AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bullet Proof Jacket: నక్సలైట్లు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లుగా ఏం ధరిస్తున్నారో తెలుసా..?

ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్-కోయిలిబెడ ప్రాంతంలోని కక్నార్ అడవుల్లో నక్సలైట్లతో ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశం నుండి పోలీసులు భారీ ఎత్తున వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. రికవరీ చేసిన పదార్థాల్లో 3 బుల్లెట్ గుర్తులతో కూడిన ప్లేట్ కూడా లభ్యమైంది. ఈ ప్లేట్ గురించి పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు.

Bullet Proof Jacket: నక్సలైట్లు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లుగా ఏం ధరిస్తున్నారో తెలుసా..?
Naxalite Bullet Proof Jacket
Balaraju Goud
|

Updated on: Mar 17, 2024 | 9:26 PM

Share

ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్-కోయిలిబెడ ప్రాంతంలోని కక్నార్ అడవుల్లో నక్సలైట్లతో ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశం నుండి పోలీసులు భారీ ఎత్తున వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. రికవరీ చేసిన పదార్థాల్లో 3 బుల్లెట్ గుర్తులతో కూడిన ప్లేట్ కూడా లభ్యమైంది. ఈ ప్లేట్ గురించి పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. బుల్లెట్ల నుండి తమను తాము రక్షించుకోవడానికి నక్సలైట్లు ఈ ప్లేట్‌ను ఒంట్లో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌గా ఉపయోగిస్తున్నారని పోలీసులు భావిస్తున్నారు.

కక్నార్ అడవుల్లో ఎన్‌కౌంటర్ అనంతరం హతమైన నక్సలైట్ మృతదేహాన్ని పోలీస్ ప్రధాన కార్యాలయానికి తరలించారు. చనిపోయిన నక్సలైట్‌ను మావోయిస్ట్ దళ కమాండర్ మాంకర్‌గా గుర్తించారు. ఎన్‌కౌంటర్ ప్రదేశంలో జరిపిన సోదాల్లో అనేక వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు కంకేర్ ఎస్పీ ఐకె ఎలిసెలా తెలిపారు. వీటిలో ఇలాంటి వస్తువు కూడా దొరకడం చూసి ఆశ్చర్యపోయారు. సాధారణంగా సైనికులు బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్లు వాడుతుంటారు. కానీ ఇప్పుడు నక్సలైట్లు కూడా సైనికుల బుల్లెట్ల నుండి తమను తాము రక్షించుకోవడానికి స్వదేశీ బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లను ఉపయోగిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.

మందపాటి గుడ్డను మడతపెట్టి, దాని ముందు స్టీల్ ప్లేట్ పెట్టినట్లు పోలీసు సూపరింటెండెంట్ ఇందిరా కల్యాణ్ ఎలిసెల తెలిపారు. ఇందులో 3 బుల్లెట్ల గుర్తులు కనిపిస్తున్నాయి. దీన్ని చూస్తుంటే బుల్లెట్ల నుంచి రక్షించుకునేందుకు నక్సలైట్లు ఒంట్లోనే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లాగా వాడుకుంటున్నారని తెలుస్తోందన్నారు ఎస్పీ.

శనివారం కక్నార్ అడవుల్లో నక్సలైట్లు సమావేశమైనట్లు పోలీసులకు సమాచారం అందింది. డీఆర్‌జీ, బీఎస్‌ఎఫ్‌ల సంయుక్త బృందం కక్నార్ అడవులకు చేరుకుంది. ఈ సమయంలో నక్సలైట్లతో ఎదురుకాల్పులు జరిగాయి. ఎన్‌కౌంటర్‌లో సైనికులకు ఎలాంటి నష్టం జరగలేదు. కానీ సైనికుల బృందం జరిపిన కాల్పుల్లో యూనిఫాంలో ఉన్న మావోయిస్టును ప్రాణాలు కోల్పోయారు. హతమైన నక్సలైట్ దళం నంబర్ 5 కమాండర్ అని చెబుతున్నారు. తాడోకి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మలమెట గ్రామంలో నివాసం ఉండే మాంకర్‌ అనే వ్యక్తిగా గుర్తించారు. హతమైన నక్సలైట్‌పై గతంలో రూ.8 లక్షల రివార్డు ప్రకటించారు పోలీసులు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
కివీస్‎ని ఉతికి ఆరేసిన మనోళ్లు..ఈ స్కోర్లు చూస్తే షాకే
కివీస్‎ని ఉతికి ఆరేసిన మనోళ్లు..ఈ స్కోర్లు చూస్తే షాకే