AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Honeytrap: ఆన్‌లైన్‌ వలపు వలలో పడకండి.. భద్రతా బలగాలకు హెచ్చరికలు

ఇటీవల భద్రతా బలగాల్లో పనిచేసే సైనికులు వలపు వలలో పడిపోయి సున్నితమైన సమాచారాన్ని చేరవేయడం లాంటి ఘటనలు జరుగుతున్నాయి. అయితే ఈ విషయం కేంద్ర నిఘా సంస్థలు అప్రమత్తమయ్యాయి. కేంద్ర భద్రతా బలగాల్లో పనిచేస్తున్న వ్యక్తులపై వలపు వల విసిరి దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని కాజేస్తున్న ఘటనలకి సంబంధించి.. కీలక ఆదేశాలు జారీ అయ్యాయి.

Honeytrap: ఆన్‌లైన్‌ వలపు వలలో పడకండి.. భద్రతా బలగాలకు హెచ్చరికలు
Honeytrap
Aravind B
|

Updated on: Aug 27, 2023 | 7:26 AM

Share

ఇటీవల భద్రతా బలగాల్లో పనిచేసే సైనికులు వలపు వలలో పడిపోయి సున్నితమైన సమాచారాన్ని చేరవేయడం లాంటి ఘటనలు జరుగుతున్నాయి. అయితే ఈ విషయం కేంద్ర నిఘా సంస్థలు అప్రమత్తమయ్యాయి. కేంద్ర భద్రతా బలగాల్లో పనిచేస్తున్న వ్యక్తులపై వలపు వల విసిరి దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని కాజేస్తున్న ఘటనలకి సంబంధించి.. కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. ఆన్‌లైన్‌‌లో పరిచయాలు పెంచుకొనే జోలికి వెళ్లొద్దని.. అలాగే సోషల్ మీడియాలో ఫొటోలు పెట్టడం.. రీల్స్‌ చేయడం వంటివి కూడా చేయకూడదని అందులో తెలిపారు. వీటి వల్ల హానీట్రాప్‌‌ల ముప్పు పెరుగుతుందని.. అలాగే సున్నితమైన సమాచారం శత్రువులకు చేరుతుందని పేర్కొ్న్నారు.

ఇదిలా ఉండగా ఇటీవలే కేంద్ర నిఘా సంస్థలు పరిశీలన చేపట్టాయి. అయితే ఇందులో తెలిసిందేంటంటే కొంతమంది సిబ్బంది యూనిఫామ్‌తో ఉన్నటువంటి తమ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తు్న్నట్లు ఆ సంస్థ పేర్కొన్నారు. అంతేకాకుండా సున్నితమైనటువంటి స్థావరాల్లో దిగినప్పటి ఫొటోలను షేర్ చేస్తూ ఆన్‌లైన్‌లో స్నేహితుల కోసం రిక్వెస్టులు పంపుతున్నచ్లు చెప్పారు. దీనివల్ల వారు అప్రమత్తంగా ఉండకపోతే హనీట్రాప్‌లకు పడిపోయే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అలాగే తమ మార్గదర్శకాలను ఎవరైన ఉల్లంఘిస్తే తీవ్రంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంచామని హెచ్చరికలు జారీ చేశారు. సీఆర్‌పీఎఫ్‌, బీఎస్‌ఎఫ్‌, ఐటీబీపీ‌లో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి ఈ ఆదేశాలు జారీ చేశారు. ఈ బృందాల్లో పనిచేసే సిబ్బంది జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరోవైపు ఢిల్లీ పోలీస్ కమిషనర్‌ సంజయ్‌ అరోడా కూడా తమ బలగాలకు ఇటువంటి హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం విధుల్లో ఉన్నప్పుడు సామాజిక మాద్యమాలు వాడకూడదని సూచనలు చేశారు. అలాగే దేశ భద్రతకు సంబధించిన సున్నితమైన సమాచారాన్ని కూడా పోస్టు చేయకూడదని అన్నారు. మరో ముఖ్య విషయం ఏంటంటే యూనిఫామ్‌లో రీల్స్‌, వీడియోల వంటివి కూడా చేయకూడదని అన్నారు. హై-సెక్యూరిటీ ప్రాంతాల ఉన్న వీడియోలు.. అలాగే ప్రముఖులకు సంబంధించినటువంటి వీడియోలు కూడా తీయకూడదని హెచ్చరికలు జారీ చేశారు. ఇదిలా ఉండాగ ఈ మధ్య కేంద్ర భద్రతల బలగాల్లో పనిచేసే సిబ్బంది ఇతరులరు దేశ భద్రతకు సంబంధించిన విషయాలను పంపుతున్న ఘటనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర నిఘా సంస్థలు అప్రమత్తమ్యాయి. ఎలాగైనా వీటికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయించుకున్నాయి.ఒకవేళ దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారం పాకిస్థాన్, చైనా లాంటి దేశాలకు వెళ్తే.. భారతదేశ భద్రకి ముప్పు ఉన్నట్లే. అందుకే ఎప్పుడు కూడా అలాంటి వాటి జోలికి వెళ్లకూడదని కేంద్ర నిఘా సంస్థలు హెచ్చరిస్తున్నాయి.