దారుణం.. ప్రియుడు చూస్తుండగా.. ప్రియురాలిపై ఇద్దరు పోలీసుల అత్యాచారం..!
పోలీస్ అంటే నమ్మకం.. పోలీస్ అంటే భరోసా.. ఆపదలో ఉన్న సమయంలో పోలీసులు కనిపిస్తే చాలు.. కొండంత అండగా భావిస్తారంతా.. కానీ పుదుచ్చేరిలో జరిగిన ఘటన సభ్యసమాజాన్ని తలదించుకోవడమే కాకుండా.. పోలీసుల ఉద్యోగానికే తలవంపులు వచ్చేలా చేశారు ఓ ఇద్దరు కామంతో నిండిన ఖాకీలు. విషయం ఉన్నతాధికారులకు తెలియడంతో.. ఆ ఇద్దరి పోలీసులను సస్పెండ్ చేశారు. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ పర్యాటక ప్రాంతం.. పుదుచ్చేరికి ప్రతి వీకెండ్ రోజుల్లో ఇక్కడికి ప్రేమజంటలు వాలుతుంటారు. అయితే శుక్రవారం రాత్రి […]
పోలీస్ అంటే నమ్మకం.. పోలీస్ అంటే భరోసా.. ఆపదలో ఉన్న సమయంలో పోలీసులు కనిపిస్తే చాలు.. కొండంత అండగా భావిస్తారంతా.. కానీ పుదుచ్చేరిలో జరిగిన ఘటన సభ్యసమాజాన్ని తలదించుకోవడమే కాకుండా.. పోలీసుల ఉద్యోగానికే తలవంపులు వచ్చేలా చేశారు ఓ ఇద్దరు కామంతో నిండిన ఖాకీలు. విషయం ఉన్నతాధికారులకు తెలియడంతో.. ఆ ఇద్దరి పోలీసులను సస్పెండ్ చేశారు. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ పర్యాటక ప్రాంతం.. పుదుచ్చేరికి ప్రతి వీకెండ్ రోజుల్లో ఇక్కడికి ప్రేమజంటలు వాలుతుంటారు. అయితే శుక్రవారం రాత్రి కడలూరుకు చెందిన.. ప్రేమికుల జంటలు అక్కడికి వచ్చాయి. దీంతో వారిని గమనించిన బీట్ పోలీసులు.. ఆ ప్రేమ జంటల దగ్గరికి వాలిపోయారు. వెంటనే అక్కడ ఉన్న రెండు ప్రేమంజటల దగ్గరికి వెళ్లి.. వారు ఉన్న రూంను తట్టారు. మీ విషయాన్ని మీ ఇంట్లో వారికి చెబుతామని.. మీపై కేసులు పెడతామంటూ బెదిరింపులకు దిగారు. దీంతో బయపడిపోయిన ఓ జంట వారికి లంచంగా రూ.20 వేలు ఇచ్చేశారు.
అయితే మరో ప్రేమజంట వద్దకు వాలిన పోలీసులు.. వారిని కూడా బెదిరించసాగారు. అయితే వారి వద్ద డబ్బులు లేకపోవడంతో.. ఆ ప్రేమ జంటపై అఘాయిత్యానికి దిగారు. ప్రియుడి చూస్తుండగానే.. తన ప్రియురాలిపై ఇద్దరు పోలీసులు అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ దారుణ విషయాన్ని బయటకి చెప్తే పరువుపోతుందని భయపడ్డారు. ఆ తర్వాత వారు అక్కడి నుంచి పుదుచ్చేరి వెళ్లిపోయారు. అయితే ఆ తర్వాత పోలీసులు చేసిన ఈ దారుణం వెలుగులోకి రావడంతో.. సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ ఆదేశాల మేరకు పోలీసు ఉన్నతాధికారుల వీరిపై విచారణ చేపట్టింది. అత్యాచారానికి పాల్పడటమే కాకుండా.. మామూళ్ల వసూళ్లు చేసిన ఘటనలు రుజువవ్వడంతో ఇద్దరు కానిస్టేబుల్లను సస్పెండ్ చేశారు.