AP, Telangana News Live: ఇళ్లకు వెళ్లిపోండి.. హైదరాబాద్ వాసులకు అలర్ట్.. వచ్చే 2 గంటల్లో కుండపోత వర్షం!
AP, Telangana and India News Updates: నేపాల్ కొత్త ప్రధాని నియామక అంశంపై జెన్ జడ్ ఆందోళనకారులు, సైన్యాధిపతి, అధ్యక్షుడు పౌడెల్ మధ్య సుదీర్ఘ చర్చలు సాగాయి. ఈ క్రమంలో జెన్ జెడ్ జస్టిస్ సుశీల కర్కే పేరును ప్రతిపాదించారు. అలాగే ఈ చర్చల్లో ఒప్పందం మేరకు తొలి క్యాబినెట్ సమావేశంలోనే ఆమె పార్లమెంటు రద్దు..

ఖాట్మాండు, సెప్టెంబర్ 13: నేపాల్‌లో అవినీతికి వ్యతిరేకంగా జెన్ జెడ్ నేతృత్వంలో చెలరేగిన హింసకు చెక్ పడింది. ఆ దేశ తాత్కాలిక సారధిని ఎట్టకేలకు నియమించారు. విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుశీలా కార్కీ (73)ని తాత్కాలిక ప్రధానికగా నియమించారు. ఈ మేరకు అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ శుక్రవారం సాయంత్రం ప్రకటన వెలువరించారు. అదే రోజు రాత్రి 9.30 గంటలకు ఆమె ప్రధానిగా ప్రమాణం చేసి, బాధ్యతలు చేపట్టారు. కాగా జస్టిస్ సుశీలా కార్కీ తొలిసారి మహిళ ప్రధాని కావడం విశేషం.
ప్రధాని నియామక అంశంపై జెన్ జడ్ ఆందోళనకారులు, సైన్యాధిపతి, అధ్యక్షుడు పౌడెల్ మధ్య సుదీర్ఘ చర్చలు సాగాయి. ఈ క్రమంలో జెన్ జెడ్ జస్టిస్ సుశీల కర్కే పేరును ప్రతిపాదించారు. ఆ చర్చల్లో ఒప్పందం మేరకు తొలి క్యాబినెట్ సమావేశంలోనే ఆమె పార్లమెంటు రద్దు చేశారు. 2026 మార్చి 21వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఇక నేపాల్ అల్లర్లలో ముగ్గురు పోలీసులు, 19 మంది విద్యార్థులు సహా మొత్తం 51 మంది మృతి చెందారు.
మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ వార్తా కథనాలు ఇక్కడ తెలుసుకోండి.
LIVE NEWS & UPDATES
-
వచ్చే 2 గంటల్లో నగరంలో భారీ వర్షం
హైదరాబాద్ మహానగరంలో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణం కొనసాగుతోంది. మరికొద్ది గంటల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వచ్చే రెండు గంటల్లో ఎల్‌బీ నగర్, ఉప్పల్, హయత్‌నగర్ ప్రాంతాల్లో భారీ వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ విభాగం తెలిపింది. ముఖ్యంగా నగరంలోని దక్షిణ, తూర్పు ప్రాంతాల్లో చార్మినార్, రాజేంద్రనగర్, సరూర్‌నగర్, బాలాపూర్, వనస్థలిపురం, హయత్‌నగర్, ఉప్పల్, కాప్రా ప్రాంతాల్లో తీవ్ర వర్షం కురిసే అవకాశం ఉందన్నారు.
-
దేశవ్యాప్తంగా బాణసంచాపై నిషేధంః సుప్రీంకోర్టు
దేశవ్యాప్తంగా బాణసంచాపై నిషేధం విధిస్తూ భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కాలుష్యం కారణంగా కేవలం ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో మాత్రమే బాణసంచా కాల్చడంపై నిషేధం విధించారు. మరి దేశంలోని ఇతర నగరాల పరిస్థితి ఏంటి అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. కేవలం ఢిల్లీ వాసులకు మాత్రమే స్వచ్ఛమైన గాలి కావాలా..? దేశంలోని మిగిలిన నగర ప్రజలకు అవసరం లేదా అని సీజేఐ నిలదీశారు. విచారణ సందర్భంగా తన వ్యక్తిగత అనుభవాన్ని గుర్తుచేసుకున్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి.. గత శీతాకాలంలో అమృత్‌సర్‌లో ఉన్నప్పుడు, పంజాబ్‌లో వాయు కాలుష్యం ఢిల్లీ కంటే దారుణంగా ఉందన్నారు. అందుకే దేశవ్యాప్తంగా బాణాసంచాపై నిషేధం విధిస్తు్న్నట్లు తెలిపారు. తదుపరి విచారణ ఈ నెల 22వ తేదీకి వాయిదా చేశారు.
