AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: రాహుల్ గాంధీ చెవుల్లోంచి ఆవిరి వచ్చేలా కారం తినిపించిన మహిళ.. ఆమె ఎవరంటే..?

ఈ ఏడాది మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లోని అజయ్ తుకారాం సనాదే, అంజనా తుకారాం సనాదే ఇంటికి విందు కోసం వెళ్లారు.

Watch Video: రాహుల్ గాంధీ చెవుల్లోంచి ఆవిరి వచ్చేలా కారం తినిపించిన మహిళ.. ఆమె ఎవరంటే..?
Rahul Gandhi Cooking
Balaraju Goud
|

Updated on: Oct 07, 2024 | 2:53 PM

Share

ఈ ఏడాది మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లోని అజయ్ తుకారాం సనాదే, అంజనా తుకారాం సనాదే ఇంటికి విందు కోసం వెళ్లారు. ఈ సమయంలో, రాహుల్ వారి వంటగదిలో వంట చేయడానికి ప్రయత్నించారు. నేటికీ దళితుల వంటశాల గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసునని రాహుల్ గాంధీ అన్నారు.

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో దళిత కుటుంబాన్ని కలిశారు. ఈ సందర్భంగా వంట గదిలో వారితో కలిసి వంటలు వండి కుల, వివక్ష వంటి పలు అంశాలపై చర్చించారు. అజయ్ తుకారాం సనాదే జీ, ఆయన సతీమణి అంజనా తుకారాం సనాదే జీని కలిసిన అనంతరం రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. దళితుల వంటగది గురించి నేటికీ చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసునని అన్నారు. షాహూ పటోలే చెప్పినట్లు దళితులు ఏం తింటారో ఎవరికీ తెలియదని రాహుల్ ట్వీట్ చేశారు. ఈ వీడియోను రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. తినే సమయంలో రాహుల్ గాంధీ కారం ఎక్కువగా తిననని చెప్పడం గమనించవచ్చు.

“వారు ఏమి తింటారు, ఎలా వండుతారు. వారి సామాజిక, రాజకీయ ప్రాముఖ్యత గురించి ఉత్సుకతతో, అజయ్ తుకారాం సనాదే జీ, అంజనా తుకారాం సనదే జీతో ఒక మధ్యాహ్నం గడిపాను” అని రాహుల్ చెప్పారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఉన్న తన ఇంటికి నన్ను గౌరవంగా ఆహ్వానించి వంటగదిలో సహాయం చేసే అవకాశం ఇచ్చారు. మేమంతా కలిసి వంకాయతో శెనగపప్పు, తువర్ పప్పుతో ‘హర్భ్యాచి భాజీ’ని తయారు చేసామని రాహుల్ పేర్కొన్నారు.

ఇదిలావుండగా, శనివారం(అక్టోబర్ 5) కొల్హాపూర్‌లో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని రాహుల్ గాంధీ ఆవిష్కరించారు. దీనితో పాటు రాజ్యాంగ గౌరవ సదస్సులో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చేతిలో నైపుణ్యం ఉన్న వారి గురించి మాట్లాడే ప్రసక్తే లేదన్నారు. విద్యావ్యవస్థలో మిగిలిపోయిన దళితుల చరిత్రను చెరిపేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. ఈ దేశంలో 90 శాతం దళితులు ఉన్నారని, అయితే 90 శాతం మందికి తలుపులు మూసుకుపోయాయన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..