రూ.11కే.. కరోనా తాయెత్తు.. యూపీలో దొంగ బాబా “అహ్మద్ సిద్ధిఖీ” లీలలు..!

కరోనా వైరస్.. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి. దీని ప్రభావంతో ఎంతో మంది అనేక రకాలుగా నష్టపోతుంటే.. మన దేశంలో మాత్రం దొంగ బాబాలకు కాసుల వర్షం కురిపిస్తోంది. తాయత్తు కట్టుకుంటే కరోనా దరిచేరదంటూ ప్రచారం మొదలెట్టడంతో.. అమాయక ప్రజలు ఆ బాబాల దర్శనం కోసం బారులు తీరారు. తాయత్తు కట్టుకుంటే కరోనా వచ్చినా ఎగిరిపోతుందంటూ అమాయకులను బురిడీ కొట్టిస్తున్న దొంగబాబాకు యూపీ పోలీసులు చెక్ పెట్టారు. ఉత్తరప్రదేశ్‌లో రాజధాని లక్నోలో ఈ ఘటన జరిగింది. చేతికి […]

రూ.11కే.. కరోనా తాయెత్తు.. యూపీలో దొంగ బాబా అహ్మద్ సిద్ధిఖీ లీలలు..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 16, 2020 | 3:41 PM

కరోనా వైరస్.. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి. దీని ప్రభావంతో ఎంతో మంది అనేక రకాలుగా నష్టపోతుంటే.. మన దేశంలో మాత్రం దొంగ బాబాలకు కాసుల వర్షం కురిపిస్తోంది. తాయత్తు కట్టుకుంటే కరోనా దరిచేరదంటూ ప్రచారం మొదలెట్టడంతో.. అమాయక ప్రజలు ఆ బాబాల దర్శనం కోసం బారులు తీరారు. తాయత్తు కట్టుకుంటే కరోనా వచ్చినా ఎగిరిపోతుందంటూ అమాయకులను బురిడీ కొట్టిస్తున్న దొంగబాబాకు యూపీ పోలీసులు చెక్ పెట్టారు. ఉత్తరప్రదేశ్‌లో రాజధాని లక్నోలో ఈ ఘటన జరిగింది. చేతికి తానుకట్టే మంత్రించిన తాయెత్తుతో కరోనా పారిపోతుందంటూ అహ్మద్ సిద్ధిఖీ అనే ఓ దొంగబాబా ఏకంగా బోర్డు పెట్టేశి.. కరోనా వ్యాపారానికి తెరలేపాడు. ఒక్కో తాయెత్తు ధర రూ.11/- అంటూ ప్రకటనలు కూడా చేశాడు. ఇంకేముంది. అమాయక ప్రజలు క్యూలైన్లు కట్టి మరీ కట్టించుకుంటున్నారు. మాస్కులకంటే ఇదే బెటర్ అనుకుంటున్న ప్రజలు.. తాయెత్తు కట్టుకుంటూ మోసపోతున్నారు. విషయం పోలీసులకు తెలియడంతో.. ప్రజలను మోసం చేస్తున్నా బాబా అవతారమెత్తిన సిద్ధిఖీని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.