-
-
పద్మనాభస్వామి ఆలయానికి బాంబు బెదిరింపులు
ఢిల్లీ, బాంబే హైకోర్టులలో ఇలాంటి బెదిరింపులు వచ్చిన ఒక రోజు తర్వాత, కేరళలోని పద్మనాభ స్వామి ఆలయం, త్రివుంతపురంలోని అట్టుకల్ దేవి ఆలయానికి శనివారం బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ-మెయిల్ ద్వారా బెదిరింపు అందింది. అట్టుకల్ అమ్మవారి ఆలయాన్ని పేల్చేస్తామని బెదిరింపులు వచ్చాయి. దీంతో భక్తులకు బయటకు పంపిన అధికారులు.. ఆలయాల్లో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించింది. ఈ బెదిరింపు బూటకమని పోలీసులు తేల్చారు. ఇప్పటివరకు అనుమానాస్పదంగా ఏమీ కనుగొనలేదన్నారు. ఈ విషయంపై దర్యాప్తు జరుగుతోందని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
-
మణికొండ కాంగ్రెస్ పార్టీలో ఇరువర్గాల బాహా బాహీ
రంగారెడ్డి జిల్లా మణికొండలో కాంగ్రెస్ పార్టీలోని ఇరువర్గాలు బాహా బాహీకి దిగాయి. మాజీ కార్పొరేటర్ పద్మారావు, రాజేంద్ర నగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కస్తూరి నరేందర్ అనుచరుల మధ్య గొడవ జరిగింది. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టారంటూ ఇరువర్గాలు పరస్పర దాడులకు దిగాయి. మణికొండ వెంకటేశ్వర కాలనీ జనరల్ బాడీ మీటింగ్‌లో ఈ ఘటన జరిగింది.
-
ఏపీలో 14 జిల్లాలకు కొత్త ఎస్పీల నియామకం
ఆంధ్రప్రదేశ్‌లో ఎస్పీల బదిలీలపై కసరత్తు పూర్తయింది.14 జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించారు. వాటిలో ఏడు జిల్లాలకు ఎస్పీలుగా కొత్త అధికారులను నియమించగా, మరో 7 జిల్లాలకు ఇతర జిల్లాల నుంచి బదిలీ చేశారు. మిగిలిన 12 జిల్లాల్లో మాత్రం ప్రస్తుతం ఉన్నవారినే ఎస్పీలుగా కొనసాగిస్తూ డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీగా రాహుల్ మీనా
బాపట్ల జిల్లా ఎస్పీగా ఉమామహేశ్వర్
నెల్లూరు ఎస్పీగా అజితా వేజెండ్ల
తిరుపతి ఎస్పీగా సుబ్బారాయుడు
అన్నమయ్య జిల్లా ఎస్పీగా ధీరజ్
కడప జిల్లా ఎస్పీగా నచికేత్
నంద్యాల జిల్లా ఎస్పీగా సునీల్ షెరాన్
విజయనగరం జిల్లా ఎస్పీగా ఏఆర్ దామోదర్
కృష్ణాజిల్లా ఎస్పీగా విద్యాసాగర్ నాయుడు
గుంటూరు ఎస్పీగా వకుల్ జిందాల్
పల్నాడు జిల్లా ఎస్పీగా డి.కృష్ణారావు
ప్రకాశం జిల్లా ఎస్పీగా హర్షవర్ధన్‌రాజు
చిత్తూరు జిల్లా ఎస్పీగా తుషార్ డూడి
శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీగా సతీష్‌కుమార్
శ్రీకాకుళం, పార్వతీపురం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, అనంతపురం, కర్నూలు జిల్లాల ఎస్పీలు యథాతథంగా ఉన్నారు.
-
-
చిన్నారుల బాధను చూసి చలించిన ప్రధాని మోదీ
అల్లర్లతో అట్టుడికిన మణిపూర్‌లో రెండేళ్ల తరువాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించారు. ప్రధాని ముందు బాధితులు తమ గోడును వెళ్లబోసుకున్నారు.అల్లర్ల కారణంగా సర్వం కోల్పోయామని ప్రధానికి బాధితులు వివరించారు. స్కూళ్లు మూతపడడంతో విద్యకు దూరమయ్యామని చిన్నారులు ప్రధాని మోదీ ముందు కంటతడి పెట్టుకున్నారు. చిన్నారుల బాధను చూసి మోదీ చలించిపోయారు. మణిపూర్ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, మోదీ మీకు అండగా ఉంటాడని వాళ్లను భరోసా ఇచ్చారు. శాంతితోనే అభివృద్ది సాధ్యమన్నారు. మణిపూర్ ప్రజలకు కేంద్రం అన్నివిధాలా అండగా ఉంటుందని ప్రధానమంత్రి మోదీ భరోసా ఇచ్చారు.
