PM Modi Lunch: పార్లమెంట్ సమావేశం అనంతరం ఆ ఎంపీలకు మోదీ పనిష్మెంట్.!?
పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌కు శుక్రవారం ఆమోదం లభించింది. ఈ సమావేశానికి ప్రధాని మోదీ హాజరయ్యారు. ఇక బడ్జెట్ సమావేశంలో భాగంగా అధికార, ప్రతిపక్ష ఎంపీల మధ్య వాగ్వాదాలు జరిగాయి. అయితే శుక్రవారం సమావేశం ముగిసిన అనంతరం పార్లమెంట్ క్యాంటీన్‌లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు హాజరైన ప్రధాని శుక్రవారం అక్కడి క్యాంటీన్‌లో భోజనం చేశారు.
పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌కు శుక్రవారం ఆమోదం లభించింది. ఈ సమావేశానికి ప్రధాని మోదీ హాజరయ్యారు. ఇక బడ్జెట్ సమావేశంలో భాగంగా అధికార, ప్రతిపక్ష ఎంపీల మధ్య వాగ్వాదాలు జరిగాయి. అయితే శుక్రవారం సమావేశం ముగిసిన అనంతరం పార్లమెంట్ క్యాంటీన్‌లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు హాజరైన ప్రధాని శుక్రవారం అక్కడి క్యాంటీన్‌లో భోజనం చేశారు. పలు పార్టీలకు చెందిన నాయకులతో కలిసి ప్రధాని మోదీ మధ్యాహ్న భోజనం చేశారు. మోదీతో కలిసి లంచ్‌లో పాల్గొన్న ఎంపీలలో కేవలం బీజేపీకి చెందిన వారు మాత్రమే కాకుండా ఇతర పార్టీలకు చెందిన వారు కూడా ఉన్నారు. వీరందరితో మోదీ సరదాగా ముచ్చటిస్తూ లంచ్ చేశారు. వివిధ పార్టీలకు చెందిన మొత్తం 8 మంది ఎంపీలను లంచ్ కోసం ప్రధాని ఆహ్వానించారు. శుక్రవారం సమావేశం ముగిసిన అనంతరం ఆయాపార్టీల ఎంపీలను కలిసిన ప్రధాని మోదీ మీకు ఇప్పుడు పనిష్‌మెంట్ ఇవ్వాలి అంటూ సరదాగా ముచ్చటించారని సమాచారం.
ఇక మోదీతో కలిసి భోజనం చేసిన వారిలో బీజేపీ ఎంపీలు హీనా గావిత్, ఎస్ ఫాంగ్నాక్ కొన్యాక్, జమయంగ్ సెరింగ్ నంగ్యాల్, ఎల్ మురుగన్, టీడీపీ ఎంపీ రామ్ మోహన్ నాయుడు, బీఎస్పీ ఎంపీ రితేశ్ పాండే, బీజేడీ ఎంపీ సస్మిత్ పాత్రాలు ఉన్నారు. ఈ ఎంపీలందరికీ మధ్యాహ్నం రెండున్నర గంటలకు ప్రధాని ఫోన్‌లో లంచ్ సమాచారం అందించారని తెలుస్తోంది. వీరితో కలిసి మోదీ శాఖాహారం తీసుకున్నారు. భోజనంలో భాగంగా రాగి లడ్డూలు స్వీకరించారని పార్లమెంట్ వర్గాలు తెలిపాయి. ఎంపీలతో మోదీ భోజనం చేసిన సందర్భంగా దిగిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

