ఆ ఉద్యోగులకు ముందస్తు రిటైర్మెంట్ ఇవ్వండి: కేంద్రం

30ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులందరి సర్వీసు రికార్డులను మదింపు చేయాలని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

ఆ ఉద్యోగులకు ముందస్తు రిటైర్మెంట్ ఇవ్వండి: కేంద్రం
Follow us

| Edited By:

Updated on: Aug 31, 2020 | 7:43 AM

Government Employees Retirement: 30ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులందరి సర్వీసు రికార్డులను మదింపు చేయాలని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ క్రమంలో అసమర్థ, అవినీతి అధికారులకు ముందస్తు రిటైర్మెంట్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర సివిల్ సర్వీసెస్‌(పెన్షన్‌) రూల్స్, 1972 కింద 56 (జె), 56 (ఐ), 48 (1)(బి) నిబంధనల ప్రకారం ఉద్యోగి పనితీరును పరిశీలించి, అతడికి రిటైర్మెంట్‌ ఇచ్చే హక్కు సంబంధిత అధికారికి ఉంటుందని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ విడుదల చేసిన ఆదేశాల్లో పేర్కొంది. ముందస్తు రిటైర్మెంట్ అన్నది‌ శిక్ష కాదని తెలిపింది.

ఉద్యోగి 50 లేదా 55 ఏళ్లకు చేరుకొని, 30 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నాక తరువాత ప్రజాప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం ఎప్పుడైనా సదరు ఉద్యోగిని ఇంటికి పంపొచ్చని ఆ ఆదేశాల్లో వెల్లడించింది. ”ఉద్యోగుల సామర్థ్యాన్ని అంచనా వేసి వారిని సర్వీసులో కొనసాగించడంపై ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ అవుతుంటాయి. ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల విషయంలో మరింత స్పష్టత ఇవ్వడానికి, దాని అమలులో ఏకరూపత తీసుకురావడానికి తాజా ఆదేశాలు జారీచేశాము” అని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ తెలిపింది. ఇక రిటైర్మెంట్‌ ఇవ్వాలనుకున్న ఉద్యోగికి 3 నెలల నోటీసులు ఇవ్వలని, లేకపోతే మూడు నెలల జీతం ఇవ్వాలని స్పష్టం చేసింది.‌ దీనికి సంబంధించి ఉద్యోగులందరి వివరాలతో కూడిన రిజిస్టర్‌ను ప్రతిశాఖలో నిర్వహించాలని, ఏడాదికి నాలుగుసార్లు ఈ జాబితాను మదింపు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

కాగా మరోవైపు రిటైర్‌ అయ్యే ఉద్యోగులకు పెన్షన్‌కి సంబంధించిన పత్రాల కోసం ఎదురుచూసే బాధ తప్పనుంది. వారి పెన్షన్ పేమెంట్‌ ఆర్డర్‌ను ఎలక్ట్రానిక్ రూపంలో ఇకపై నేరుగా ఉద్యోగుల డిజిటల్ లాకర్‌కి పంపనున్నట్లు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయమంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. పెన్షన్ ప్రక్రియలో ఇక ఆలస్యం ఉండదని, పెన్షన్ ఆర్డర్ పత్రాలను పోగొట్టుకునే ప్రమాదం కూడా ఉండదని జితేంద్ర సింగ్ వివరించారు.

Read More:

”టాలీవుడ్‌లో డ్రగ్స్ లేకుండా పార్టీలు జరగవు”..

వీడిన శ్రీవాణి హత్యోదంతం

భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..