కుప్పకూలిన మూడంతస్తుల భవనం… శిథిలాల కింద కూలీలు !

హైదరాబాద్‌లో అర్ధరాత్రి విషాద సంఘటన చోటు చేసుకుంది. మూడంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. భవనం కూలుతుండగా..ఓ వ్యక్తి ప్రాణాలు దక్కించుకునేందుకు పరుగులు తీసినా ప్రయోజనం లేకపోయింది...

కుప్పకూలిన మూడంతస్తుల భవనం... శిథిలాల కింద కూలీలు !
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 16, 2020 | 8:06 AM

హైదరాబాద్‌లో అర్ధరాత్రి విషాద సంఘటన చోటు చేసుకుంది. మూడంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. భవనం కూలుతుండగా..ఓ వ్యక్తి ప్రాణాలు దక్కించుకునేందుకు పరుగులు తీసినా ప్రయోజనం లేకపోయింది. అమాంతంగా భవన శిథిలాలు అతని తలపై పడటంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. వివరాల్లోకి వెళితే…

సికింద్రాబాద్‌ పరిధిలోని కార్ఖానాలో ఓ ప్రముఖ హోటల్ పక్కనే ఓ పురాతన భవనం ఉంది. దీనిని 2020, మార్చి 15వ తేదీ రాత్రి కూల్చివేసేందుకు సిద్ధపడినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే భవన గోడలు ఒక్కసారిగా విరిగిపడపోవడంతో రోడ్డుపై శిథిలాలు పడిపోయాయి. ఈ ప్రమాదంలో ఓ కూలి చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు, జీహెచ్‌ఎంసీ రెస్క్యూటీమ్‌ సహాయక చర్యలు చేపట్టారు. శిధిలాలను తొలగించారు. శిథిలాల కింద చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని బయటకు తీసి.. గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. అయితే జీహెచ్‌ఎంసీ అనుమతి లేకుండానే భవన యజమాని కూల్చివేస్తున్నట్టుగా తెలుస్తోంది. పాత భవనాన్ని కూల్చివేసి.. కొత్త భవన నిర్మాణం కోసం కూడా పక్కనే పనులు ప్రారంభించారు. అయితే పాత భవనాన్ని కూల్చివేస్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.