Independence Day: వర్షంలో తడిసిపోతూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన రాహుల్ గాంధీ
యావత్ భారతావని 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటోంది. దేశవ్యాప్తంగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, స్వాతంత్ర్య పోరాటంలో ప్రాణాలు అర్పించిన త్యాగధనులను కీర్తించుకుంటున్నారు. ప్రభుత్వ కార్యాలయాలతోపాటు ప్రవేటు సంస్థల్లోనూ జెండావిష్కర కనులపండువగా సాగింది. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో జాతీయ జెండావిష్కరణ జరిగింది.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పార్టీ కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సమయంలో రాహుల్ గాంధీ వర్షంలో తడిసి ముద్దవుతూ కనిపించారు. భారీ వర్షంలో గొడుగు లేకుండా నిలబడి కనిపించారు. ఈ ప్రత్యేక సందర్భంగా రాహుల్ దేశానికి శుభాకాంక్షలు తెలిపారు.
లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ స్వాతంత్ర్య సమరయోధులను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’లో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్‌లో, “స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశవాసులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. గొప్ప స్వాతంత్ర్య సమరయోధుల త్యాగం ద్వారా సాధించిన ఈ స్వేచ్ఛ, భారతదేశాన్ని నిర్మించడానికి ఒక ప్రతిజ్ఞ – ఇక్కడ న్యాయం సత్యం, సమానత్వంపై ఆధారపడి ఉంటుంది. ప్రతి హృదయంలో గౌరవం, సోదరభావం ఉంటుంది. ఈ విలువైన వారసత్వం గర్వం, గౌరవాన్ని కాపాడుకోవడం మనందరి కర్తవ్యం. జై హింద్, జై భారత్.. అంటూ రాసుకొచ్చారు.
#WATCH | Delhi: Congress leaders, including party chief Mallikarjun Kharge, Lok Sabha LoP Rahul Gandhi, Ajay Maken and others participate in #IndependenceDay celebrations at the party office. pic.twitter.com/455BM8H5gv
— ANI (@ANI) August 15, 2025
ప్రియాంక గాంధీ కూడా దేశానికి శుభాకాంక్షలు తెలిపారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా, ” దేశవాసులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. మన లక్షలాది మంది వీరులు లెక్కలేనన్ని త్యాగాలు చేయడం ద్వారా మనకు స్వేచ్ఛను అందించారు. వారు ప్రజాస్వామ్యం, న్యాయం, సమానత్వం, పరస్పర ఐక్యత అనే జాతీయ సంకల్పాన్ని మనకు అందజేశారు. ఒక వ్యక్తి – ఒక ఓటు అనే సూత్రం ద్వారా మనకు సంపన్నమైన ప్రజాస్వామ్యాన్ని అందించారు. మన స్వేచ్ఛ, రాజ్యాంగం.. దాని సూత్రాలను రక్షించాలనే మా సంకల్పం దృఢమైనది. జై హింద్! జై భారత్! ” అంటూ పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




