Black Box: దొరికిన బ్లాక్ బాక్స్.. ఏం జరిగింది..? ఏముంది..? పైలట్‌ బిపిన్‌ రావత్‌తో ఏం మాట్లాడారు..

ప్రమాదానికి కీలకమైన బ్లాక్‌ బాక్స్‌ను కొద్దిసేపటి క్రితమే ఘటనాస్థలంలో సేకరించింది ఢిల్లీ నుంచి వచ్చిన టీమ్‌. హెలికాఫ్టర్‌ కూలిన ప్రాంతానికి 30 అడుగుల దూరంలో బ్లాక్‌బాక్స్‌ను గుర్తించిన అధికారులు..

Black Box: దొరికిన బ్లాక్ బాక్స్.. ఏం జరిగింది..? ఏముంది..? పైలట్‌ బిపిన్‌ రావత్‌తో ఏం మాట్లాడారు..
Black Box
Follow us
Sanjay Kasula

|

Updated on: Dec 09, 2021 | 10:50 AM

ఏం జరిగింది..? అసలేం జరిగింది..? ప్రమాదానికి కొన్ని క్షణాల ముందు దట్టమైన అటవీ ప్రాంతంలో ఏం జరిగింది..? ఆర్మీ హెలికాఫ్టర్‌ క్రాష్‌ ల్యాండింగ్‌కు అసలు కారణమేంటి.? దట్టమైన పొగమంచే కారణమా..? అన్న అంశంపై దర్యాప్తు కొనసాగుతోంది. అయితే ప్రమాదానికి కీలకమైన బ్లాక్‌ బాక్స్‌ను కొద్దిసేపటి క్రితమే ఘటనాస్థలంలో సేకరించింది ఢిల్లీ నుంచి వచ్చిన టీమ్‌. హెలికాఫ్టర్‌ కూలిన ప్రాంతానికి 30 అడుగుల దూరంలో బ్లాక్‌బాక్స్‌ను గుర్తించిన అధికారులు.. బ్లాక్‌ బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. డీకోడింగ్‌కు ఢిల్లీ లేదా బెంగళూరుకు తరలించే అవకాశముంది. ప్రమాద స్థలంలో బ్లాక్‌ బాక్స్‌తో పాటు మరో 3 ఇతర వస్తువులను సేకరించారు.

అయితే అసలు ఆ బ్లాక్‌బాక్స్‌లో ఏముంది..? ప్రమాదానికి ముందు అసలు ఏం జరిగింది..? పైలట్‌ బిపిన్‌ రావత్‌తో ఏం మాట్లాడారు..? ప్రమాదం జరిగిన సమయంలో ATCతో కాంటాక్ట్‌ అయ్యే ప్రయత్నం చేశారా..? అసలేం జరిగిందన్నది ఆ బ్లాక్‌ బాక్స్‌ ద్వారా పూర్తి సమాచారాన్ని సేకరించనున్నారు అధికారులు. ఆ బ్లాక్‌ బాక్స్‌ను డీకోడింగ్‌ చేస్తే ప్రమాదానికి అసలు కారణమేంటన్న అంశంపై క్లారిటీ రానుంది.

ఇక IAF చీఫ్‌ ఎయిర్‌ మార్షల్‌ వీఆర్‌ చౌదరి కూనూర్‌లో హెలికాఫ్టర్‌ ప్రమాదస్థలాన్ని పరిశీలించారు. తమిళనాడు డీజీపీ శైలేంద్రబాబుతో కలిసి ఆ ప్రాంతాలను పరిశీలించారు. ఫోరెన్సిక్‌ నిపుణులు కూడా ఆ ప్రాంతంలో ఆధారాలను సేకరించారు.

ఇవి కూడా చదవండి: Army Helicopter Crash: హెలికాప్టర్‌ ప్రమాదానికి ముందు సాయితేజ తన భార్యతో వీడియో కాల్‌.. పిల్లలతో కొద్దిసేపు సరదాగా..

Black Box not yet found: అసలేం జరిగింది..? బ్లాక్‌బాక్స్‌ ఎక్కడా..? ప్రమాద స్థలంలో వెతుకుతున్న అధికారులు..