-
భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్‌పై నిరసనల వెల్లువ
ఆదివారం (సెప్టెంబర్ 14) దుబాయ్‌లో భారత్-క్రికెట్ మ్యాచ్‌పై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఢిల్లీలో ఆప్ నేతలు నిరసన చేపట్టారు. పహల్గామ్‌లో భారత పౌరులను ఊచకోత కోసిన ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన పాక్‌తో క్రికెట్ మ్యాచ్ ఎలా ఆడుతారని ఆప్ నేతలు ప్రశ్నించారు. దేశభక్తి విషయంలో బీజేపీ ద్వంద్వ వైఖరికి ఇది నిదర్శనమని మండిపడ్డారు. ఇదిలావుంటే, ఆసియాకప్‌లో భాగంగా ఆదివారం భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది.
-
కూకట్‌పల్లి యువతి మర్డర్ కేసులో నిందితుల అరెస్ట్
కూకట్‌పల్లి రేణు అగర్వాల్ మర్డర్ కేసులో ముగ్గురు నిందితులను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. కీలక సూత్రధారి హర్షతోపాటు అతనికి సహకరించిన రోషన్‌ను.. వీళ్లిద్దరికీ సహకరించిన మరొకరినీ జార్ఖండ్ రాజధాని రాంచీలో పట్టుకున్నట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి తెలిపారు. డబ్బు, బంగారం కోసమే రేణును చంపినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు సైబరాబాద్ సీపీ. ముగ్గురు నిందితులను ట్రాన్సిట్ వారెంట్‌పై హైదరాబాద్‌కి తీసుకురానున్నట్టు చెప్పారు. — —
-
షాప్ ఓనర్‌ను చెప్పుతో కొట్టిన యువతి
మహారాష్ట్రలోని కళ్యాణ్‌లోని కోల్షేవడీ ప్రాంతంలో జరిగిన ఓ ఘటన వైరల్‌గా మారింది. ఓ దుకాణంలో పనిచేస్తున్న యువతి.. ఆ షాప్ యజమానిని చెప్పుతో కొట్టింది. తనను వేధిస్తున్నాడంటూ యువతి కుటుంబానికి చెప్పడంతో వాళ్లు వెంటనే షాప్‌లోకి వచ్చారు. అయితే కుటుంబసభ్యుల ముందే యజమానిని చెప్పుతో బడిత పూజ చేసింది యువతి. చివరకి యువతి కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్పేవరకు వదల్లేదు బంధవులు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
-
ఢిల్లీ తాజ్ ప్యాలెస్ హోటల్‌కు బాంబు బెదిరింపు
ఢిల్లీలోని హైకోర్టుకు బాంబు బెదిరింపు వచ్చిన మరుసటి రోజే తాజ్ ప్యాలెస్ హోటల్‌ను పేల్చేస్తామని బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. తాజ్ ప్యాలెస్ హోటల్‌ను ఖాళీ చేయించి వెంటనే బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. ఎలాంటి బాంబు లేదని తేల్చడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
-
నటి ఐశ్వర్య రాయ్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు
హీరోయిన్ ఐశ్వర్య రాయ్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు నిచ్చింది. అనుమతి లేకుండా తన ఫోటోలను, వీడియోలను వాడుకుంటున్నారని ఇటీవలే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తన ఫొటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల కంటెంట్‌ను ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఐశ్వర్యకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఇకపై ఐశ్వర్య రాయ్ అనుమతి లేకుండా ఆమె ఫొటోలను, పేరును వాడడానికి వీల్లేదని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఆమె ప్రచార, వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తామని న్యాయస్థానం స్పష్టం చేసింది.
-
క్రిప్టో కరెన్సీ పేరుతో భారీ మోసం కార్పొరేటర్ అరెస్ట్
క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే మూడింతలు లాభాలు వస్తాయని నమ్మబలికి ప్రజలను మోసం చేసిన ముఠా పై పోలీసులు నిఘా పెట్టారు.. గత కొన్ని రోజులుగా ఈ అక్రమ దందా కొనసాగింది. కోట్ల రూపాయలు చేతులు మారాయి. ఇప్పుడు..ఇప్పుడే బాధితులు బయటకు వస్తున్నారు ఈ క్రమం లో ప్రధాన నిందితులలో ఒకరైన కరీంనగర్‌కు చెందిన మాజీ కార్పొరేటర్ కట్ల సతీష్‌ను అరెస్టు చేశారు పోలీసులు
-
కీచక ఉపాధ్యాయుడికి దేహశుద్ధి
నల్గొండ జిల్లా నకిరేకల్‌లో కీచక ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు తల్లిదండ్రులు. గత కొంతకాలంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రీనివాస్ అనే ఉపాధ్యాయుడు విద్యార్థులను లైంగికంగా వేధిస్తున్నాడు. ఉపాధ్యాయుడి వేధింపులు తాళలేక విద్యార్థులు వారి తల్లిదండ్రులకు చెప్పారు. ఆగ్రహంతో స్థానికులతో కలిసి ఉపాధ్యాయుడు ఇంటికి వెళ్లిన తల్లిదండ్రులు దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు విద్యార్థిని తల్లిదండ్రులు. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
-
అల్ఫా జోలం ఫ్యాక్టరీపై ఈగల్ టీమ్ దాడి
హైదరాబాద్‌లోని బోయినపల్లిలో అల్ఫా జోలం ఫ్యాక్టరీపై ఈగల్ టాస్క్‌పోర్స్ టీం దాడి చేసింది. ఫ్యాక్టీరీలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కోటి రూపాయల విలువ చేసే అల్ఫాజోలం ను సీజ్ చేసినట్లు ఈగల్ టాస్క్ ఫోర్స్ అధికారులు తెలిపారు. స్కూల్ ఆవరణంలో ఏర్పాటు చేసుకుని సీక్రెట్ గా ఆల్ఫా జోలం తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఇందుకు సంబంధించి పలువురిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టింది ఈగల్ టీమ్.
