జైపూర్ నుంచి 80 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భోపాల్ తరలింపు

మధ్యప్రదేశ్ లో కమల్ నాథ్ ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్ ను ఎదుర్కోనున్న తరుణంలో నాటకీయ పరిణామాలు సంభవిస్తున్నాయి. కమల్ నాథ్ ముందు జాగ్రత్త చర్యగా తమ పార్టీకి చెందిన సుమారు 80 మంది ఎమ్మెల్యేలను

జైపూర్ నుంచి 80 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భోపాల్ తరలింపు
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Mar 15, 2020 | 2:31 PM

మధ్యప్రదేశ్ లో కమల్ నాథ్ ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్ ను ఎదుర్కోనున్న తరుణంలో నాటకీయ పరిణామాలు సంభవిస్తున్నాయి. కమల్ నాథ్ ముందు జాగ్రత్త చర్యగా తమ పార్టీకి చెందిన సుమారు 80 మంది ఎమ్మెల్యేలను గప్ చుప్ గా రాజస్థాన్..జైపూర్ లోని ఓ రిసార్టుకు తరలించారు. హైడ్రామా మధ్య అక్కడికి చేరుకున్న వీరంతా ఆదివారం ఉదయం తిరిగి భోపాల్ చేరుకున్నారు. ఈ నగరంలోని మారియట్ హోటల్లో వీరు సేద తీరుతున్నారు. బీజేపీ తమ శాసన సభ్యులతో బేరసారాలాడకుండా, వారిని ప్రలోభపెట్టకుండా చూసేందుకు కాంగ్రెస్ ఇన్ని పాట్లు పడుతోంది. తమ వెంట 112 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, క్రాంతిలాల్ భూరియా అనే శాసన సభ్యుడు చెప్పగా.. మరో సీనియర్ నేత హరీష్ రావత్.. బెంగుళూరులోని రెబెల్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నట్టు తెలిపారు. రేపటి బల పరీక్షలో తాము నెగ్గుతామన్న  విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. మరోవైపు బెంగూరులోని రెబెల్ ఎమ్మెల్యేలను ప్రెస్టీజ్ గోల్ఫ్ షైర్ క్లబ్ నుంచి యెలహంకలోని రమదా హోటల్ కు తరలించారు. అయితే ఎవరి ఆదేశాలపై వీరి తరలింపు జరిగిందో తెలియడంలేదు. తెర వెనుక నుంచి బీజేపీ ఈ ‘ప్రక్రియకు’ పూనుకొందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.