PM Modi: ప్రధాని మోదీ వారసుడిగా వీరిలో ఎవరైతే బాగుంటుంది.? సర్వేలో ఆసక్తికర పేర్లు!

రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో అధికార బీజేపీ మరోసారి అధికారాన్ని దక్కించుకోవడం ఖాయమని చెప్పిన ఇండియా టుడే ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వే మరో ఆసక్తికర అంశంపై జనాభిప్రాయాన్ని వెల్లడించింది. బీజేపీలో ప్రధాని మోదీ వారసుడిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను 29 శాతం మంది, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను 25 శాతం మంది, నితిన్ గడ్కరీని 16 శాతం మంది కోరుకుంటున్నారని సర్వే తెలిపింది.

PM Modi: ప్రధాని మోదీ వారసుడిగా వీరిలో ఎవరైతే బాగుంటుంది.? సర్వేలో ఆసక్తికర పేర్లు!

|

Updated on: Feb 10, 2024 | 6:58 PM

రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో అధికార బీజేపీ మరోసారి అధికారాన్ని దక్కించుకోవడం ఖాయమని చెప్పిన ఇండియా టుడే ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వే మరో ఆసక్తికర అంశంపై జనాభిప్రాయాన్ని వెల్లడించింది. బీజేపీలో ప్రధాని మోదీ వారసుడిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను 29 శాతం మంది, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను 25 శాతం మంది, నితిన్ గడ్కరీని 16 శాతం మంది కోరుకుంటున్నారని సర్వే తెలిపింది. డిసెంబర్ 15, 2023 నుంచి జనవరి 28, 2024 మధ్యకాలంలో సర్వే నిర్వహించినట్లు తెలిపింది. ప్రస్తుతం దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు ప్రధాని మోదీ అనడంలో సందేహం లేదు. అయితే బీజేపీ వ్యూహాలు, విజయాల వెనుక అమిత్ షా కూడా ఉన్నారు. అందుకే ఆయనను బీజేపీ ‘చాణక్య’గా పిలుస్తుంటారు. ఇక ఉత్తరప్రదేశ్ మఖ్యమంత్రిగా రెండవ పర్యాయం బాధ్యతలు నిర్వర్తిస్తున్న యోగి ఆదిథ్యనాథ్ అనతికాలంలోనే బీజేపీలో విశేష ఆదరణ పొందారు. పార్టీ శ్రేణుల్లో తన ఇమేజ్‌ను పెంచుకున్నారు. కార్యకర్తల్లో గౌరవాన్ని పొందారు. హిందుత్వ నాయకుడు కావడం, వివాదాలు ఉన్నప్పటికీ నేరస్థుల అణిచివేతకు ఆయన అవలంభిస్తున్న విధానాలు ప్రజాదరణకు కారణవుతున్నాయి.

ఇక రాజకీయ వర్గాల్లో ప్రశంసలు అందుకుంటున్న అగ్రనేత నితిన్ గడ్కరీ ప్రధానమంత్రి అయితే బావుంటుందని 16 శాతం మంది కోరుకుంటున్నారు. సమస్యలకు పరిష్కారం చూపగల వ్యక్తిగా పేరు పొందిన ఆయనను ప్రతిపక్ష నాయకులు సైతం ప్రశంసిస్తుంటారు. నితిన్ గడ్కరీ ప్రస్తుతం కేంద్ర రవాణా శాఖ మంత్రిగా సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రధాని మోదీ ఆదరణ విపరీతంగా పెరిగిపోయింది. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, 2019 లోక్‌సభ ఎన్నికల్లో మోదీ చరిష్మా అద్భుతంగా పనిచేసింది. ఇక ముచ్చటగా మూడోసారి కూడా బీజేపీ అధికారాన్ని దక్కించుకోవడం ఖాయమని ‘ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వే చెబుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..

Follow us
రూ. 15వేలోనే 108 ఎంపీ కెమెరా.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ ఫోన్‌
రూ. 15వేలోనే 108 ఎంపీ కెమెరా.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ ఫోన్‌
ప్రజాస్వామ్య బలోపేతానికి మోదీ పునాది వేశారు.. అమిత్ షా
ప్రజాస్వామ్య బలోపేతానికి మోదీ పునాది వేశారు.. అమిత్ షా
FCRA చట్టాన్ని మరింత బలోపేతం చేస్తామన్న కేంద్ర మంత్రి అమిత్ షా
FCRA చట్టాన్ని మరింత బలోపేతం చేస్తామన్న కేంద్ర మంత్రి అమిత్ షా
మోదీ 10 ఏళ్లలోనే నిజం చేసి చూపించారు.. టీవీ9 సమ్మిట్‌లో అమిత్‌షా
మోదీ 10 ఏళ్లలోనే నిజం చేసి చూపించారు.. టీవీ9 సమ్మిట్‌లో అమిత్‌షా
కేటీఆర్‌కు సీఎం రేవంత్‌ సవాల్‌.. ఒక్క సీటు గెలిచి చూపించండి అంటూ
కేటీఆర్‌కు సీఎం రేవంత్‌ సవాల్‌.. ఒక్క సీటు గెలిచి చూపించండి అంటూ
పోలవరం విషయంలో ఏపీ సర్కార్ సీరియస్‌గా లేదు: రాజ్‌నాథ్ సింగ్‌
పోలవరం విషయంలో ఏపీ సర్కార్ సీరియస్‌గా లేదు: రాజ్‌నాథ్ సింగ్‌
మహేశ్ బాబు మెచ్చిన 'పోచర్' వెబ్ సిరీస్‌ .. ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
మహేశ్ బాబు మెచ్చిన 'పోచర్' వెబ్ సిరీస్‌ .. ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
రేయ్ ఎవర్రా మీరంతా.! ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయ్.. దున్నపోతుపై..
రేయ్ ఎవర్రా మీరంతా.! ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయ్.. దున్నపోతుపై..
ప్రశాంత్ నీల్ ఫెవరెట్ డైరెక్టర్ ఎవరో తెలుసా.?
ప్రశాంత్ నీల్ ఫెవరెట్ డైరెక్టర్ ఎవరో తెలుసా.?
మోదీ నాయకత్వంలో గెలుపు అలవాటుగా మారింది, అమిత్ షా..
మోదీ నాయకత్వంలో గెలుపు అలవాటుగా మారింది, అమిత్ షా..