AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదెక్కడి విచిత్రం ? కోవిడ్ రోగి మృతదేహం పెట్రోలు, టైర్లతో దహనం, యూపీలో దారుణం, ఐదుగురు పోలీసుల సస్పెన్షన్

యూపీలోని బలియాలో గంగానది ఒడ్డున కోవిడ్ రోగిదిగా భావిస్తున్న మృతదేహాన్ని పెట్రోలు, టైర్లతో దహనం చేసిన ఘటన వివాదాస్పదమైంది. ఐదుగురు పోలీసులు

ఇదెక్కడి విచిత్రం ? కోవిడ్  రోగి మృతదేహం పెట్రోలు, టైర్లతో దహనం, యూపీలో దారుణం, ఐదుగురు పోలీసుల సస్పెన్షన్
Body Cremated Using Petrol
Umakanth Rao
| Edited By: |

Updated on: May 18, 2021 | 6:49 PM

Share

యూపీలోని బలియాలో గంగానది ఒడ్డున కోవిడ్ రోగిదిగా భావిస్తున్న మృతదేహాన్ని పెట్రోలు, టైర్లతో దహనం చేసిన ఘటన వివాదాస్పదమైంది. ఐదుగురు పోలీసులు దగ్గరుండి మరీ ఈ విచిత్రమైన అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. వారి సూచనపై ఓ వ్యక్తి ఆ డెడ్ బాడీపైని కట్టెలపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. మంటలు సరిగా కాలేందుకు టైరును కూడా ఆ మంటల్లోకి తోస్తున్న వీడియో సొషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నదిలో తేలియాడుతూ ఘాట్ కి కొట్టుకువచ్చే మృతదేహాలకు గౌరవ ప్రదంగా అంత్యక్రియలు జరపాలని, ఇందుకు ఆర్ధిక సహాయం కూడా చేస్తామని సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. గుర్తు తెలియని మృతదేహాలకు సదరు మతాచారాల ప్రకారం అంత్యక్రియలు జరిగేలా చూడాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. కానీ బలియా పోలీసులు ఇంత బాధ్యతారాహిత్యంగా, నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఉన్నతాధికారులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఆ అయిదుగురు పోలీసులను సస్పెండ్ చేశారు.

రెండు రోజుల క్రితం రెండు మృత దేహాలు ఇక్కడికి కొట్టుకువచ్చాయి. సమాచారం అందగానే పోలీసులు అక్కడికి చేరుకొని వాటిలో ఒక డెడ్ బాడీకి ఇలా అంత్యక్రియలు నిర్వహించారు. కాగా ఇప్పటికీ గంగానదిలో కొన్ని మృతదేహాలు కొట్టుకువస్తూనే ఉన్నాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీనివల్ల తమ ఆరోగ్యాలు దెబ్బ తింటున్నాయని, నది నీరు కలుషితమై పోతోందని వారు అంటున్నారు.. ఇటీవల బీహార్ లోని బక్సర్ జిల్లాలో కూడా గంగా నదిలో కొట్టుకువచ్చిన డెడ్ బాడీలు ఒడ్డుకు రాగా ఆ ప్రభుత్వం..యూపీపై మండిపడింది.

మరిన్ని చదవండి ఇక్కడ:  Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ ఇంట్లో తీవ్ర విషాదం.. చివరి చూపు కూడా దక్కలేదంటూ ఎమోషనల్..

SonuSood Foundation: సోనూసూద్ ఫౌండేష‌న్ పేరుతో న‌కిలీ విరాళాల సేక‌ర‌ణ‌.. ఫ్యాన్స్‌ను అల‌ర్ట్ చేసిన సోనూ…

Follow Us