Metro Services: సబ్‌వేలో ఇరుక్కుపోయిన మెట్రో రైలు.. వీడియోలు వైరల్.. భయంతో ప్రయాణికులు ఏం చేశారంటే..?
చెన్నైలో ఓ మెట్రో రైలు సబ్‌వే కింద సడెన్‌గా ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు భయబ్రాంతులకు గురయ్యారు. 10 నిమిషాల తర్వాత సమస్య పరిష్కారం కావడంతో రైలు యాధావిధిగా నడిచింది. విద్యుత్ సరఫరాలో అంతరాయం వల్ల ఈ సమస్య తలెత్తినట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు.

Chennai Metro: ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు మెట్రో సిటీలలో మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉన్నాయి. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లాంటి పెద్ద సిటీలలో మెట్రోలు సేవలు అందిస్తున్నాయి. పెద్ద నగరాల్లో జనాలు ఎక్కువ నివసిస్తూ ఉంటారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి జీవనం కొనసాగించేవారు కూడా ఎక్కువగా ఉంటారు. దీని వల్ల మెరుగైన రవాణా సౌకర్యం అవసరం. అందుకే మెట్రో సేవలను పెద్ద నగరాల్లో అక్కడి ప్రభుత్వాలు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే మెట్రో సేవల్లో అంతరాయం కలగడం వల్ల అప్పుడప్పుడు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా చెన్నై మెట్రోలో అలాంటి ఘటన ఒకటి జరిగింది.
చెన్నై మెంట్రో సబ్‌వేలో చిక్కుకుపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విమ్కో నగర్ నుంచి చెన్నై ఎయిర్‌పోర్ట్ వైపు వెళ్లే మెట్రో రైలు ఉన్నట్లుండి ఒక్కసారిగా సెంట్రల్ మెట్రో – హైకోర్టు స్టేషన్ మధ్యలో సబ్‌వే కింద నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులకు ఏమీ అర్ధం కాక భయపడిపోయారు. మెట్రో రైలు చాలాసేపు అయినా కదలకపోవడంతో కిందకు దిగి పట్టాలపై నుంచి నడుచుకుంటూ వెళ్లారు. దీనిపై మెట్రో అధికారులకు వివరణ ఇచ్చారు. ఈ ట్రైన్ నడిచే బ్లూ లైన్‌లో టెక్నికల్ ప్రాబ్లం, విద్యుద్ సరఫరాలో అంతరాయం వల్ల ఈ సమస్య ఏర్పడినట్లు వెల్లడించారు.
🚇 Chennai Metro scare this morning.A Blue Line train got stuck between Central & High Court stations.No power. Poor ventilation.Passengers waited ~10 mins, then were told to walk 500 meters through the tunnel to escape.This is not a minor glitch. This is a serious safety… pic.twitter.com/0fGKiLmo4m
— Tatvik🕉️ 🇮🇳🪷🚩 (@TatvikOm) December 2, 2025
మెట్రో రైలు సబ్‌వే కింద ఆగిపోవడం, అందులోని ప్రయాణికులు నడుచుకుంటూ వెళ్లడం చేసి కొంతమంది ఫోన్ కెమెరాల్లో ఆ విజువల్స్‌ను తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. దీంతో ఈ వీడియోలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. దాదాపు 10 నిమిషాల పాటు మెట్రో ఆగిపోవడంతో ప్రయాణికులు వెయిట్ చేయలేక 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైకోర్ట్ మెట్రో స్టేషన్‌కి నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించడంలో ఆ తర్వాత ట్రేన్ కదిలింది. ఈ సమస్యపై ప్రయాణికులకు మెట్రో అధికారులు క్షమాపణలు చెప్పారు. ఇలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
Service Update:
Metro train services between Airport and Wimco Nagar Depot on Blue Line have resumed normal Operation.
Puratchi Thalaivar Dr. M.G. Ramachandran Central Metro to St. Thomas Mount on the Green Line are also running as per the Normal Schedule.
We Regret the…
— Chennai Metro Rail (@cmrlofficial) December 2, 2025




