Nitish Kumar: బిహార్ అసెంబ్లీలో బలపరీక్షకు సిద్దమైన నితీష్ కుమార్..
ఎన్‌డిఎతో కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఫిబ్రవరి 12, సోమవారం రాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కోనున్నారు. గత నెలలో, విపక్షాల ఇండియా కూటమిని వదిలిపెట్టి NDA-BJP కూటమిలో తిరిగి చేరారాయన. ఆ తర్వాత రికార్డు స్థాయిలో తొమ్మిదోసారి బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు.
ఎన్‌డిఎతో కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఫిబ్రవరి 12, సోమవారం రాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కోనున్నారు. గత నెలలో, విపక్షాల ఇండియా కూటమిని వదిలిపెట్టి NDA-BJP కూటమిలో తిరిగి చేరారాయన. ఆ తర్వాత రికార్డు స్థాయిలో తొమ్మిదోసారి బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలోనే తన సొంత పార్టీ జనతాదళ్-యునైటెడ్ (JDU) ఎమ్మెల్యేలందరికీ ఫ్లోర్ టెస్ట్ కు హాజరు కావాలని విప్ జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే బలపరీక్షకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. బలపరీక్ష జరుగనున్న తరుణంలో బిహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు హైదరాబాద్‌లో క్యాంపు ఏర్పాటు చేశారు. దాదాపు వారం రోజులుగా బిహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. బలపరీక్ష నేపథ్యంలో.. ఇవాళ సాయంత్రం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాట్నా వెళ్లనున్నారు.
ఇదిలా ఉంటే శనివారం సీఎం నితీష్ ఏర్పాటు చేసిన విందుకు 10మంది ఎమ్మెల్యేలు గైర్హాజరైనట్లు తెలుస్తోంది. దీంతో బలపరీక్షపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరో వైపు బిహార్‌లో తేజస్వీ యాదవ్ ఇంట్లోనే ఆర్జేడీ ఎమ్మెల్యేలకు వసతి ఏర్పాటు చేశారు. రేపటి వరకు ఎమ్మెల్యేలంతా తేజస్వీ యాదవ్ ఇంట్లోనే ఉండనున్నారు. కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన బీహార్ అసెంబ్లీ స్పీకర్ అవధ్ బిహారీ చౌదరి ఫిబ్రవరి 12న బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే వరకు తాను రాజీనామా చేయబోనని తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే అసెంబ్లీ సమావేశాల్లో వ్యవహరించే తీరుపై బీజేపీ ఎమ్మెల్యేలకు బోధ్‌గయాలో రెండు రోజుల వర్క్‌షాప్ నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన ఎన్డీయే ప్రభుత్వం విశ్వాస పరీక్షలో విజయం సాధిస్తుందని జేడీ(యూ) సీనియర్ నేత విజయ్ కుమార్ చౌదరి ధీమా వ్యక్తం చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..