కూతురిని అలా చూసిన తండ్రి.. తట్టుకోలేక ఏం చేశాడంటే..

కూతురు 9వ తరగతి చదువుతోంది.. అంతా బాగానే ఉంది.. ఈ క్రమంలోనే తన కూతురు ఓ యువకుడితో మాట్లాడటాన్ని ఆ తండ్రి చూశాడు.. ఆ తర్వాత దారుణ నిర్ణయం తీసుకున్నాడు.. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో చోటుచేసుకుంది. తన కుమార్తె ఓ యువకుడితో సన్నిహితంగా ఉండటాన్ని చూసి తట్టుకోలేకపోయిన తండ్రి..

కూతురిని అలా చూసిన తండ్రి.. తట్టుకోలేక ఏం చేశాడంటే..
Crime News
Follow us

|

Updated on: Feb 11, 2024 | 8:27 AM

కూతురు 9వ తరగతి చదువుతోంది.. అంతా బాగానే ఉంది.. ఈ క్రమంలోనే తన కూతురు ఓ యువకుడితో మాట్లాడటాన్ని ఆ తండ్రి చూశాడు.. ఆ తర్వాత దారుణ నిర్ణయం తీసుకున్నాడు.. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో చోటుచేసుకుంది. తన కుమార్తె ఓ యువకుడితో సన్నిహితంగా ఉండటాన్ని చూసి తట్టుకోలేకపోయిన తండ్రి ఆమెను హత్య చేయడానికి ప్రయత్నించిన అమానవీయ ఘటన అలీఘర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అలీఘర్‌కు చెందిన ఓ మైనర్‌ బాలిక తన స్నేహతుడితో మాట్లడుతుండగా కుటుంబసభ్యులు చూశారు. ఆ తర్వాత తమ పరువుపోతుందని కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. ఆ తర్వాత ఆమెను చంపాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే.. బాలికను బయటకు తీసుకెళ్లి.. ఆమె గొంతును మఫ్లర్‌తో నులిమి యమునా నదిలోకి తోసేసి పరారయ్యారు. ఆమె అరుపులు విన్న గ్రామస్థులు, అక్కడే ఉన్న ఆటో డ్రైవర్లు నదిలోకి దూకి కాపాడారు.

బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. తాను తన స్నేహితుడితో మాట్లాడుతుండగా కుటుంబసభ్యులు పట్టుకున్నారని, ఆ తర్వాత తనకు పెళ్లి చేయాలని నిశ్చయించినట్లు తెలిపింది. అందుకు తాను అంగీకరించకపోవడంతో హత్య చేయడానికి కూడా వెనకాడలేదని శిశు సంక్షేమ అధికారులకు వివరించింది. ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తున్న తండ్రి.. గురుగ్రామ్‌కు తీసుకెళ్తానన్న నెపంతో ఆమెను బైక్‌పై సమీపంలోని గ్రామానికి తీసుకెళ్లాడు. యమునా నదిపై ఉన్న పాంటూన్ వంతెన వద్దకు చేరుకోగానే, అక్కడికి తన మేనమామ వచ్చాడని తెలిపింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి మఫ్లర్‌తో ఆమె గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించారు. ఆపై వారు ఆమెను నదిలో పడేసి పారిపోయారని ఫతేహాబాద్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గిరీష్ కుమార్ తెలిపారు.

ఈ ఘటనపై బాధితురాలు, అలీఘర్‌కు చెందిన 16 ఏళ్ల యువకుడి ఫిర్యాదు మేరకు తండ్రి, మామ ఇద్దరిపై హత్యాయత్నం కేసు నమోదైంది. 9వ తరగతి విద్యార్థిని షెల్టర్‌ హోంకు తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నామని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రూ. 15వేలోనే 108 ఎంపీ కెమెరా.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ ఫోన్‌
రూ. 15వేలోనే 108 ఎంపీ కెమెరా.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ ఫోన్‌
ప్రజాస్వామ్య బలోపేతానికి మోదీ పునాది వేశారు.. అమిత్ షా
ప్రజాస్వామ్య బలోపేతానికి మోదీ పునాది వేశారు.. అమిత్ షా
FCRA చట్టాన్ని మరింత బలోపేతం చేస్తామన్న కేంద్ర మంత్రి అమిత్ షా
FCRA చట్టాన్ని మరింత బలోపేతం చేస్తామన్న కేంద్ర మంత్రి అమిత్ షా
మోదీ 10 ఏళ్లలోనే నిజం చేసి చూపించారు.. టీవీ9 సమ్మిట్‌లో అమిత్‌షా
మోదీ 10 ఏళ్లలోనే నిజం చేసి చూపించారు.. టీవీ9 సమ్మిట్‌లో అమిత్‌షా
కేటీఆర్‌కు సీఎం రేవంత్‌ సవాల్‌.. ఒక్క సీటు గెలిచి చూపించండి అంటూ
కేటీఆర్‌కు సీఎం రేవంత్‌ సవాల్‌.. ఒక్క సీటు గెలిచి చూపించండి అంటూ
పోలవరం విషయంలో ఏపీ సర్కార్ సీరియస్‌గా లేదు: రాజ్‌నాథ్ సింగ్‌
పోలవరం విషయంలో ఏపీ సర్కార్ సీరియస్‌గా లేదు: రాజ్‌నాథ్ సింగ్‌
మహేశ్ బాబు మెచ్చిన 'పోచర్' వెబ్ సిరీస్‌ .. ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
మహేశ్ బాబు మెచ్చిన 'పోచర్' వెబ్ సిరీస్‌ .. ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
రేయ్ ఎవర్రా మీరంతా.! ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయ్.. దున్నపోతుపై..
రేయ్ ఎవర్రా మీరంతా.! ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయ్.. దున్నపోతుపై..
ప్రశాంత్ నీల్ ఫెవరెట్ డైరెక్టర్ ఎవరో తెలుసా.?
ప్రశాంత్ నీల్ ఫెవరెట్ డైరెక్టర్ ఎవరో తెలుసా.?
మోదీ నాయకత్వంలో గెలుపు అలవాటుగా మారింది, అమిత్ షా..
మోదీ నాయకత్వంలో గెలుపు అలవాటుగా మారింది, అమిత్ షా..