-
Rain Alert: వచ్చే 3 గంటల్లో ఈ ప్రాంతాల్లో వానలే వానలు
రాబోయే 3 గంటల్లో పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. 40-50కిమీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, చెట్ల క్రింద నిలబడవద్దని, అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మధ్యాహ్నం ఒంటి గంట నాటికి ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో 54.5మిమీ, కృష్ణా జిల్లా కౌతవరంలో 53.2మిమీ, ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో 46.7మిమీ, మచిలీపట్నంలో 42.2 వర్షపాతం నమోదైందని తెలిపింది.
-
అచ్చం తురకపాలేం మాదిరి.. కొత్త రెడ్డి పాలెంలోనూ విష జ్వరాల కలకలం!
గుంటూరు చేబ్రోలు మండలం కొత్త రెడ్డి పాలెంలో విషజ్వరాలు చెలరేగాయి. గ్రామంలో జ్వర బాధితులు ఎక్కువ మంది ఉండటంతో వెంటనే అప్రమత్తమైన వైద్య సిబ్బంది బ్లడ్ కల్చర్ చేయిస్తున్నారు. తురకపాలెంలో మాదిరిగానే కొత్తరెడ్డిపాలెంలోనూ లక్షణాలు ఒకేలా ఉన్నాయని, అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ సూచించారు. ఫీవర్ కేసులు అధికంగా వస్తున్నాయి. అనుమానం ఉన్న వారికి బ్లడ్ కల్చర్ చేయిస్తున్నాం. ఆరుగురికి బ్లడ్ కల్చర్ చేయగా ఐదుగురిలో స్టెఫెలో కొకై బ్యాక్టీరియా పాజిటివ్ గా తేలింది. మరొక కేసులో మెలియాయిడోసిస్ కేసు గా అనుమానాలున్నాయి. మరిన్ని పరీక్షలు కోసం శాంపిల్స్ గుంటూరు పంపించామని చేబ్రోలు పిహెచ్ సి వైద్యురాలు ఊర్మిళ అన్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
-
తొలి రోజు దుమ్ముదులిపిన తేజ సజ్జా ‘మిరాయ్’.. ఎన్ని కోట్లు వచ్చాయంటే?
తేజ సజ్జా, మంచు మనోజ్ ప్రధానపాత్రల్లో నటించిన ‘మిరాయ్’ తొలి రోజు కాసుల వర్షం కురిపించింది. ఒక్క రోజే ఏకంగా రూ.27.20కోట్లు వసూళ్లు రాబట్టినట్లు మువీ టీమ్ అధికారికంగా పోస్టర్ విడుదల చేసింది.
-
ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసులో మంచు లక్ష్మికి ED నోటీసులు.. నటి రియాక్షన్
బెట్టింగ్ యాప్ కేసులో మంచు లక్ష్మికి ఈడీ నోటీసులు జారీపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో నటి స్పందిస్తూ.. ఈ కేసులో చిట్టచివరి వ్యక్తి వద్దకు వచ్చి విచారణ చేసినట్లుగా అనిపించిందంటూ వ్యాఖ్యానించారు. అసలు ఇది ఎక్కడ మొదలైందనే దానిపై అధికారులు దృష్టిపెడితే బాగుంటుందని అన్నారు. 100 మంది సెలబ్రెటీలు ప్రచారం చేశారని, అందులో తాను కూడా ఉన్నట్లు చెప్పారని, అందుకే విచారణకు హాజరైనట్లు మంచు లక్ష్మి అన్నారు.
