సముద్రంలో చిక్కుకున్న 12 మందిని కాపాడిన భారత నౌకాదళం..
భారత కోస్ట్ గార్డ్ సార్తాక్ నౌకను పంపింది. ఇరు దేశాల తీరప్రాంత రక్షణ దళాలు మేరిటైమ్ సెక్యూరిటీ సెంటర్ల సమన్వయంతో.. సముద్రంలో చిక్కుకుపోయిన 12 మంది సిబ్బందిని కాపాడాయి. 12 మంది సిబ్బందిని, సార్తాక్ నౌకలో పోర్ బందర్ తీరానికి చేర్చినట్లు కోస్ట్ గార్డ్ తెలిపింది.
అరేబియా సముద్రంలో మునిగిపోయిన నౌకలోని 12 మందిని.. భారత్, పాకిస్థాన్ తీర ప్రాంత రక్షణ బలగాలు సంయుక్తంగా కాపాడాయి. ఈనెల 4న భారత్‌కు చెందిన అల్ పిరాన్ పిర్ అనే నౌక.. పోర్ బందర్ నుంచి ఇరాన్ వెళ్తుండగా బలమైన అలల తీవ్రతకు అరేబియా సముద్రంలో భారతీయ జలాలకు అవతల మునిగిపోయింది. నౌక మునిగిపోయేలోపే అందులో ఉన్న సిబ్బంది.. పడవ సాయంతో బయటపడ్డారు. సముద్రం మధ్యలో చిక్కుకున్న వారిని తీరప్రాంత రక్షణ దళాలు కాపాడాయి.
డిసెంబర్ 4న భారత్ కు చెందిన అల్ పిరాన్ పిర్ అనే నౌక…. పోర్ బందర్ నుంచి ఇరాన్ వెళ్తుండగా బలమైన అలల తీవ్రతకు అరేబియా సముద్రంలో…. భారతీయ జలాలకు అవతల మునిగిపోయింది. ఆ ప్రాంతం పాకిస్థాన్ పరిధిలో ఉంది. నౌక మునిగిపోయేలోపే అందులో ఉన్న సిబ్బంది..చిన్న పడవ సాయంతో బయటపడ్డారు. చిన్నపడవలో సముద్రం మధ్యలో చిక్కుకున్న సిబ్బంది సాయం కోసం పంపిన సందేశం… ముంబయిలోని మేరిటైమ్ సెక్యూరిటీ సెంటర్ – M.C.C.కు చేరింది. దీంతో కోస్ట్ గార్డును M.C.C. అప్రమత్తం చేసింది.
View this post on Instagram
అదే సందేశం పాకిస్థాన్ లో ఉన్న మేరిటైమ్ సెక్యూరిటీ సెంటర్ M.C.C.కు చేరగా…. ఆ కేంద్రం పాకిస్థాన్ తీర ప్రాంత రక్షక దళం P.M.S.A.ను అప్రమత్తం చేసింది. వెంటనే P.M.S.A. వారి రక్షణ కోసం…. హెలికాఫ్టర్ ను పంపింది. భారత కోస్ట్ గార్డ్ సార్తాక్ నౌకను పంపింది. ఇరు దేశాల తీరప్రాంత రక్షణ దళాలు మేరిటైమ్ సెక్యూరిటీ సెంటర్ల సమన్వయంతో.. సముద్రంలో చిక్కుకుపోయిన 12 మంది సిబ్బందిని కాపాడాయి. 12 మంది సిబ్బందిని, సార్తాక్ నౌకలో పోర్ బందర్ తీరానికి చేర్చినట్లు కోస్ట్ గార్డ్ తెలిపింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..