గర్జిస్తున్న వరుణదేవుడు.. తెలుగు రాష్ట్రాలపై కుమ్మరిస్తున్న వర్షం.. ఎందుకిలా.?
గురువారం హైదరాబాద్‌లో భారీ వర్షం పడింది. అలాంటి వర్షం సాధారణమే. కాని, నగరానికి తూర్పున ఎల్బీ నగర్ నుంచి హయత్‌నగర్ వరకు పడిన వర్షం ఉంది చూశారూ అదీ అసాధారణం. అదే రోజు మెదక్‌లో కొట్టిన వాన.. అసాధారణం. గంటలో 15 సెంటీమీటర్లపైన వాన పడితే అది క్లౌడ్‌బరస్ట్. మెదక్‌లో 17.8 సెంటీమీటర్ల వర్షం పడింది. కాకపోతే, గంటలో కాదు. సో, క్లౌడ్‌బరస్ట్ కాని క్లౌడ్‌బరస్ట్ అది. ఇదంతా ఎందుకంటే.. మొన్నటికి మొన్నే కదా 50 ఏళ్లలో ఎప్పుడూ లేనంత వాన కురిసింది. ఏమంత గ్యాప్ వచ్చిందని ఈలోపే మళ్లీ మేఘం ఇలా విరుచుకుపడింది? దీనివెనకో సైంటిఫిక్ రీజన్ ఉందా..?

‘ఈసారి 105 శాతం అధిక వర్షాలు పడతాయి’ అని భారత వాతావరణ శాఖ చెప్పగానే.. దేశం మొత్తం సంబరపడింది. ఆ వర్షమేదో అప్పుడే కురిసి, తడిసి ముద్దైనంత సంతోషించారు. ఆ వార్త చెప్పింది మే నెలలో కదా..! ఆ ఫీలింగ్ అలాగే ఉంటుంది. ఎర్రటి ఎండల వేళ చెప్పిన ఆ కబురు నిజంగానే హాయిగా అనిపించింది. పైగా ఈసారి నైరుతి త్వరగానే దేశంలోకి ఎంట్రీ ఇచ్చింది. చూస్తుండగానే కేరళ నుంచి జమ్మూ కశ్మీర్ వరకు నైరుతి విస్తరించింది. ఇక్కడే.. వాతావరణ శాఖ అంచనాలకు కూడా అందని ఓ విపరీత పరిస్థితి ఏర్పడింది. నైరుతి రుతుపవనాలను అడ్డంగా నెట్టేస్తూ ‘వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్’ వచ్చిపడ్డాయి. ఉత్తర దిశకు వెళ్లాల్సిన వాటి గమనం.. అనూహ్యంగా తూర్పు వైపు వెళ్లింది. ఎక్కడో పర్వత ప్రాంతాల్లో జరగాల్సిన క్లౌడ్‌బరస్ట్‌లు దక్షిణాదికి రావడానికి అదీ ఒక కారణమైంది. ఇక్కడితోనే అయిపోలేదు. మున్ముందు మరిన్ని మేఘ విస్ఫోటనాలు తప్పవని హెచ్చరిస్తోంది వాతావరణ శాఖ. ఇంతకీ.. రుతుపవనాలను వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్ నెట్టేయాలనుకోవడం ఏంటి? ఎందుకలా జరిగింది. భారత్‌లో అసాధారణ వర్షాలకు రీజన్ ఏంటి? తెలుసుకుందాం.. గత గురువారం (సెప్టెంబర్ 11) హైదరాబాద్ మహానగరంలో భారీ వర్షం పడింది. అలాంటి వర్షం సాధారణమే. కాని, నగరానికి తూర్పున ఎల్బీ నగర్ నుంచి హయత్‌నగర్ వరకు పడిన వర్షం ఉంది చూశారూ అదీ అసాధారణం. అదే రోజు మెదక్‌లో కొట్టిన వాన.. అసాధారణం. గంటలో 15 సెంటీమీటర్లపైన వాన...
