Breaking: CBSE 12వ తరగతి పరీక్షలు రద్దు.. విద్యార్ధుల ఆరోగ్యమే ముఖ్యం: ప్రధాని మోదీ
ఉత్కంఠకు తెరపడింది. సీబీఎస్ఈ 12వ తరగతి బోర్డు పరీక్షలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ...
CBSE 12th Class Exams Cancelled: ఉత్కంఠకు తెరపడింది. సీబీఎస్ఈ 12వ తరగతి బోర్డు పరీక్షలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన హై-లెవెల్ మీటింగ్‌లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. స్టూడెంట్స్ ఆరోగ్యం, భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది సీబీఎస్ఈ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
ఆబ్జెక్టివ్ ప్రమాణాల ప్రకారం పన్నెండో తరగతి ఫలితాలను రూపొందించనుండగా.. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి. ఇక పరీక్షలు రాయాలనుకునేవారికి కరోనా వ్యాప్తి తగ్గాక నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. కాగా, గతంలోనే సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
బాల్కానీలో దంపతుల ఫైట్.. అంతలోనే ఘోరం.. చూస్తే షాక్ అవ్వాల్సిందే.!
భర్త ఫోన్‌పై నిఘా పెట్టింది.. ఊహించని షాక్ తగిలింది.. చివరికి ఏం జరిగిందంటే.!
తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు వేసవి సెలవులు పొడిగింపు.. ఎప్పటివరకంటే..
ప్రపంచంలోనే వింతైన వంటకాలు.. చూస్తేనే వాంతి వస్తుంది.. తినడానికి కూడా ధైర్యం చెయ్యరు.!