-
‘పోలీసుల మాదిరే CBI కూడా వ్యవహరిస్తోంది.. సీఎం చంద్రబాబు జోక్యం చేసుకోవాలి’ అయేషా మీరా తల్లి
అయేషా మీరా హత్య కేసులో సిబిఐ హైకోర్ట్ కు ఇచ్చిన రిపోర్టును మాకివ్వాలని తల్లి అయేషా మీరా తల్లి షంషాద్ బేగం మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. మాకు ఆ రిపోర్ట్ కాపి ఇవ్వకుండా అభ్యంతరాలు చెప్పమంటే ఎలా చెప్తామని ప్రశ్నించారు. సిబిఐ విచారణకు రావాలని చెప్పిన వెళ్ళలేదు. సిబిఐ దర్యాప్తు సంస్థ ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. మా మతాచారాలకు వ్యతిరేకంగా ఖననం చేసిన తర్వాత కూడా మా పాప శరీర భాగాలు తీసుకెళ్ళారు. ఇప్పటి వరకూ తిరిగి ఇవ్వలేదు. పోలీసులు ఏ విధంగా వ్యవహరించారో అదే విధంగా సీబీఐ కూడా చేస్తోంది. నివేదిక మాకు ఇస్తే చదువుకున్న తర్వాతే అభ్యంతరాలు చెబుతాం. ఈ కేసులో 18 ఏళ్లుగా పోరాటం చేస్తున్నాం. సీఎం చంద్రబాబు జోక్యం చేసుకోవాలి. మా పాప విషయంలో న్యాయం జరిగినప్పుడు ఇతరుల విషయంలో కూడా న్యాయం జరుగుతుందని నమ్ముతామని ఆమె ఆన్నారు.
-
Mizoram’s first railway line: మిజోరం తొలి రైల్వే స్టేషన్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ
మిజోరం తొలి రైల్వే స్టేషన్‌ను శనివారం (సెప్టెంబర్ 13) ప్రధాని మోదీ ప్రారంభించారు. ఐజ్వాల్‌ను ఢిల్లీతో కలిపే రాష్ట్ర తొలి రాజధాని ఎక్స్‌ప్రెస్‌ను జెండా ఊపి ప్రారంభించారు. భారతీయ రైల్వే చరిత్రలో అత్యంత సవాలుతో కూడిన రైలు మార్గమైన రూ.8,070 కోట్ల బైరాబి-సైరాంగ్ రైల్వే లైన్‌ను 2008-09లో మంజూరు చేశారు. 2015లో దీరి నిర్మాణం ప్రారంభమైంది. ఈ లైన్‌లో 45 సొరంగాలు, 55 ప్రధాన వంతెనలు, 87 చిన్న వంతెనలు ఉన్నాయి. సైరాంగ్ సమీపంలోని 144వ వంతెన, కుతుబ్ మినార్ కంటే 114 మీటర్ల ఎత్తులో ఉండటం విశేషం.
-
Ayesha Meera Murder Case Update: అయేషామీరా హత్య కేసులో సీబీఐ హైడ్రామా.. 18 ఏళ్లుగా న్యాయ పోరాటం
గత 18 ఏళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్న అయేషామీరా హత్య కేసు విచారణలో తీవ్ర జాప్యం నెలకొంది. ఈ కేసులో గతంలో సత్యంబాబు విజయవాడ మహిళా సెషన్స్ కోర్టు అతడికి జీవితఖైదు విధించింది. అయితే 2017లో హైకోర్టు అతడు నిర్దోషి అని తీర్పు ఇచ్చింది. దీనిపై అయేషామీరా తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించగా ఈ కేసును CBIకి అప్పగించారు. దీనిపై 3 నెలల కిందట సీబీఐ నివేదిక అందించింది. సత్యంబాబుపై పునర్విచారణకు పెట్టిన కేసుకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని, ఈ నెల 19న విజయవాడ సీబీఐ కోర్టులో విచారణకు రావాలని తాజాగా ఆయేషామీరా తల్లిదండ్రులు షంషాద్‌బేగం, సయ్యద్ ఇక్బాల్ బాషాలకు కోర్టు నోటిసీలు జారీ చేసింది. అయితే ఈ కేసులో సీబీఐ నివేదిక వివరాలు తమకు ఇవ్వలేదని, కోర్టు విచారణకు హాజరు కాలేమని, తమ బిడ్డకు న్యాయం చేయడంతో సీబీఐ కూడా విఫలమైందని మీడియా సమావేశంలో ఆయేషా తల్లిదండ్రులు ఆవేధన వ్యక్తం చేశారు.
-
Shankarapalli Road Robbery: శంకరపల్లి దారిదోపిడిలో కీలక ట్విస్ట్.. కారు డ్రైవరే అసలు దొంగ!
శంకరపల్లి దారిదోపిడి ఘటనలో పోలీసులు ఏడుగురిని అరెస్టు చేశారు. వీరిని జడ్చర్లలో అర్ధరాత్రి అరెస్టు చేశారు. ఈ దోపిడీ ప్రధాన సూత్రధారి స్టీల్ వ్యాపారి డ్రైవర్ మధుగా పోలీసులు గుర్తించారు.
