Cong Plenary Session: సీడబ్లూసీ ఎన్నికకు వేళాయె.. ఇవాళ్టి నుంచి 85వ కాంగ్రెస్ జాతీయ మహాసభలు..

ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో నేటి నుంచి కాంగ్రెస్ జాతీయ మహాసభలు ప్రారంభం కానున్నాయి. ఈ మూడు రోజుల సెషన్ ఫిబ్రవరి 24, 25, 26 వరకు కొనసాగుతుంది. రాహుల్ గాంధీ ఈ మధ్యాహ్నం రాయ్‌పూర్ చేరుకోనున్నారు.

Cong Plenary Session: సీడబ్లూసీ ఎన్నికకు వేళాయె.. ఇవాళ్టి నుంచి 85వ కాంగ్రెస్ జాతీయ మహాసభలు..
Congress Plenary
Follow us

|

Updated on: Feb 24, 2023 | 9:47 AM

ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఇవాళ్టి నుంచి 85వ కాంగ్రెస్ జాతీయ మహాసభలు ప్రారంభం కానున్నాయి. ఈ మూడు రోజుల సెషన్ ఫిబ్రవరి 24, 25, 26 వరకు కొనసాగుతుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, రాహుల్ గాంధీ, పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు పెద్ద నేతలు ఇందులో పాల్గొననున్నారు. ఖర్గే రాయ్‌పూర్‌కు చేరుకోగా, ప్రియాంక గాంధీ రేపు అంటే జనవరి 25న చేరుకుంటారు. రాహుల్ గాంధీ ఇవాళ రాయ్‌పూర్‌కు చేరుకోనున్నారు. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సీడబ్ల్యూసీ ఎన్నికను ఈ సెషన్‌లోనే నిర్వహించాలా లేక సభ్యులను నామినేట్ చేసే బాధ్యతను జాతీయ అధ్యక్షుడికే వదిలేస్తారా అనే అంశంపై సర్వసభ్య సమావేశంలో స్టీరింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

నిజానికి పార్టీ ఇంకా చాలా ఎన్నికల్లో పోరాడాల్సి ఉందని కొందరు నేతలు భావించడమే ఇందుకు కారణమని ఆయా వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహిస్తే పార్టీలో అంతర్గత పోరు మరింత పెరిగే అవకాశం ఉందని వారు అంటున్నారు. కావున ప్రస్తుతానికి కార్యవర్గ ఎన్నికను వాయిదా వేస్తూ సభ్యులను జాతీయ అధ్యక్షుని నామినేట్ చేసే నిర్ణయాన్ని వదిలేస్తే బాగుంటుందని, అయితే దీనిపై ఈరోజు స్టీరింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.

అన్ని ఏర్పాట్లు పూర్తి

రాహుల్ గాంధీ ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రైవేట్ విమానంలో రాయ్‌పూర్ చేరుకోనున్నారు. రోడ్‌షో కానప్పటికీ విమానాశ్రయం నుంచి హోటల్‌కు వెళ్లే మార్గంలో రాహుల్‌కు స్వాగతం పలికేందుకు యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు ఏర్పాట్లు చేశారు. చాలా రోజుల ముందే మహాసభలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందుకోసం దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

అతిథులకు స్వాగతం పలికేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వీఐపీల కోసం భారీ వేదికను సిద్ధం చేశారు. పార్టీ అగ్రనాయకత్వం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇందులో 15 వేల మందికి పైగా సభ్యులు పాల్గొంటారని అంచనా. రాకపోకలకు 1500కు పైగా పెద్ద వాహనాలకు ఏర్పాట్లు ఉండగా, అందులో 100కు పైగా లగ్జరీ వాహనాలు ఉన్నాయి.

వివిధ స్థాయిల్లోని దాదాపు 12వేల మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. ఇది కాంగ్రెస్‌కు 85వ ప్లీనరీ. రాహుల్‌ పాదయాత్ర తర్వాత ప్రజల్లో అభిమానం పెరిగిందని భావిస్తున్న నాయకులు.. అదే జోష్‌తో రాయ్‌పూర్‌ చేరుకున్నారు. తొలుత స్టీరింగ్ కమిటీ సమావేశం అవుతుంది. సాయంత్రం ప్లీనరీలో తీర్మానం చేసే అంశాల ముసాయిదాపై చర్చిస్తారు.

రేపు, ఎల్లుండి మూడేసి తీర్మానాలను ఆమోదిస్తారు. ఎల్లుండి సాయంత్రం జరిగే బహిరంగ సభతో సమావేశాలు ముగుస్తాయి. ఇది రెగ్యులర్‌గా జరిగే ప్లీనరీ కాదని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. రాహుల్‌ పాదయాత్రతో పెరిగిన గుర్తింపును క్యాష్ చేసుకుంటూ.. బీజేపీని పడగొట్టే వ్యూహం రెడీ చేస్తామని చెప్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం