నేలపై తిరిగే మోడరన్ రంభలా రాశి ఖన్నా వయ్యారాలు..

Anil Kumar

21 December 2024

అందం అభినయం ఉన్న బ్యూటీస్ లో రాశి ఖన్నా ఒకరు. ఈ చిన్నది బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది.

హిట్లు , ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది రాశి ఖన్నా.. మీడియం రేంజ్ హీరోల లక్కీ హీరోయిన్ గా మారింది.

మీడియం రేంజ్ హీరోల సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక స్టార్ హీరో ఎన్టీఆర్ సరసన కూడా నటించి మెప్పించింది..

మొదట్లో ముద్దుగా బొద్దుగా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు సన్నజాజిలా మారిపోయింది. జీరో సైజ్ తో కవ్విస్తుంది రాశి.

అంతే కాదు గ్లామర్ గేట్స్ ఎత్తేసి ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ కవ్విస్తుంది. సోషల్ మీడియాలో ఈ చిన్నదానికి మంచి క్రేజ్ ఉంది. 

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రాశి ఖన్నా రెగ్యులర్ గా తన గ్లామరస్ ఫొటోలతో అభిమానులను కవ్విస్తుంది. 

తాజాగా మరోసారి తన స్టన్నింగ్ ఫొటోలతో చూపుతిప్పుకోనివ్వకుండా చేసింది రాశీ ఖన్నా.. ఈ ఫోటోలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. 

స్టైలిష్ డ్రెస్ లో వయ్యారాలు ఒలకబోస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది రాశి ఖన్నా. ఈ ఫోటోలకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.