Assembly Election 2023: ఎన్నికలు ఏ పరిస్థితులలో వాయిదా వేయబడతాయంటే.. ఏ రూల్స్ ప్రకారం ఎన్నికల రద్దు చేస్తారంటే..
Electoral System in India: భారతదేశంలోని ఏదైనా అసెంబ్లీ నియోజకవర్గం లేదా లోక్‌సభ నియోజకవర్గంలో ఎన్నికలను రద్దు చేయడం ఒక సందర్భంలో మాత్రమే జరుగుతుంది. ఏదైనా అసెంబ్లీ లేదా పార్లమెంటరీ స్థానంలో జాతీయ లేదా స్థానిక పార్టీ అభ్యర్థి నామినేషన్ తర్వాత.. ఓటింగ్ తేదీలలో మధ్యలో మరణిస్తే మాత్రమే ఆ స్థానంలో ఎన్నికలు రద్దు చేస్తారు. స్వతంత్ర అభ్యర్థులు చనిపోయినప్పుడు కూడా ఇలాగే చేస్తారు. అయితే తర్వాత ఈ నిబంధనను..

ఐదు రాష్ట్రాల్లో జోరుగా ఎన్నిక ప్రచారం హోరందుకుంది. ఇప్పటికే దాదాపు అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. ముందుగా నవంబర్ 7న మిజోరంలో ఓటింగ్ జరగనుంది. అదే రోజు ఛత్తీస్‌గఢ్‌లో మొదటి దశలో భాగంగా 20 స్థానాలకు ఓటింగ్ నిర్వహిస్తారు. రెండు రాష్ట్రాల్లో ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి.
తెలంగాణకు పొరుగునే ఉండే ఛత్తీస్‌గఢ్‌లో రెండు విడతల్లో పోలింగ్ నిర్వహించాలని నిర్ణయించింది. ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీలో స్థానాల సంఖ్య 90, మావోయిస్టు ప్రభావిత బస్తర్, ఆ చుట్టుపక్కల ఉండే 20 నియోజకవర్గాల్లో తొలి విడత పోలింగ్ నవంబర్ 7న జరగనుంది. మిగిలిన 70 నియోజకవర్గాల్లో నవంబర్ 17న పోలింగ్ జరగనుంది. ఈ ఓట్ల లెక్కింపు కూడా డిసెంబర్ 3న ఉంటుంది. ఛత్తీస్‌గఢ్ తొలి దశ పోలింగ్‌కు నామినేషన్ల ప్రక్రియ అక్టోబర్ 13న ప్రారంభం కానుంది. రెండో దశ నామినేషన్ల ప్రక్రియ అక్టోబర్ 21న మొదలవుతుంది.
ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు , మరో 6 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల సమయంలో.. హఠాత్తుగా ఎన్నికలను రద్దు చేయవచ్చా అనే ప్రశ్న చాలాసార్లు ప్రజల మదిలో వస్తుంది. అవును అయితే, ఇది ఏ పరిస్థితులలో జరుగుతుంది..? భారతదేశంలో ఎన్నికలు ఏ పరిస్థితుల్లో రద్దు చేయబడతాయో ఇక్కడ మనం తెలుసుకుందాం..
ఒక అభ్యర్థి మరణించిన సందర్భంలో
భారతదేశంలోని ఏదైనా అసెంబ్లీ నియోజకవర్గం లేదా లోక్‌సభ నియోజకవర్గంలో ఎన్నికలను రద్దు చేయడం ఒక సందర్భంలో మాత్రమే జరుగుతుంది. ఏదైనా అసెంబ్లీ లేదా పార్లమెంటరీ స్థానంలో జాతీయ లేదా స్థానిక పార్టీ అభ్యర్థి నామినేషన్ తర్వాత.. ఓటింగ్ తేదీలలో మధ్యలో మరణిస్తే మాత్రమే ఆ స్థానంలో ఎన్నికలు రద్దు చేస్తారు. స్వతంత్ర అభ్యర్థులు చనిపోయినప్పుడు కూడా ఇలాగే చేస్తారు. అయితే తర్వాత ఈ నిబంధనను మార్చి, ఎన్నికల సమయంలో ఏదైనా నమోదైన పార్టీ అభ్యర్థి మరణిస్తే ఎన్నికను రద్దు చేయాలని నిర్ణయించారు.
ఎన్నికలు రద్దయిన తర్వాత ఏంటి..
అభ్యర్థి మరణంతో ఏదైనా అసెంబ్లీ నియోజకవర్గం లేదా లోక్‌సభ నియోజకవర్గంలో ఎన్నికలు వాయిదా పడితే అక్కడ ఐదేళ్లపాటు ఎన్నికలు నిర్వహించకూడదని కాదు. కొంత సమయం తరువాత.. ఎన్నికల సంఘం ఆ స్థానానికి ఎన్నికల తేదీలను ప్రకటించి, ఆ స్థానానికి ప్రత్యేకంగా ఓటింగ్ ప్రక్రియను పూర్తి చేస్తుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి