచి కోలుకోగా.. గురువారం ఒక్కరోజే 540 మంది మృతి చెందారు. మొత్తం కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 1,39,188కు చేరింది.

ప్రపంచంలో 6.5 కోట్లు దాటిన కొవిడ్ కేసులు:
కంటికి కనిపించకుండా మొత్తం ప్రపంచాన్ని వణికిస్తున్నా కరోనా వైరస్..తన ప్రభావాన్ని మరింత విజృంభిస్తునే ఉంది. అమెరికా సహ అన్ని దేశాల ఆర్థిక స్థితిగతులను చిన్నభిన్నాం చేసింది. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా ఈ కరోనా వైరస్ కేసుల సంఖ్య 6.5 కోట్లు దాటినట్లుగా ప్రముఖ జాన్స్ హాప్‏కీన్స్ యూనివర్సిటీ వెల్లడించింది. ఇప్పటివరకు 6,50,48,192 మంది ఈ వైరస్ బారిన పడగా.. మొత్తం 15 లక్షలకు పైగా మరణాలు సంభవించాయి.

ఇంకా చదవండి: ఏపీలో పెరిగిన కరోనా పరీక్షలు.. కొత్తగా 1,031 మందికి పాజిటివ్‌.. 8 మంది మృతి..

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 862 కొత్త కేసులు.. ముగ్గురు మృతి.. కోలుకున్న 961 మంది