Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yogi Adityanath: అందరూ భారతమాత బిడ్డలే.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు..

Independence Day 2023: శతాబ్దాల దాస్య సంకెళ్లను తెంచుకుని భారతదేశానికి ఈ రోజునే (ఆగస్టు 15న) విముక్తి లభించిందని, నిజమైన స్వాతంత్య్రం అంటే ఏంటో ప్రస్తుతం మనందరికీ అనిపిస్తోందంటూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. 77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం విధాన్ భవన్‌లో..

Yogi Adityanath: అందరూ భారతమాత బిడ్డలే.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు..
Yogi Adityanath
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 15, 2023 | 2:59 PM

Independence Day 2023: శతాబ్దాల దాస్య సంకెళ్లను తెంచుకుని భారతదేశానికి ఈ రోజునే (ఆగస్టు 15న) విముక్తి లభించిందని, నిజమైన స్వాతంత్య్రం అంటే ఏంటో ప్రస్తుతం మనందరికీ అనిపిస్తోందంటూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. 77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం విధాన్ భవన్‌లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధులు, వారి కుటుంబాలను సీఎం యోగి సత్కరించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో ఇది కీలక ఘట్టమని, అభివృద్ధి చెందిన భారతదేశం యూపీ మీదుగా పయనిస్తుందంటూ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు.

సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ సాంస్కృతిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని, యూపీలోని వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారులు, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు పలు కళలను ప్రదర్శించారని వివరించారు. పంచప్రాణ సంకల్పంతో భారతమాత పుత్రులు ప్రాణత్యాగం చేశారని, ఆ వీర కుటుంబాలను సన్మానించామన్నారు. దేశ భద్రత కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల కుటుంబాలను సన్మానించే ఈ కార్యక్రమాన్ని యూపీలోనూ నిర్వహిస్తున్నామని సీఎం యోగి వివరించారు. దేశంలో 75 జిల్లాలు, 58 వేల గ్రామ పంచాయతీలు, 762 మునిసిపల్ బాడీలలో ఇది జరుగుతుందని తెలిపారు.

మనమందరం ప్రస్తుతం నవ భారతాన్ని చూస్తున్నామని, మన విలువలు ఎల్లప్పుడూ వీర పుత్రులతో అనుసంధానం చేస్తున్నాయని, భూమిని మనం ఎప్పుడూ భూమిగా గౌరవించలేదని, ఒక తల్లిగా ప్రతి భారతీయుడు గౌరవిస్తారని సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. భూమాతను తల్లిగా గౌరవించడం.. ఆకాంక్షను నెరవేర్చాలన్న కోరికను వేల సంవత్సరాల వారసత్వాన్ని అనుసరిస్తున్నందుకు గర్విస్తున్నామన్నారు.

తూర్పు, పడమర, ఉత్తరం-దక్షిణం అనే తేడా లేకుండా ప్రతి భారతీయుడు ఏ మతానికి చెందినవారైనా.. అందరికీ మొదట భారతమాత ప్రధానమని సీఎం యోగి వివరించారు. కులం కాదు, మతం కాదు.. మన దేశమే అందరికీ తొలి ప్రాధాన్యత అని సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఎలాంటి తారతమ్యం లేకుండా భారతదేశాన్ని రక్షించడానికి జవాన్లు చేస్తున్న త్యాగానికి గర్వపడుతున్నమన్నారు.

శాంతిభద్రతలు మెరుగ్గా ఉన్నందున, పెట్టుబడులకు ఉత్తమ గమ్యస్థానంగా యూపీని తీర్చిదిద్దామని.. ఫిబ్రవరి 10 నుంచి 12 వరకు జరిగిన జీఐఎస్‌లో రూ. 36 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయని సీఎం యోగి వివరించారు. రాష్ట్రంలోని యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని సీఎం చెప్పారు. యువత కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టిందని తెలిపారు.

పోలీసులకు సేవా పతకాలు..

యూపీ పోలీస్‌లోని వీర జవాన్లకు ముఖ్యమంత్రి ఎక్స్‌లెన్స్ సర్వీస్ మెడల్‌ను సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. మధుర సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శైలేష్ పాండే, STF అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విశాల్ విక్రమ్ సింగ్, ఇన్స్పెక్టర్ ఇన్ఫర్మేషన్ హెడ్‌క్వార్టర్స్ లక్నో విశాల్ సంగ్రి, STF లక్నోకు చెందిన మనోజ్ కుమార్, కమిషనరేట్ గౌతమ్ బుద్ నగర్‌కు చెందిన కానిస్టేబుల్ శైలేష్ కుంతల్ ప్రకటించారు.

వీర కుమారులను సీఎం సత్కరించారు..

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ భారత సైన్యానికి చెందిన మేజర్ అశోక్ కుమార్ సింగ్, కల్నల్ భరత్ సింగ్ (శౌర్య చక్ర అవార్డు పొందినవారు), హవల్దార్ కున్వర్ సింగ్ (మరణానంతరం వీర చక్ర) కుమారుడు మేజర్ అరుణ్ కుమార్ పాండే (శౌర్య చక్ర పురస్కారం)లను సత్కరించారు. దీనితో పాటు, నాయక్ రాజా సింగ్ భార్య, కోడలు (మరణానంతరం వీర చక్ర పురస్కారం) గౌరవాన్ని అందుకున్నారు. లెఫ్టినెంట్ కల్నల్ అమిత్ మొహింద్రా (శౌర్య చక్ర) తండ్రి ఈ గౌరవాన్ని అందుకున్నారు. కల్నల్ మొనీంద్ర రాయ్ భార్య (మరణానంతర శౌర్య చక్ర) గౌరవాన్ని అందుకుంది. లెఫ్టినెంట్ హరి సింగ్ బిష్త్ తల్లి (మరణానంతర శౌర్య చక్ర) గౌరవాన్ని అందుకుంది. బ్రిగేడియర్ సయ్యద్ అలీ ఉస్మాన్ తల్లి (శౌర్య చక్ర పురస్కారం) ఈ గౌరవాన్ని అందుకున్నారు. అమరవీరుడు ఉటాలి మేనల్లుడు కూడా సీఎం యోగి నుంచి సన్మానం పొందారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..