ముంబై హోటళ్లకు సేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేల తరలింపు
మహారాష్ట్ర రాజకీయం ఇంకా రంజుగా సాగుతోంది. రాష్ట్రంలో ‘ నిశ్శబ్దంగా ‘ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోను, కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేయడంతోను.. శివసేన, కాంగ్రెస్, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. తమ ఎమ్మెల్యేలను బీజేపీ ‘ ఎగరేసుకుపోకుండా ‘ చూసేందుకు ఈ పార్టీలు వారిని ముంబైలోని లగ్జరీ హోటళ్లకు తరలిస్తున్నాయి. అసెంబ్లీలో వెంటనే మెజారిటీని నిరూపించుకోవాలని సుప్రీంకోర్టు బీజేపీని ఆదేశించకపోయినప్పటికీ.. ఒకవేళ సోమవారం ఈ మేరకు […]
మహారాష్ట్ర రాజకీయం ఇంకా రంజుగా సాగుతోంది. రాష్ట్రంలో ‘ నిశ్శబ్దంగా ‘ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోను, కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేయడంతోను.. శివసేన, కాంగ్రెస్, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. తమ ఎమ్మెల్యేలను బీజేపీ ‘ ఎగరేసుకుపోకుండా ‘ చూసేందుకు ఈ పార్టీలు వారిని ముంబైలోని లగ్జరీ హోటళ్లకు తరలిస్తున్నాయి. అసెంబ్లీలో వెంటనే మెజారిటీని నిరూపించుకోవాలని సుప్రీంకోర్టు బీజేపీని ఆదేశించకపోయినప్పటికీ.. ఒకవేళ సోమవారం ఈ మేరకు ఆదేశిస్తే.. ఈ ఎమ్మెల్యేలతో బీజేపీ ‘ బేరసారాలాడే ‘ ‘ ప్రమాదం ‘ ఉందని ఈ పార్టీలు భావిస్తున్నాయి. దీంతో శరద్ పవార్ ఆధ్వర్యంలోని ఎన్సీపీ శాసన సభ్యులను ముంబై శివార్లలోని రినైజాన్స్ హోటల్ కు తరలించారు. అలాగే… శివసేన తమ 55 మంది ఎమ్మెల్యేలను అంధేరీలోని లలిత్ హోటల్ కు, కాంగ్రెస్ పార్టీ తమ 44 మంది సభ్యులను జె.డబ్ల్యు.మారియట్ హోటల్ కు తరలించాయి. సేన పార్టీ ఓ ముందడుగు వేసి.. తమ సభ్యుల మొబైల్ ఫోన్లను తమకు అప్పగించాల్సిందిగా ఆదేశించింది. ఇక ఎనిమిది మంది ఇండిపెండెంట్ శాసన సభ్యులు గోవాలోని ఓ హోటల్లో ఉన్నారని రాజ్ కుమార్ పటేల్ అనే స్వతంత్ర ఎమ్మెల్యే తెలిపారు. ఈ నెల 30 న శాసన సభలో బలపరీక్ష జరిగిన పక్షంలో.. భారతీయ జనతా పార్టీని ఓడించేందుకు కాంగ్రెస్, శివసేన పార్టీలు తమ సభ్యులంతా కలిసికట్టుగా ఉండాలని కోరుతున్నాయి. ‘ మా ఎమ్మెల్యేలు చీలిపోయే ప్రసక్తే లేదు.. బల పరీక్ష సందర్భంగా బీజేపీని ఓడించడం ఖాయం ‘ అని కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ చెప్పారు. రాజకీయంగానే కాకుండా, లీగల్ గా కూడా ఆ పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా మేం పోరాడుతాం ‘ అని ఆయన వెల్లడించారు.