AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BJP MP Car Accident: తొమ్మిదేళ్ల బాలుడిని బలితీసుకున్న బీజేపీ ఎంపీ కారు.. వైరల్ అవుతున్న షాకింగ్ దృశ్యాలు..

ఉత్తర ప్రదేశ్‌ బీజేపీ ఎంపీ కారు కింద పడి రెండో తరగతి చదువుతున్న 9 ఏళ్ల బాలుడు మరణించాడు. ఉత్తరప్రదేశ్‌, బస్తీ జిల్లాలోని బసియా గ్రామంలో శనివారం బీజేపీ ఎంపీ హరీష్ ద్వివేది కాన్వాయ్‌కు చెందిన..

BJP MP Car Accident: తొమ్మిదేళ్ల బాలుడిని బలితీసుకున్న  బీజేపీ ఎంపీ కారు.. వైరల్ అవుతున్న షాకింగ్ దృశ్యాలు..
Bjp Mp Car Accident
శివలీల గోపి తుల్వా
|

Updated on: Nov 28, 2022 | 12:39 PM

Share

ఉత్తర ప్రదేశ్‌ బీజేపీ ఎంపీ కారు కింద పడి రెండో తరగతి చదువుతున్న 9 ఏళ్ల బాలుడు మరణించాడు. ఉత్తరప్రదేశ్‌, బస్తీ జిల్లాలోని బసియా గ్రామంలో శనివారం బీజేపీ ఎంపీ హరీష్ ద్వివేది కాన్వాయ్‌కు చెందిన ఎస్‌యూవీ కారు ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. అభిషేక్ రాజ్‌భర్ అనే రెండో తరగతి విద్యార్థి స్థానిక ప్రాథమిక పాఠశాల నుంచి సాయంత్రం ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఆ బాలుడిని లక్నోలోని కేజీఎమ్‌యూ ట్రామా సెంటర్‌కు తీసుకు వెళ్లారు. అయితే గాయాలు ఎక్కువగా కావడంతో చికిత్స పొందుతూ ఆ బాలుడు మరణించాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు ఆదివారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సంఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నసీసీటీవీ ఫుటేజీలో రెండు ఎస్‌యూవీ వాహనాలు కనిసిస్తున్నాయి.

ఇందులో ఇకదాని బంపర్ పాడైంది. ఎంపీ ద్వివేది వాహనం దెబ్బతిన్న బంపర్‌ని పరిశీలిస్తున్న దృశ్యాలను కూడా ఆ ఫుటేజీలో చూడవచ్చు. బీజేపీ ఎంపీ హరీశ్ ద్వివేదీకి చెందిన ఎస్‌యూవీ గుర్తు తెలియని డ్రైవర్‌పై పోలీసులు నిర్లక్ష్యంగా, ర్యాష్ డ్రైవింగ్‌తో మరణానికి కారణమైన ఆరోపణల కింద కేసు నమోదు చేశారు. “నిన్న ఆ 9 ఏళ్ల బాలుడు పాఠశాల నుండి ఇంటికి వెళ్తుండగా దారిలో ప్రమాదానికి గురయ్యాడు. వెంటనే అసుపత్రికి తీసుకెళ్లి.. చికిత్స అందిస్తుండగా మరణించాడు. ఓ ప్రజాప్రతినిధి ప్రయాణిస్తున్న వాహనం బాలుడిపైకి దూసుకెళ్లిందని అతని బంధువులు చెబుతున్నారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేశాము. దర్యాప్తు జరుగుతోంది’’ అని బస్తీలోని సదర్ సర్కిల్ ఆఫీసర్ అలోక్ ప్రసాద్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

సీసీ ఫుటేజీ వీడియో..

అయితే, ఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్న సీసీటీవీ ఫుటేజీలో వాహనం, ఎంపీ స్పష్టంగా కనిపిస్తున్నాయని.. బీజేపీ ఎంపీ లేదా డ్రైవర్‌పై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని బాలుడి తండ్రి శత్రుఘ్న రాజ్‌భర్ ఆరోపించారు. ‘‘ చనిపోయిన బాలుడు నా ఏకైక కుమారుడు. అతనిపైనే మాకు చాలా ఆశలు ఉన్నాయి’’ అని ఏడుస్తూ శ్రతుఘ్న అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..