Bharat Jodo Yatra: సైకిల్ తొక్కుతూ ముందుకు సాగుతున్న కాంగ్రెస్ అగ్రనేత.. నేటికి జోడోయాత్ర ప్రారంభమై ఎన్నో రోజంటే..?

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర నిరాటంకంగా 82వ రోజుకు చేరింది. యాత్రలో భాగంగా ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో పర్యటిస్తున్న రాహుల్ ఉత్సాహంగా ముందుకు

Bharat Jodo Yatra: సైకిల్ తొక్కుతూ ముందుకు సాగుతున్న కాంగ్రెస్ అగ్రనేత.. నేటికి జోడోయాత్ర ప్రారంభమై ఎన్నో రోజంటే..?
Rahul Gandhi
Follow us

|

Updated on: Nov 28, 2022 | 11:56 AM

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర నిరాటంకంగా 82వ రోజుకు చేరింది. యాత్రలో భాగంగా ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో పర్యటిస్తున్న రాహుల్ ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు. ఇదే క్రమంలో ఆ రాష్ట్రంలోని మోవ్‌లో పర్యటిస్తూ కొంతదూరం సైకిల్ తొక్కుతూ ముందుకు సాగారు. దానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. రాహుల్ గాంధీ సైకిల్ తొక్కుతున్న సమయంలో ఆయనకు కట్టుదిట్టమైన భద్రతల మధ్య కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు చుట్టుముట్టారు.

అయితే రాహుల్ గాంధీ చేపట్టిన ఈ యాత్రలో కాంగ్రెస్ నాయకుడి ప్రజలను ఆకర్షిస్తూ ముందుకు సాగుతున్నాడు. చేస్తున్న చిన్నచిన్న పనులతోనే ప్రజలందరినీ ఆకట్టుకుంటూ వెళ్తున్నాడు. ఫుట్‌బాల్ ఆడటం, గిరిజనులతో కలిసి నృత్య ప్రదర్శన చేయడం, నడవడం, రాష్ట్రవ్యాప్తంగా స్థానికులతో సరదాగా గడపడం ఇలా ఆయన అతను కలిసిన సామాన్య వ్యక్తులతో ప్రత్యేక బంధం చూపడం వంటివి చేసి ప్రజల దృష్టిని తనవైపుకు తిప్పుకుంటున్నాడు.

ఇవి కూడా చదవండి

సోమవారం ఉదయం ఇండోర్‌లోని బడా గణపతి చౌరమా నుంచి రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రారంభమయింది. ఈ యాత్ర ప్రారంభమయి నేటికి 82 రోజులు పూర్తయింది. ప్రస్తుతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్న రాహుల్ కన్యాకుమారి వేదికగా దీనిని ప్రారంభించారు. మొత్తం ఐదు నెలల పాటు జరిగే ఈ పాదయాత్రం 3500 కి.మీ దూరం సాగుతుంది. కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం కల్పించాలనే దృఢ సంకల్పంతో రాహుల్ గాంధీ ఈ పాదయాత్రను ప్రారంభించాడు. ఈ యాత్ర ఇప్పటివరకు ఏడు రాష్ట్రాలు, 34 జిల్లాలను కవర్ చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..