Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajasthan: కోటాలో మరో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య.. కీలక నిర్ణయం తీసుకున్న జిల్లా యంత్రాంగం

విద్యార్థుల ఆత్మహత్యలు ఆపేందుకు కోటాలోని ఉన్న వసతి గృహాల్లో కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భవనాల చుట్టూ ఇనుప వలలు పెట్టారు. అలాగే వారు ఉండే గదుల్లో కూడా సీలింగ్ ఫ్యాన్‌లకి బదులుగా స్ప్రింగ్ కాయిల్ ఫ్యాన్లు అమర్చుతున్నారు. జిల్లా అధికార యంత్రంగంతో కలిసి వసతి గృహాల యజమానులు ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారు. ఒకవేళ ఎవరైన విద్యార్థి భవనంపై అంతస్తు నుంచి దూకినా కూడా అతనికి గాయాలు కాకుండా ఉండేందుకు ఆవరణల్లో వలలు కడుతున్నారు.

Rajasthan: కోటాలో మరో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య.. కీలక నిర్ణయం తీసుకున్న జిల్లా యంత్రాంగం
Students
Follow us
Aravind B

|

Updated on: Aug 28, 2023 | 4:20 PM

పోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లకు ప్రసిద్ది చెందిన రాజస్థాన్‌లోని కోటా ప్రాంతాంలో వరుసగా ఆత్మహత్య చేసుకున్న ఘటనలు ఆందోళనలు కలిగిస్తున్నాయి. అయితే తాజాగా ఆదివారం మరో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. దీంతో మరొక్కసారిగా కోటా ప్రాంతం ఉలిక్కిపడింది. ఈ నేపథ్యంలో రాజస్థాన్ ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. రెండు నెలల పాటు కోటాలోని ఉన్నటువంటి శిక్షణా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి పరీక్షలు నిర్వహించకూడదని ఆదేశించింది. విద్యార్థుల్లో నెలకొంటున్న మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో విద్యార్థులకు అవసరమైన శిక్షణను ఇవ్వాలని జిల్లా అధికారులు నిర్ణయించారు. దీనివల్ల విద్యార్థుల్లో అవగాహన ఏర్పడి ఎలాంటి బలవన్మరణాలకు పాల్పడకుండా ఉండే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

ఇదిలా ఉండగా మరోవైరు విద్యార్థుల ఆత్మహత్యలు ఆపేందుకు కోటాలోని ఉన్న వసతి గృహాల్లో కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భవనాల చుట్టూ ఇనుప వలలు పెట్టారు. అలాగే వారు ఉండే గదుల్లో కూడా సీలింగ్ ఫ్యాన్‌లకి బదులుగా స్ప్రింగ్ కాయిల్ ఫ్యాన్లు అమర్చుతున్నారు. జిల్లా అధికార యంత్రంగంతో కలిసి వసతి గృహాల యజమానులు ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారు. ఒకవేళ ఎవరైన విద్యార్థి భవనంపై అంతస్తు నుంచి దూకినా కూడా అతనికి గాయాలు కాకుండా ఉండేందుకు ఆవరణల్లో వలలు కడుతున్నారు. ఏ విద్యార్థి కూడా ఆత్మహత్యలు చేసుకోకుండా చూసుకునేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లుపై దృష్టి పెడుతున్నారు. ఇదిలా ఉండగా ఆదివారం మధ్యాహ్నం కోచింగ్‌ తీసుకుంటున్న భవనం ఆరో అంతస్తు నుంచి మహారాష్ట్రకు చెందిన అవిష్కర్‌ శంభాజీ కస్లే (17) అనే విద్యార్థి కిందకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు..

అలాగే అదేరోజు సాయంత్రంపూట బిహార్‌కు చెందిన ఆదర్శ్‌ రాజ్‌ (18) అనే మరో విద్యార్థి తాను ఉంటున్న అద్దె గదిలోని ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణం చెందాడు. తాజాగా వీరిద్దరి మృతితో.. ఈ ఏడాది ఇప్పటివరకూ కోటాలో ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థుల సంఖ్య ఏకంగా 22కు పెరిగిపోయింది. అవిష్కర్‌ ఆత్మహత్య చేసుకున్న దృశ్యాలు వసతి గృహం సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వచ్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కేవలం గంటల వ్యవధిలోనే ఇద్దరు విద్యార్థులు మృతి చెందడంతో కోటా ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి. పోటీ పరీక్షల కోసం కోచింగ్ తీసుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి చాలామంది విద్యార్థులు రాజస్థాన్‌లో ఉన్న ఈ కోటా ప్రాంతానికి ఎక్కువగా వస్తుంటారు. అయితే ఇక్కడ మానసిక ఒత్తిడి వల్ల విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..