కాండ‌క్ట్ స‌ర్టిఫికెట్ కావాలంటే..జాతీయ గీతం త‌ప్ప‌నిస‌రి !

కాండ‌క్ట్ స‌ర్టిఫికెట్ కోసం అప్లై చేసుకునే వారికి పుదుచ్చేరి పోలీసులు కొత్త ప‌రీక్ష పెడుతున్నారు. కాండ‌క్ట్ స‌ర్టిఫికెట్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న వారు జాతీయ గీతం త‌ప్పులు లేకుండా పాడితేనే స‌ర్టిఫికెట్ ఇస్తామంటూ కండీష‌న్ పెట్టారు.

కాండ‌క్ట్ స‌ర్టిఫికెట్ కావాలంటే..జాతీయ గీతం త‌ప్ప‌నిస‌రి !
Follow us

|

Updated on: Jun 18, 2020 | 12:38 PM

కాండ‌క్ట్ స‌ర్టిఫికెట్ కోసం అప్లై చేసుకునే వారికి పుదుచ్చేరి పోలీసులు కొత్త ప‌రీక్ష పెడుతున్నారు. కాండ‌క్ట్ స‌ర్టిఫికెట్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న వారు జాతీయ గీతం త‌ప్పులు లేకుండా పాడితేనే స‌ర్టిఫికెట్ ఇస్తామంటూ కండీష‌న్ పెట్టారు.

పుదుచ్చేరి లాస్‌పేట లెనిన్‌నగర్‌కు చెందిన ఓ యువకుడు బి.కాం పూర్తిచేశాడు. అతనికి పుదుచ్చేరిలోని ఓ ప్రైవేటు బ్యాంకులో ఉద్యోగం లభించింది. ఇందుకోసం అతని విద్యార్హత సర్టిఫికెట్లతో పాటు కాండక్ట్‌ సర్టిఫికెట్‌ సమర్పించాల‌ని బ్యాంకు అధికారులు కోరారు. దీంతో అతను లాస్‌పేట పోలీస్‌స్టేషన్‌లో సర్టిఫికెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ కృష్ణన్‌, ఏఎస్‌ఐ కీర్తిలు ఆ యువకుడిని తప్పులు లేకుండా జాతీయగీతం పాడాలని కోరగా అతను పాడలేక పోయాడు. జాతీయగీతం నేర్చుకొని వచ్చి తప్పులు లేకుండా పాడితే సర్టిఫికెట్‌ ఇస్తామని వారు పేర్కొన్నారు. దీంతో ఇంటికెళ్లిన ఆ యువకుడు జాతీయ గీతం బట్టీపట్టి నేర్చుకున్నాడు. ఆ మ‌ర్నాడు పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లి.. తప్పులు లేకుండా పాడడంతో పోలీసులు సర్టిఫికేట్‌ను అందజేశారు. పుదుచ్చేరి పోలీసులు తీసుకున్న ఈ చ‌ర్య‌ల‌ను ప్ర‌జ‌లు, నెటిజ‌న్లు స్వాగ‌తిస్తున్నారు.