యాంటీ లవ్ జిహాద్ చట్టం అమలుతో మతాంతర వివాహానికి బ్రేక్ ! యూపీలో తొలి అడుగు

మత మార్పిడులను నివారించేందుకు యూపీ ప్రభుత్వం తెచ్చిన చట్టం అప్పుడే ఫలితాలను ఇవ్వడం ప్రారంభించింది. లక్నోలో ఓ హిందూ యువతికి, ముస్లిం యువకునికి మధ్య జరగనున్న వివాహాన్ని పోలీసులు అడ్డుకున్నారు.

యాంటీ లవ్ జిహాద్ చట్టం అమలుతో మతాంతర వివాహానికి బ్రేక్ ! యూపీలో తొలి అడుగు
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Dec 04, 2020 | 11:29 AM

మత మార్పిడులను నివారించేందుకు యూపీ ప్రభుత్వం తెచ్చిన చట్టం అప్పుడే ఫలితాలను ఇవ్వడం ప్రారంభించింది. లక్నోలో ఓ హిందూ యువతికి, ముస్లిం యువకునికి మధ్య జరగనున్న వివాహాన్ని పోలీసులు అడ్డుకున్నారు. బుధవారం ఈ వెడ్డింగ్ లక్నోలోని పారా ఏరియాలో జరగనుండగా ఖాకీలు అక్కడకు చేరుకొని ఆపేశారు. మత మార్పిడుల నిరోధక చట్టం ఆర్డర్ కాపీని చూపారు. ఉభయ పక్షాలనూ పోలీసు స్టేషనుకు రావాల్సిందిగా కోరారు. పెళ్ళికి ముందు వీరు జిల్లా మేజిస్ట్రేట్ నుంచి అనుమతి పొందాలని సూచించారు. చట్టం ప్రకారం తాము మేజిస్ట్రేటుకు దరఖాస్తు చేస్తామని వారు చెప్పారని, ఈ మేరకు లిఖిత పూర్వకంగా రాశారని పోలీసులు తెలిపారు.

ఈ పెళ్ళికి ఉభయ కుటుంబాల నుంచి ఎలాంటి అభ్యంతరమూ లేదని తెలిసినట్టు పోలీసులు చెప్పారు. అయితే వివాహం తరువాత మత మార్పిడి జరిగినట్టు తేలితే అది ఇక నేరమవుతుంది. ఈ నేరం కింద మూడేళ్ళ నుంచి పదేళ్ల వరకు జైలుశిక్ష, 25 వేల రూపాయల జరిమానా విధిస్తారు. కాగా -తాజాగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ విధమైన చట్టం తెచ్చే యోచనలో ఉంది. నిన్నటికి నిన్న ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్.. మత మార్పిడుల నిరోధక చట్టాన్ని త్వరలో తెస్తామని ప్రకటించారు.