AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

One Nation One Election: ఈ పార్లమెంటు సమావేశాల్లోనే జమిలీ ఎన్నికల బిల్లు.. ఇక మళ్లీ ఎన్నికలు తప్పవా..?

కేంద్రం 'జమిలి' ఎన్నికల బిల్లును ఈ పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్‌పై రామ్‌నాథ్ కోవింద్ కమిటీ నివేదికను కేబినెట్ ఇప్పటికే ఆమోదించింది.

One Nation One Election: ఈ పార్లమెంటు సమావేశాల్లోనే  జమిలీ ఎన్నికల బిల్లు.. ఇక మళ్లీ ఎన్నికలు తప్పవా..?
MLC Election
Velpula Bharath Rao
|

Updated on: Dec 10, 2024 | 7:54 AM

Share

కేంద్ర ప్రభుత్వం తన వన్ నేషన్  వన్ ఎలక్షన్  ‘జమిలి’ ఎన్నికల బిల్లును ప్రస్తుత పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్‌పై రామ్‌నాథ్ కోవింద్ కమిటీ నివేదికను కేబినెట్ ఇప్పటికే ఆమోదించింది. ప్రభుత్వం ఇప్పుడు బిల్లుపై ఏకాభిప్రాయాన్ని ఏర్పరచాలని కోరుకుంటోందని, వివరణాత్మక చర్చల కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ లేదా జెపీసీకి పంపవచ్చని సమాచారం. దేశవ్యాప్తంగా ఉన్న మేధావులతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీల స్పీకర్లను కూడా ఈ  జాయింట్ పార్లమెంటరీ కమిటీ మీటింగ్‌కు పిలవవచ్చు. సామాన్యుల అభిప్రాయం కూడా తీసుకుంటారని తెలుస్తుంది.

“వన్ నేషన్  వన్ ఎలక్షన్” అమలు కోసం రాజ్యాంగాన్ని సవరించడానికి కనీసం ఆరు బిల్లులు పాస్ చేయాల్సి ఉంటుందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.  అయితే దానికి ప్రభుత్వానికి పార్లమెంటులో మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం ఉంటుంది.పార్లమెంటు ఉభయ సభల్లో ఎన్‌డీఎకు సాధారణ మెజారిటీ ఉన్నప్పటికీ, ఏ సభలోనూ మూడింట రెండొంతుల మెజారిటీ సాధించడం చాలా కష్టతరమైన పనే చెప్పాలి.రాజ్యసభలోని 245 సీట్లలో ఎన్డీఏకు 112, ప్రతిపక్ష పార్టీలకు 85 ఉన్నాయి. మూడింట రెండొంతుల మెజారిటీకి ప్రభుత్వానికి కనీసం 164 ఓట్లు అవసరం.

లోక్‌సభలో కూడా 545 సీట్లకు గాను ఎన్‌డీఏకు 292 సీట్లు ఉన్నాయి. మూడింట రెండు వంతుల మెజారిటీ మార్క్ 364 వద్ద ఉంది. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల విధానం వల్ల సమయం, డబ్బు, శ్రమ వృథా అవుతోందని ప్రభుత్వం కొంతకాలంగా ఏకకాలంలో ఎన్నికలను నిర్వహించాలని ఎన్డీఏ సర్కార్ కంకణం కట్టుకుంది. కొన్నిసార్లు అనేక దశల్లో జరిగే రాష్ట్ర ఎన్నికలను నిర్వహించడంలో పోల్ కమీషన్ ఎదుర్కొంటున్న లాజిస్టికల్ సవాలును ఎత్తి చూపుతూ ప్రతిపక్షం ఈ ఆలోచనను సరికాదని విమర్శిస్తుంది. “ఒక దేశం ఒకే ఎన్నికలు” అమలు 2029 తర్వాత మాత్రమే సాధ్యమవుతుందని  రామ్‌నాథ్ కోవింద్ కమిటీ  నివేదికలో సిఫార్సు చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి