అడ్డుకున్నందుకు పోలీసును 200 మీటర్లు కారుతో లాక్కెళ్లి..!

అడ్డుకున్నందుకు పోలీసును 200 మీటర్లు కారుతో లాక్కెళ్లి..!

కరోనాకు అడ్డుకట్టవేసేందుకు లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేసేందుకు రేయింబవళ్లు కష్టపడుతున్నారు పోలీసులు. అయితే వారిపై కొందరు అమానుషంగా వ్యవహరిస్తున్నారు.

TV9 Telugu Digital Desk

| Edited By:

May 02, 2020 | 7:51 PM

కరోనాకు అడ్డుకట్టవేసేందుకు లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేసేందుకు రేయింబవళ్లు కష్టపడుతున్నారు పోలీసులు. అయితే వారిపై కొందరు అమానుషంగా వ్యవహరిస్తున్నారు. కుటుంబాన్ని వదిలి మన కోసం కష్టపడుతున్నారనే కనీస జాలి కూడా లేకుండా పోలీసులపై దాడులు చేస్తున్నారు. ఆ మధ్యన పంజాబ్‌లో లాక్‌డౌన్‌ విధుల్లో ఉన్న పోలీస్‌ చేయిని ఓ వ్యక్లి నరికివేయగా.. మరోచోట వివరాలు అడిగిన పోలీస్‌పై ఓ యువతి డాక్యుమెంట్లు విసిరేసి హల్‌చల్ చేసింది. తాజాగా అడ్డుకున్నందుకు పోలీసుపై ఓ వ్యక్తి కారుతో దాడికి యత్నించాడు. ఈ సంఘటన ;పంజాబ్‌ జలంధర్‌లోని మిల్క్‌ చౌక్‌ చెక్‌పోస్ట్ వద్ద చోటుచేసుకుంది.

మిల్క్‌చౌక్ వద్ద ఏఎస్‌ఐ ముల్క్‌రాజ్‌ సహా మరికొందరు పోలీసులు విధులు నిర్వహిస్తుండగా.. అటుగా వచ్చిన ఓ కారును ముల్క్‌రాజ్‌ అడ్డుకొని, కర్ఫ్యూ పాస్ చూపించమన్నారు. దాంతో ఆ వ్యక్తి కారును వేగంగా ముందుకు పోనిచ్చాడు. ఈ ప్రమాదాన్ని ముందే గ్రహించిన ముల్కరాజ్‌ కారు బానెట్‌పైకి దూకి పట్టుకున్నాడు. ఆయన కారుపై ఉండగానే.. ఆ వ్యక్తి 200 మీటర్ల దూరం వాహనాన్ని తీసుకెళ్లాడు. అక్కడే ఉన్న మిగిలిన పోలీసులు పరుగెత్తికెళ్లి కారును అడ్డుకుని.. ముల్క్‌రాజ్‌ను రక్షించారు. ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ సుర్జీత్ సింగ్ తెలిపారు.

Read This Story Also: కరోనా నియంత్రణకు ‘ఇమ్యునోథెరపీ’.. అమెరికా కంపెనీతో ఒప్పందం..!

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu