AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

chennai police makes e-pass mandatory చెన్నైలో ప్రయాణించాలంటే ఇక ఈ-పాస్ తప్పనిసరి ! పోలీసుల అర్ధరాత్రి ఉత్తర్వులు, అంతా గందరగోళం

లాక్ డౌన్ ఆంక్షలను మరింత కఠినంగా అమలు పరచేందుకు చెన్నై పోలీసులు కొత్త నిబంధనలు విధించారు. నగరంలో ఒక పోలీసు స్టేషన్ పరిధి నుంచి మరో పోలీసు స్టేషన్ పరిధికి వెళ్లేవారికి ఈ-పాస్...

chennai police makes e-pass mandatory చెన్నైలో ప్రయాణించాలంటే ఇక ఈ-పాస్ తప్పనిసరి ! పోలీసుల అర్ధరాత్రి ఉత్తర్వులు, అంతా గందరగోళం
Chaos After Chennai Police Makes E Pass Mandatory For Travel In City
Umakanth Rao
| Edited By: |

Updated on: May 18, 2021 | 6:08 PM

Share

లాక్ డౌన్ ఆంక్షలను మరింత కఠినంగా అమలు పరచేందుకు చెన్నై పోలీసులు కొత్త నిబంధనలు విధించారు. నగరంలో ఒక పోలీసు స్టేషన్ పరిధి నుంచి మరో పోలీసు స్టేషన్ పరిధికి వెళ్లేవారికి ఈ-పాస్ (రిజిస్ట్రేషన్) తప్పనిసరి అంటూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు గ్రేటర్ చెన్నై పోలీసు శాఖ సర్క్యులర్ ను విడుదల చేసింది. మంగళవారం నుంచే ఈ ఆంక్షలు అమలులోకి వస్తాయని నగర పోలీసు కమిషనర్ శంకర్ జివాల్ తమ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.12 పోలీసు స్టేషన్ల పరిధిలో 13 చెక్ పాయింట్లను ఏర్పాటు చేయాలని కూడా ఆయన ఆదేశించారు.ప్లవర్ బజార్, వాషర్ మెన్ పేట్, పులియంతోప్, అన్నా నగర్, అంబత్తూర్, కిల్పాక్, ట్రిప్లికేన్, మైలాపూర్, సెయింట్ ధూప్ మౌంట్, అడయార్, టీ నగర్ ఈ పరిధిలోకి వస్తాయి. పోలీస్ స్టేషన్ల లిమిట్స్ ను 348 సెక్టార్లుగా విభజించి..అప్పుడే రోడ్లపై బ్యారికేడ్లను కూడా ఏర్పాటు చేశారు. ఈ-పాస్ లేనిదే ప్రజలు ఒకచోటి నుంచి మరో చోటికి వెళ్లే వీలు లేదని స్పష్టం చేస్తున్నారు. అయితే ఈ ఉత్తర్వులను గతరాత్రి పొద్దుపోయిన తరువాత జారీ చేయడంతో ఈ రోజు వాహనదారులు అనేకమంది అయోమయానికి గురయ్యారు. గందరగోళంతో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ లు ఏర్పడ్డాయి.

ఈ-పాసులు లేని వాహనదారులను పోలీసులు వారి ఇళ్లకు తిప్పి పంపుతున్నారు. కొన్ని చోట్ల పోలీసులతో వాహనదారులు వాగ్యుధ్ధానికి దిగారు. ఉన్నట్టుండి ఈ ఉత్తర్వులేమిటని వారితో వాదించారు. కనీసం ఒక రోజు ముందు వార్తా పత్రికల్లో, టీవీల్లో ఈ ఉత్తర్వుల గురించి ప్రకటించి ఉండాల్సిందని అంటున్నారు.

మరిన్ని చదవండి ఇక్కడ:  Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ ఇంట్లో తీవ్ర విషాదం.. చివరి చూపు కూడా దక్కలేదంటూ ఎమోషనల్..

SonuSood Foundation: సోనూసూద్ ఫౌండేష‌న్ పేరుతో న‌కిలీ విరాళాల సేక‌ర‌ణ‌.. ఫ్యాన్స్‌ను అల‌ర్ట్ చేసిన సోనూ…

Follow Us
నేను రెడీ షూటింగ్ పూర్తి.. సమ్మర్‌లో విడుదల
నేను రెడీ షూటింగ్ పూర్తి.. సమ్మర్‌లో విడుదల
ఈ ఫోటోల మధ్య ఉన్న 3 తేడాలను 50 సెకన్లలో గుర్తిస్తే మీరే తోపులు!
ఈ ఫోటోల మధ్య ఉన్న 3 తేడాలను 50 సెకన్లలో గుర్తిస్తే మీరే తోపులు!
సినిమా కోసం అన్నీ తీసేశాడు..ఈ స్టార్ హీరోను గుర్తు పట్టారా?
సినిమా కోసం అన్నీ తీసేశాడు..ఈ స్టార్ హీరోను గుర్తు పట్టారా?
ఇలా చేస్తే ఇచ్చిన డబ్బు వడ్డీతో సహా మీ కాళ్ల దగ్గరకు వస్తుంది..
ఇలా చేస్తే ఇచ్చిన డబ్బు వడ్డీతో సహా మీ కాళ్ల దగ్గరకు వస్తుంది..
తెలంగాణ ప్రజలకు శుభవార్త.. విద్యుత్ సమస్యలకు వాట్సప్ సేవలు
తెలంగాణ ప్రజలకు శుభవార్త.. విద్యుత్ సమస్యలకు వాట్సప్ సేవలు
"ముందు మీ అహంకారం తగ్గించుకోండి".. భారత్ ఓటమిపై గవాస్కర్ ఫైర్
థియేటర్లలో అట్టర్ ప్లాప్.. టీవీలో సూపర్ హిట్ చేశారు..
థియేటర్లలో అట్టర్ ప్లాప్.. టీవీలో సూపర్ హిట్ చేశారు..
నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. త్వరలోనే భారీగా ఉద్యోగాలు!
నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. త్వరలోనే భారీగా ఉద్యోగాలు!
అనుమానపు భర్తపై భార్య కన్నెర్ర.. చివరికి ఇలా..
అనుమానపు భర్తపై భార్య కన్నెర్ర.. చివరికి ఇలా..
బొమ్మల కంపెనీ యజమాని ట్రంప్‌కు చుక్కలు చూపించాడు.!
బొమ్మల కంపెనీ యజమాని ట్రంప్‌కు చుక్కలు చూపించాడు.!