సీఎఎఫ్ శిబిరంలో పేలిన తుపాకీ తుటా.. సహోద్యోగి జరిపిన కాల్పుల్లో ఇద్దరు మృతి, మరో ఇద్దరికి సీరియస్

ఛత్తీస్‌గఢ్ సిఎఎఫ్ శిబిరంలో బుధవారం(సెప్టెంబర్ 18) జరిగిన షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. బలరాంపూర్ జిల్లాలోని సిఎఎఫ్ శిబిరంలో సహోద్యోగి తన సర్వీస్ తుపాకీ ఉపయోగించి కాల్పులు జరపాడు.

సీఎఎఫ్ శిబిరంలో పేలిన తుపాకీ తుటా.. సహోద్యోగి జరిపిన కాల్పుల్లో ఇద్దరు మృతి, మరో ఇద్దరికి సీరియస్
Ambuliance
Follow us
Balaraju Goud

|

Updated on: Sep 18, 2024 | 4:04 PM

ఛత్తీస్‌గఢ్ సిఎఎఫ్ శిబిరంలో బుధవారం(సెప్టెంబర్ 18) జరిగిన షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. బలరాంపూర్ జిల్లాలోని సిఎఎఫ్ శిబిరంలో సహోద్యోగి తన సర్వీస్ తుపాకీ ఉపయోగించి కాల్పులు జరపాడు. ఈ ఘటనలో ఛత్తీస్‌గఢ్ సాయుధ దళం (సిఎఎఫ్) ఇద్దరు సిబ్బంది అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌కు దాదాపు 400 కి.మీ దూరంలో భుతాహి మోడ్ ప్రాంతంలో ఉన్న CAF 11వ బెటాలియన్‌కు చెందిన ‘B’ కంపెనీలో ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది.

ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అంకిత్ గార్గ్ తెలిపిన వివరాల ప్రకారం, కానిస్టేబుల్ అజయ్ సిదార్ తన ఇన్సాస్ రైఫిల్‌తో కాల్పులు జరిపాడు. ఫలితంగా కానిస్టేబుల్ రూపేష్ పటేల్ సంఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచాడు. మరో కానిస్టేబుల్ సందీప్ పాండే ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. గాయపడిన మరో ఇద్దరు సిబ్బంది, అంబుజ్ శుక్లా, రాహుల్ బఘేల్‌లను కుస్మీలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. శుక్లా పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్య చికిత్స కోసం అంబికాపూర్‌ ఆసుపత్రికి తరలిచారు.

కాల్పుల వెనుక అసలు ఉద్దేశ్యం తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాల్పుల శబ్దం విన్న సహోద్యోగులు అతన్ని పట్టుకున్నారు. CAF బెటాలియన్ నక్సల్ వ్యతిరేక కార్యకలాపాల కోసం ఈ ప్రాంతంలో మోహరించింది. ఈ ప్రాంతంలో సిబ్బంది ఎదుర్కొంటున్న సవాలపై కొంతకాలంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇందుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోంది. ఇంతలోనే ఈ విషాద సంఘటన వెలుగులోకి వచ్చింది. కాగా, ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులను వెలికితీయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..