Biryani: బిర్యానీ లవర్స్‌కు అలెర్ట్.. అక్కడ తింటే.. మీ గొంతులో నుంచి ‘పిల్లి’కూతలే
టేస్టీ బిర్యానీ తక్కువ ధరకు వచ్చిందని ఎక్కడబడితే అక్కడ తినేస్తున్నారా?.. అయితే మీ కోసమే ఈ వెన్నులో వణుకు పుట్టే వార్త..

మీకు బిర్యానీ అంటే ఇష్టమా..? తక్కువ రేటుకు వస్తుంది కదా అని ఎక్కడబడితే అక్కడ లాగించేస్తున్నారా..? అయితే మీకే ఈ అలెర్ట్. ఫుట్ పాత్‌లపై అమ్మే బిర్యానీలో చికెన్‌కు బదులు పిల్లి మాంసాన్ని వినియోగిస్తున్నట్లు.. పోలీసులు విచారణలో తేలింది. దీంతో అధికారులు అలెర్టై.. పలు ప్రాంతాల్లో ఆకస్మిక దాడులు చేస్తున్నారు. మెట్రో నగరాల్లో ఫుట్ పాత్‌లపై పెట్టే బిర్యానీ కోసం కస్టమర్స్ క్యూ కడతారు. కొందరైతే.. రోజూ అక్కడే లాగించేస్తారు. మధ్యాహ్నం ఆవురావురుమంటూ బిర్యానీ లాగించి.. మళ్లీ పనిలో పడిపోతారు. అయితే మీరు తిన్నది పిల్లి మాంసమో, కాకి మాంసమో అవ్వొచ్చు. కొద్ది రోజుల క్రితం.. చికెన్‌లో కాకి మాంసాన్ని కలిపి బిర్యానీ విక్రయించిన ఘటనలు వెలుగుచూశాయి. తాజాగా పిల్లి మాంసంతో బిర్యానీ చేసి మటన్ బిర్యానీగా అమ్ముతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలకు ఊతమిచ్చేలా సిటీల్లో పిల్లలు కూడా మాయామవుతున్నాయి.
సిటీలో ఉండే సంచార జాతులకు చెందినవారు పిల్లుల్ని వేటాడి వాటిని ఫుట్‌పాత్‌పై ఫుడ్ స్టాల్స్ నడిపేవారికి అమ్ముతున్నట్లు జంతు సంరక్షణ విభాగం అధికారులకు సమాచారం వచ్చింది. దీంతో సోదాలు జరుపుతున్నారు. అటు ఏకంగా మద్రాస్ హైకోర్టు వెనుకభాగంలో ఉన్న సంచారజాతుల వారి నుంచి 11 పిల్లుల్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని మాంసం కోసం అమ్మేందుకు రెడీ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..