-
రైతన్నలకు తీరని యూరియా కష్టాలు.. లైన్లలోనే బారులు తీరి పడిగాపులు
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం లోని సత్తాన్ పెల్లి సహకార సంఘంలో యూరియా తిప్పలు పడుతున్న రైతులు. గత వారం రోజుల నుంచి యూరియా రావడం లేదని ఈరోజు ఉదయం నుండి పడిగాపులు కస్తూ ఎకరానికి ఒక్క సంచి తీసుకపోతున్న రైతులు. ఇవి సరిపోదని ఇంకా రెండు, లేదా ముడు లారీలు వస్తే రైతులకు సరిపోతాదాని, తప్పకుండా యూరియా రైతులకు ఇచ్చి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
-
Vijayawada Diarrhea Outbreak: విజయవాడలో డయేరియాకు పడని బ్రేకులు.. ప్రహసనంగా ల్యాబ్ టెస్ట్‌లు
విజయవాడలో ఇంకా ఆగని డయేరియా కేసులు. న్యూ ఆర్ పేటలో కొనసాగుతున్న మెడికల్ క్యాంపులు. నాలుగు రోజులుగా వాంతులు విరోచనాలతో ఆసుపత్రులకు వెళ్తున్న ప్రజలు. రోగుల పరిస్థితి ఆందోళనకరంగా లేకపోయినా.. ఇంకా అదుపులోకి రాలేదని స్థానికులు ఆందోళన. దీంతో మినరల్ వాటర్ బాటిళ్ల పంపిణీ అక్కడ కొనసాగుతుంది. అక్కడి పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నప్పటికీ సమస్యకు కారణం త్రాగునీటి పరిరక్షణ అధికారులు ఇంకా తెలపకపోవడం విశేషం.
-
అల్లూరిలో వైద్యం చేయాలంటే ఫీట్లు చేయాల్సిందే
అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సిలో వర్షాల ధాటికి వాగులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. పాడేరు మంటి అర్జాపురం వద్ద ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగు. అక్కడి జనాలకు ఆరోగ్య సేవలను అందించేందుకు ములగపాలెం, తుమ్మలపాలెం గ్రామస్తులు కర్రలతో చేసిన నిచ్చెన దాటుతూ వైద్యరోగ్య శాఖ సిబ్బంది ప్రమాదకర స్థితిలో వాగులు దాటుతున్నారు. దీంతో తమ గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలని స్థానికుల డిమాండ్ చేస్తున్నారు.
-
Srikakulam: పలాస డిగ్రీ కాలేజీకి యునిసెఫ్ గుర్తింపు
శ్రీకాకుళం జిల్లా పలాస ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి అరుదైన గుర్తింపు దక్కింది. ఈ కాలేజీకి యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్(యూనిసెఫ్) గుర్తింపు లభించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టరు జె వెంకటలక్ష్మి ఓ ప్రకటనలో తెలిపారు. 2024-25 విద్యాసంవత్సరానికి లెర్నింగ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రొగ్రాంలో విద్యార్థులు కనబరిచిన ప్రతిభకు గాను ఈ గుర్తింపు దర్కినట్లు వెల్లడించారు.
-
Andhra Pradesh: ఇదేందయ్యా ఇదీ.. రాత్రికిరాత్రే సముద్రం రక్షణ గోడను ఎత్తుకెళ్లిన దొంగలు
అంతర్వేది కర గ్రామంలో సముద్రపు రక్షణ గోడను రాత్రి రాత్రే త్రవ్వేసిన దుండగులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి (మం) అంతర్వేది కర గ్రామంలో సముద్రం అలల ఆటుపోట్లకు సముద్రపు నీరు గ్రామం మీదకు రాకుండా పనికి ఆహార పథకం ద్వారా రక్షణ గట్టును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ఈ నెల 3 వ తేదీన అర్ధరాత్రి జేసీబీ సహాయంతో రక్షణ గట్టును త్రవ్వుకు పోయిన గుర్తు తెలియని దుండగులు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అంతర్వేది కర VRO పిర్యాదుతో కేసు నమోదు చేసిన సఖినేటిపల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
-
బడికి వెళ్లాలని తల్లిదండ్రుల మందలింపు.. 9వ తరగతి బాలిక సూసైడ్!
మంచిర్యాల జిల్లాలో తల్లిదండ్రులు మందలించారని విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. బెల్లంపల్లి మండలం యాకనపల్లి గ్రామానికి చెందిన 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఎగ్గే సుప్రియ ఆత్మహత్య యత్నం చేసింది. స్కూల్ కు వెళ్ళాలని తల్లిదండ్రులు మందలించడంతో మనస్థాపం చెంది గోళీలు మింగి ఆత్మహత్య యత్నం చేసింది. మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి.
