AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Witchcraft: క్షుద్రపూజలు చేస్తున్నారనీ.. ఒకే కుటుంబంలోని ఐదుగురిని కొట్టి చంపిన గ్రామస్థులు

ఛత్తీస్‌గఢ్‌ సుక్మా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. చేతబడి, క్షుద్ర పూజలు చేస్తున్నారని ఆరోపిస్తూ ముగ్గురు మహిళలతోసహా ఐదురుగురిని గ్రామస్థులు దారుణంగా కొట్టి చంపారు. ఈ సంఘటన కొంట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏక్తాల్ గ్రామంలో చోటుచేసుకుంది. మృతులను మౌసం కన్న (34), మౌసం బిరి, మౌసం బుచ్చా (34), మౌసం అర్జో (32), కర్కా లచ్చి (43), 11-నెలల కుమారుడు యష్గా గుర్తించారు..

Witchcraft: క్షుద్రపూజలు చేస్తున్నారనీ.. ఒకే కుటుంబంలోని ఐదుగురిని కొట్టి చంపిన గ్రామస్థులు
Witchcraft Deaths In Chhattisgarh
Srilakshmi C
|

Updated on: Sep 16, 2024 | 11:16 AM

Share

చత్తీస్‌గఢ్‌, సెప్టెంబర్‌ 16: ఛత్తీస్‌గఢ్‌ సుక్మా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. చేతబడి, క్షుద్ర పూజలు చేస్తున్నారని ఆరోపిస్తూ ముగ్గురు మహిళలతోసహా ఐదురుగురిని గ్రామస్థులు దారుణంగా కొట్టి చంపారు. ఈ సంఘటన కొంట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏక్తాల్ గ్రామంలో చోటుచేసుకుంది. మృతులను మౌసం కన్న (34), మౌసం బిరి, మౌసం బుచ్చా (34), మౌసం అర్జో (32), కర్కా లచ్చి (43), 11-నెలల కుమారుడు యష్గా గుర్తించారు. అప్రమత్తమైన పోలీసులు, ఉన్నతాధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ గ్రామంలోని ఐదుగురిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు. గిరిజనులు అత్యధికంగా నివసిస్తున్న సుక్మా జిల్లా ఇక్తాల్‌ గ్రామంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది.

ఛత్తీస్‌గఢ్‌లోని బలోడా బజార్ జిల్లా నుంచి సెప్టెంబర్ 13న ఇద్దరు దంపతులను, మరో ఇద్దరు మహిళను తీసుకొచ్చి గ్రామస్థులంగా దారుణంగా హింసించి, చంపిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో ఓ చిన్నారి కూడా మరణించింది. వీళ్లంతా ఒకే కుటుంబానికి చెందిన వారుగా గుర్తించారు. ఇద్దరు దంపతులు, భర్త ఇద్దరు సోదరీమణులు, చిన్నారిని సుత్తి, పదునైన ఆయుధాలతో కొట్టి చంపారు. ఆ గ్రామస్థులకు చేతబడి చేస్తున్నారనే అనుమానం కలగడంతో ఈ దారుణానికి పాల్పడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పసికందుతో సహా ఛిద్రమైన మృతదేహాలను చూసి నివ్వెరపోయారు. ఈ ఘటన రాష్ట్రంలో పెను సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు నిందితులను అరెస్టు చేశామని బలోడా బజార్ ఎస్పీ విజయ్ అగర్వాల్ చెప్పారు.

బాధితులు చేతబడి చేస్తున్నారనే అనుమానంతో కుటుంబంపై దాడి చేశారని తెలిపారు.ఈ హత్యలు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో కస్డోల్‌లోని ఛార్‌చెడ్ గ్రామంలో జరిగాయి. వీరందరినీ సుత్తి, పదునైన ఆయుధాలతో దారుణంగా కొట్టి చంపారు. ఆ సమయంలో ఇంట్లో లేకపోవడంతో అదే కుటుంబానికి చెందిన వృద్ధురాలు ప్రాణాలతో బయటపడిందని ఎస్పీ విజయ్‌ అగర్వాల్‌ తెలిపారు. కాగా మూడు రోజుల క్రితం ఇదే విధమైన ఘటన భాతపరా జిల్లాలో చోటుచేసుకుంది. చేతబడి చేస్తున్నాడని ఆరోపిస్తూ ఓ కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులను దారుణంగా హత్య చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?