BRS Office in Delhi: ఢిల్లీలో బీఆర్‌ఎస్‌ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించనున్న సీఎం కేసీఆర్.. ముహూర్తం ఫిక్స్..

ఢిల్లీలో ఈనెల 14వ తేదీన బీఆర్‌ఎస్‌ పార్టీ కేంద్ర కార్యాలయ ప్రారంభోత్సవం జరుగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను మంత్రి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ పరిశీలించారు.

BRS Office in Delhi: ఢిల్లీలో బీఆర్‌ఎస్‌ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించనున్న సీఎం కేసీఆర్.. ముహూర్తం ఫిక్స్..
Brs Office In Delhi

Updated on: Dec 11, 2022 | 4:13 PM

ఢిల్లీలో ఈనెల 14వ తేదీన బీఆర్‌ఎస్‌ పార్టీ కేంద్ర కార్యాలయ ప్రారంభోత్సవం జరుగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను మంత్రి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. కాగా, ఈనెల 14న ఢిల్లీ లోని సర్దార్ పటేల్ మార్గ్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్.. భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా పూజలు, యాగం నిర్వహించబోతున్నారు.

పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం, యాగం కోసం చేపట్టవలసిన ఏర్పాట్లను రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్‌ పరిశీలించి.. పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

ఈ సందర్భంగా యాగం కోసం ప్రత్యేకంగా నిర్మించాల్సిన యాగశాల స్థలంతో పాటు ఆఫీస్ భవనంలో చేపట్టాల్సిన మరమ్మత్తులు, కార్యాలయ ఫర్నిచర్ ఇతర పనులను ప్రముఖ వాస్తు నిపుణులు సుద్దాల సుధాకర్ తేజతో కలిసి పరిశీలించారు.

ఇటీవల, కేంద్ర ఎన్నికల సంఘం టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మారుస్తూ ప్రకటన చేసింది. దీంతో సీఎం కేసీఆర్ భార‌త రాష్ట్ర స‌మితి జెండాను ఆవిష్కరించారు. జెండా ఆవిష్కరణ కంటే ముందు కేసీఆర్.. పార్టీ వ్రేణుల మధ్య తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ ప‌త్రాల‌పై సంత‌కం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..