-
Andhra Pradesh Crime: అనుమానంతో భార్య కొంతు కోసి.. ఆపై భర్త సూసైడ్!
ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం రేగలగడ్దలో దారుణం చోటు చేసుకుంది. భార్యపై అనుమానంతో రోకలి బండతో కొట్టి చంపిన భర్త. అనంతరం తానూ ఆత్మహత్యయత్నం చేసుకున్న భర్త. ప్రస్తుతం భర్త పరిస్థితి విషమం, ఆసుపత్రి తరలింపు.
-
అల్లూరి జిల్లాలో 1020 కిలోల గంజాయి సీజ్
- అల్లూరి జిల్లా పెదబయలు మండలం గోమంగి వద్ద ఎక్సైజ్ తనిఖీలు.
- రెండు వాహనాల్లో తరలిస్తున్న 1020 కిలోల గంజాయి సీజ్.. ముగ్గురు అరెస్ట్…
- ఒడిస్సా నుంచి జార్ఖండ్ కు గంజాయి తరలిస్తున్నట్టు గుర్తింపు
-
Russia Earthquake: రష్యాలో మరోసారి భూకంపం.. రికర్టర్ స్కేల్ పై 7.1గా భూకంప తీవ్రత
రష్యాను మరోసారి భారీ భూకంపం వణికించింది. భూకంప తీవ్రత రికర్టర్ స్కేల్ పై 7.1గా నమోదైంది. కామ్చాట్కా తీరంలో 10కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు జర్మనీ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్ వెల్లడించింది. కాగా ఇటీవల ఇదే ప్రాంతంలో 8.8 తీవ్రతతో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. అప్పట్లో స్వల్పంగా సునామీ కూడా వచ్చింది.
-
Hyderabad: హైదరాబాద్‌లో పట్టపగలు దారుణం.. డమ్మీ గన్‌తో బెదిరించి రూ.40 లక్షలు చోరీ!
సైబరాబాద్ పరిధిలోని శంకర్‌పల్లిలో పట్టపగలు కారులో వెళ్తున్న వ్యక్తులను గుర్తు తెలియని దుండగులు డమ్మీ గన్‌తో బెదిరించి దారిదోపిడీకి పాల్పడ్డారు. రాకేశ్ అగర్వాల్ స్టీల్ వ్యాపారి నుంచి రూ.40 లక్షలు కాజేశారు. ఈ ఘటన శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో జరిగింది. కారు నడుపుతున్న మణి కళ్లలో కారం కొట్టి ఈ దాడి చేశారు.
-
Congo Boat Accident: కాంగోలో ఘోర విషాదం.. 2 పడవ ప్రమాదాల్లో 193 మంది మృతి!
కాంగో నదిలో గురువారం సాయంత్రం 500 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ అనూహ్యంగా మంటల్లో చిక్కుకుని నీటిలో బోల్తాపడింది. మరోవైపు ఈక్వెటార్ ప్రావిన్స్‌లోనూ మరో పడవ బోల్తా పడింది. ఈ రెండు ఘటనల్లో మొత్తం 193 మంది మృతి చెందారు.
-
Harbhajan Singh in BCCI President Race: బీసీసీఐ అధ్యక్ష పదవి రేసులో హర్భజన్ సింగ్..?
బీసీసీఐ అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుందోనన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో హర్భజన్ సింగ్ పేరు కూడా అధ్యక్ష పదవి రేసులో ఉండే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
-
Dussehra Special Trains 2025: దసరా పండక్కి హైదరాబాద్ నుంచి స్పెషల్ ట్రైన్లు..
దసరా సందర్బంగా కాచిగూడ నుంచి ఏపీ, ఉత్తర, దక్షిణాది రాష్ట్రాలకు పలు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ఇండియన్ రైల్వే ప్రకటించింది. కాచిగూడ-బికనేర్ (07053), కాచిగూడ-నాగర్‌సోల్ (07055), కాచిగూడ-మురుదేశ్వర్ (07191) ఎక్స్‌ప్రెస్ రైళ్లను సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 5 వరకు ప్రయాణికుల సౌకర్యార్ధం అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది.
-
Road Accident: మద్యం మత్తులో ట్రిపుల్ రైడింగ్.. పాదచారుడిపైకి దూసుకెళ్లిన బైక్! ఆ తర్వాత
విశాఖపట్నం కంచరపాలెం పిఎస్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ట్రిపుల్ రైడింగ్ తో పాదాచారుడ్ని ఢీకొట్టిన వెస్పా. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలవగా వారిని ఆసుపత్రికి తరలించారు. మద్యం మత్తులో వెస్పా డ్రైవ్ చేస్తున్నట్టు గుర్తించిన పోలీసులు.
