వీడు మనిషా.. మృగమా.. చికెన్ వండలేదని భార్యను ఏం చేశాడంటే..?
భర్త చికెన్ తీసుకొని వచ్చాడు. భార్యకు ఇచ్చి వండమని చెప్పాడు. కానీ ఆమె వెజ్ కర్రీ చేసింది. దీంతో దంపతుల మధ్య పెద్ద గొడవ మొదలైంది. చికెన్ వండలేదని భార్యపై భర్త దాడి చేశాడు. ఈ దాడితో మనస్థాపం చెందిన భార్య కఠని నిర్ణయం తీసుకుంది.

ఈ మధ్యకాలంలో భార్యభర్తలు.. చిన్న విషయాలకే విడిపోవడం, చంపుకోవడం కామన్‌గా మారింది. నచ్చిన కూర వండలేదని, కూరలో ఉప్పు ఎక్కువైందని భార్యలపై దాడులు చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈ క్రమంలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలో జరిగిన ఈ షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చికెన్ వండలేదని భార్యపై దాడి చేసిన భర్త ఆమె చావుకు కారణమయ్యాడు. పైగా తప్పించుకోవడానికి ఆమె మృతదేహాన్ని నదిలో పడేశాడు. 10 నెలల క్రితం రీనా అనే 21 ఏళ్ల యువతి నిగమ్‌ను పెళ్లి చేసుకుంది. ఆగస్టు 21న నిగమ్ ఇంటికి ఫుల్‌గా మందుకొట్టి ఇంటికి చికెన్ తీసుకొని వచ్చాడు. భార్య చికెన్ వండుతుందని అని అనుకున్నాడు. కానీ రీనా మాత్రం మరో వెజిటేరియన్ వంటకం చేసింది. దీంతో ఇద్దరి మధ్య పెద్ద గొడవ మొదలైంది. నిగమ్ కోపంతో రీనాపై దాడి చేశాడు.
నదిలో పడేశాడు
భర్త దాడి చేయడంతో మనస్థాపం చెందిన రీనా.. ప్రాణం తీసుకుంది. ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భార్య చనిపోయిన తర్వాత నిగమ్ భయపడిపోయాడు. ఆమె బంధువులు తనపై దాడి చేస్తారని టెన్షన్ పడ్డాడు. ఈ క్రమంలో తన బంధువుల సహాయంతో రీనా డెడ్ బాడీని ఒక షీట్‌లో చుట్టి గంగా నదిలో పడేశాడు. ఆ తర్వాత పోలీసులు అనుమానించకుండా ఉండేందుకు తన భార్య కనిపించడం లేదని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశాడు.
దర్యాప్తులో అసలు నిజాలు
పోలీసులు దర్యాప్తు చేయగా అసలు విషయం బయటపడింది. తొలుత రీనా కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో నిగమ్‌తో పాటు అతని కుటుంబంలోని ఐదుగురిపై వరకట్న హత్య కేసు నమోదు చేశారు. ఆ తర్వాత నిగమ్‌ను పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో నేరాన్ని ఒప్పుకున్నాడు. ఇప్పటివరకు నిగమ్‌తో సహా ముగ్గురిని అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే నిగమ్ తండ్రి సురేష్, తల్లి కుంట ఇంకా పరారీలో ఉన్నారు. తన సోదరి మృతదేహాన్ని వెతికి.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని రీనా సోదరుడు డిమాండ్ చేశారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




