AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Supreme Court: సుప్రీంకోర్టు చరిత్రలోని తొలిసారి.. నేడు ప్రమాణస్వీకారం చేయనున్న 9 మంది న్యాయమూర్తులు..

Supreme Court: సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియామకమైన తొమ్మిది మంది న్యాయమూర్తులు ఇవాళ ప్రమాణ స్వీకారం

Supreme Court: సుప్రీంకోర్టు చరిత్రలోని తొలిసారి.. నేడు ప్రమాణస్వీకారం చేయనున్న 9 మంది న్యాయమూర్తులు..
Supreme Court
Shiva Prajapati
|

Updated on: Aug 31, 2021 | 6:29 AM

Share

Supreme Court: సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియామకమైన తొమ్మిది మంది న్యాయమూర్తులు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఇవాళ ఉదయం 10.30 గంటలకు వీరిచే పరమాణ స్వీకారం చేయిస్తారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఢిల్లీలోని ప్రగతి మైదాన్ మెట్రో స్టేషన్ సమీపంలోని సుప్రీంకోర్టు కొత్త ఆడిటోరియంలో జరుగనుంది.

కాగా, సుప్రీంకోర్టు జారీ చేసిన ప్రకటన ప్రకారం.. 70 సంవత్సరాల కోర్టు చరిత్రలో ఒకేసారి తొమ్మిది మంది కొత్త న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేయడం ఇదే మొదటిసారి. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా వారి పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం ఆగస్టు 17 న సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. ఈ సిఫార్సుకు ఆగస్టు 26 న కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆయా న్యాయమూర్తుల నియామక పత్రాలపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సంతకం చేశారు. కాగా, సుప్రీంకోర్టులో గరిష్టంగా 34 మంది న్యాయమూర్తులు ఉండవచ్చు. ఇప్పటి వరకు అత్యున్నత న్యాయస్థానంలో 10 న్యాయమూర్తి స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం 9 మంది న్యాయమూర్తుల నియామకంతో ఆ ఖాళీల సంఖ్య ఒకటికి చేరింది.

ఈ తొమ్మిది మంది న్యాయమూర్తులు.. కొత్త న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, అత్యున్నత న్యాయస్థానంలో ఒక ఖాళీ మాత్రమే ఉంటుంది. కాగా, ఈ తొమ్మిది మంది న్యాయమూర్తుల్లో నాగరత్నతో పాటు, కర్ణాటక హైకోర్టులో సీనియర్-మోస్ట్ జడ్జి బేల ఎం. త్రివేది, గుజరాత్ హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హిమా కోహ్లీ, జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ రవికుమార్‌, జస్టిస్ పీఎస్‌ నరసింహ, జస్టిస్‌ సుందరేష్, జస్టిస్‌ ఏఎస్‌ ఒకా, జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ ఉన్నారు.

అయితే, హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సు 62 సంవత్సరాలు. ఈ నేపథ్యంలో జస్టిస్ హిమా కోహ్లీ సెప్టెంబర్ 1న పదవీ విరమణ చేయాల్సి ఉంది. కానీ, ఆమె సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియామకం అవడంతో ఆమె పదవీ విరమణ కాలం మరో మూడేళ్లు పెరిగినట్లయ్యింది. ఎందుకంటే.. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సు 65 సంవత్సరాలు.

జస్టిస్ నాగరత్న మాజీ ప్రధాన న్యాయమూర్తి కుమార్తె.. జస్టిస్ నాగరత్న అక్టోబర్ 30, 1962 న జన్మించారు. భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి ఇఎస్ వెంకట్రామయ్య కుమార్తె. అక్టోబర్ 28, 1987 న బెంగళూరులో న్యాయవాదిగా రిజిస్టర్ అయిన నాగరత్న.. రాజ్యాంగం, వాణిజ్యం, భీమా, సేవల రంగాలలో ప్రాక్టీస్ చేశారు. ఆమె ఫిబ్రవరి 18, 2008 న కర్ణాటక హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఫిబ్రవరి 17, 2010 న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియామకం అయ్యాయిరు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఆమె పదవీకాలం అక్టోబర్ 29, 2027 వరకు ఉంటుంది. కాగా, ఆమె సీజేఐగా కూడా బాధ్యతలు చేపట్టే అవకాశం కనిపిస్తోంది. సెప్టెంబర్ 23, 2027 తర్వాత మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఆమె ఒక నెల కంటే ఎక్కువ కాలం సీజేఐ గా బాధ్యతలు నిర్వహించొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Also read:

Telangana: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. ఏ జిల్లాకు ఏ కలెక్టర్ అంటే..

Shocking News: హడలెత్తిస్తున్న అంతుచిక్కని వ్యాధి.. ప్రాణాలు కోల్పోయిన 30 మంది చిన్నారులు..

Supreme Court: మంగళవారం ప్రమాణస్వీకారం చేయనున్న సుప్రీం కోర్టు న్యాయమూర్తులు..