-
Kukatpally Woman Murder Case: కూకట్‌పల్లి రేణు మర్డర్ కేసులో ట్విస్ట్.. ఇద్దరు నిందితులు అరెస్ట్
కూకట్‌పల్లి రేణు అగర్వాల్ హత్య కేసును పోలీసులు చెందించారు. నిందితులను రాంచీలో అరెస్ట్ చేసిన కూకట్‌పల్లి పోలీసులు. హత్యకు ముందు మెదక్ తుప్రాన్‌లో ఒక ఫాం హౌస్ లో హత్యకు ముందు పార్టీ చేసుకున్న హర్ష గ్యాంగ్. పార్టీలో మొత్తం 9 మందిని గుర్తించిన పోలీసులు. ఢిల్లీ ఫరిధాబాద్ లో ఉన్న నిఖిల్ ను పట్టుకున్న పోలీసులు. క్యాబ్ డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు కేసును ఛేదించారు. హైదరాబాద్ లో కొండాపూర్ నుంచి రాంచీ క్యాబ్ బుక్ చేసుకున్న హర్ష. రాంచీలో వాళ్ళను డ్రాప్ చేసి వస్తున్న సమయంలో instaa graam లో చూసి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చిన క్యాబ్ డ్రైవర్. క్యాబ్ డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
-
నేపాల్‌లో వీసా నిబంధనలు సడలింపు
నేపాల్‌లో చిక్కుకున్న విదేశీయుల కోసం అక్కడి ప్రభుత్వం వీసా నిబంధనలు సడలించింది. సెప్టెంబరు 8 వరకు చెల్లుబాటయ్యే వీసాలున్నవారు ఎలాంటి అదనపు రుసుములు చెల్లించకుండానే వీసాలు క్రమబద్ధీకరించుకోవచ్చని అధికారులు తెలిపారు. అలాగే పాస్‌పోర్టులు పోగొట్టుకున్నవారు వీసాను బదలాయించుకునేలా ఏర్పాట్లు చేశారు.
-
Telangana Floods: యాదాద్రిలో మూసీ ఉగ్రరూపం.. కాపలా కాస్తున్న పోలీసులు!
యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం జూలూరు వద్ద మూసి లో లెవెల్ బ్రిడ్జి పై నుండి భారీగా మూసి ప్రవహిస్తుంది. దీంతో పోచంపల్లి – బీబీనగర్ మధ్య నిలిచిన రాకపోకలు. ఇరువైపులా భారీ కేడ్లు ఏర్పాటుచేసిన పోలీసులు… వలిగొండ మండలం సంగెం గ్రామం భీమలింగం వద్ద లో లెవెల్ వంతెన పైనుండి భారీగా ప్రవహిస్తున్న మూసి. చౌటుప్పల్ – భువనగిరి మధ్యలో రాకపోకలు బంద్. ఆయా చోట్ల భారీకేడ్లు వేసి పోలీసులు కాపలా కాస్తున్నారు. మూసి పరివాహక ప్రాంత ప్రజలు, వాహనదారులు, అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేసిన పోలీసులు.
-
Telangana Weather News: నేడు, రేపు రాష్ట్రంలో అతి భారీ వర్షాలు.. హెచ్చరికలు జారీ
ఈ రోజు (సెప్టెంబర్ 13) తెలంగాణ లోని నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాద్ వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ – మల్కాజిగిరి, వికారాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
రేపు (సెప్టెంబర్ 14) ఆదిలాబాద్, కొమరం భీం, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ, జనగాం జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ రోజు, రేపు తెలంగాణ లోని అన్ని జిల్లాలలో అక్కడక్కడ గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొ్ంది.
-
KTR Gadwal Tour: నేడు కేటీఆర్ గద్వాల్ పర్యటన.. తేరు మైదానంలో BRS బహిరంగ సభ!
జోగులాంబ గద్వాల జిల్లా నియోజకవర్గంలో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం (సెప్టెంబర్ 13) పర్యటించనున్నారు. సాయంత్రం గం.4.00లకు గద్వాల్ జిల్లా కేంద్రంలోని కిష్టారెడ్డి బంగ్లా నుంచి తేరు మైదానం వరకు BRS కార్యకర్తలు, నేతలతో భారీ ర్యాలీ. అనంతరం తేరు మైదానంలో BRS పార్టీ బహిరంగ సభలో పాల్గొననున్న కేటీఆర్.
-
Telangana Rain Update: మరో 2 గంటల్లో ఈ జిల్లాల్లో వానలు.. ఎల్లో అలెర్ట్ జారీ
రాగల రెండు గంటలలో ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జోగులాంబ గద్వాల్, ఖమ్మం, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాలు, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, సూర్యాపేట, వనపర్తి జిల్లాలలో అక్కడక్కడ మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
Published On - Sep 13,2025 6:29 AM
