ఏపీలో పెరిగిన కరోనా పరీక్షలు.. కొత్తగా 1,031 మందికి పాజిటివ్‌.. 8 మంది మృతి..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. ఈ సారి కరోనా నిర్ధారణ పరీక్షలు భారీగా నిర్వహించినా, కేసులు మాత్రం స్వల్పంగా నమోదవుతున్నాయి.

  • Balaraju Goud
  • Publish Date - 5:50 pm, Thu, 26 November 20
ఏపీలో పెరిగిన కరోనా పరీక్షలు.. కొత్తగా 1,031 మందికి పాజిటివ్‌.. 8 మంది మృతి..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. ఈ సారి కరోనా నిర్ధారణ పరీక్షలు భారీగా నిర్వహించినా, కేసులు మాత్రం స్వల్పంగా నమోదవుతున్నాయి. గురువారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో 67,269 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 1,031 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా సోకినవారి సంఖ్య 8,65,705కి చేరుకుంది.

ఇక గడిచిన 24 గంటల వ్యవధిలో కరోనా మహమ్మారి బారిన పడి ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. కృష్ణా జిల్లాలో ఇద్దరు, తూర్పు గోదావరిలో ఒకరు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకరు, గుంటూరులో ఒకరు, కడప జిల్లాలో ఒకరు, కర్నూలు జిల్లాలో ఒకరు, విశాఖ జిల్లాలో ఒకరు చొప్పున కరోనాతో మరణించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 6,970కు చేరిందని వైద్యారోగ్య శాఖ పేర్కొంది.


అలాగే రాష్ట్రంలో డిశ్చార్జిలు స్వల్పంగా పడిపోయాయి. బుధవారం 1,081 మంది కోవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో 8,46,120 మంది కరోనా మహమ్మారి నుంచి పూర్తి కోలుకుని డిశ్చార్జి కాగా, ప్రస్తుతం 12,615 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 98,55,316 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.

ఇక, జిల్లాల వారిగా కేసులు పరిశీలిస్తేః